Wren టు స.
లూ శ అ అం 1 అ
£EVT- ౨౦6% sis IY
నన.
(ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు
తిలక్ రోడ్, హైదరాబాదు - 500 001.
SAMEEKSHANAM
మలిముదణ : 2000 ఫిబ్రవరి (పతులు : 1000
ముఖ వత రచన : ఏలె లక్ష థ్
మూల్యం : రూ. 36/-
(ప్రతులకు : ఆంధ్ర సారస్వత పరిషత్తు తిలక్ రోడ్, హైదరాబాదు - 500 001.
అక్షర కూర్చు & ముద్రణ : జ.£ట.ఆల్. గ్రాఫిక్స్ రెడ్ హిల్స్, హైదరాభాద్ - 4... ఫోన్ : 6505681
ఈ సంపుటిని గురించి
లప్పుడెప్పుడో వెలువడింది నేను అప్పుడప్పుడు రాసిన వ్యాసాల సంపుటి 'వ్యాసవాహిని'గా.
ఆ తర్వాత పత్రికల్లో (ప్రకటించినవీ, ఆకాశవాణి (ప్రసరించినవీ, సంకలనగ్రంథాల్ల్ ప్రచురించినవీ - ఒక పది వ్యాసాలను సేకరించి వంశీవారు ఈ సంపుటిగా ముద్రించి నా యాభయ్యోజన్మదినోత్సవ సందర్భంలో కానుకగా సమర్పించారు. అందుకు నేను కృతజ్ఞణ్న.
ఈ వ్యాసాల్లో సగం యువభారతివారి సంపుటాల్లో వెలువడినవే. వాటిని పునర్ముద్రించుక్ వడానికి అంగీకరించిన యువభారతికి కృతజ్ఞతలు.
మా(త్రాచ్చందస్సులను గూర్చిన వ్యాసం ఇరవై యేళ్ల క్రితం రాసింది. ఇప్పుడు రాస్తే ఇంకా మెరుగ్గా ఉండేదేమో. అయినా విద్యార్దులకు మాత్రా చృందస్సుకు సంబంధించిన (ప్రాథమిక పరిజ్ఞానం కలిగిస్తుందనే దృష్టితో ఈ సంపుటిలో చేర్చాను.
జూలై, 1981 | 2, సాలాయిణంట్దు
వ్యాస సూచిక
పోతన: పునఃపరిశీలన
జాషువా కవితావ్యక్తిత్వం
యెంకి పాటల్లోని కావ్యత్వం
మలేభాషా పదజాలం - కొన్ని విశేషాలు ఆశ్చర్యాస్థకాల్లో ఆప్తస్మరణం అచ్చుతప్పుల్లో మెచ్చుతునకలు మాత్రాచ్చందస్సులు
సారసౌరభం
ఆముఖం
10. ఆనాదు అన్నది - ఈనాడు ఉన్నది
పోతన: పునఃపరిశీలన
బమ్మెరపోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది. భాగవతం అనగానే భక్తిలో తడసిన గాథలు అలలు అలలుగా పొంగివస్తాయి - గజేంద్రమోక్షం, ప్రహాదచరిత్ర, వామనచరి(త, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళో పాఖ్యానం- ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఎకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్యం. వ్యాసునంతటి వాడే వేదాలను ఎంగడించి, అష్టాదశపురాణాలు విరచించి, బ్రహ శ్యసూత్రాలను ప్రవచించి, భారతాన్ని (ప్రబంధీకరించి, అప్పటికీ మనసు నిండక “హరికీ, యోగివరులకూ అభిలషితమైన భాగవత గాథ పలుకనైతిన” అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరో మణ్యయైన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చుకున్నాడు.
వ్యాసభారతం తెలుగుసేత ఆం(ధ్రకావ్యలక్ష్మికి అసలైన కైసేత. ఆ యమ్మను అంతకుముందు చిటిపొటి నగలతో సింగారించిన తెలుగు కవులు లేకపోలేదు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాలపాటలూ, నివాళి పాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి, లేక తాటాకులలోనో, రాగిరేకులలోనో, రాతిపలకలపైనో ముక్తక(ప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా (గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే. అంటే నేటి (గ్రాంధీకభాషకు పాదులువేసినవారు నన్నయ్య, తిక్కన్న, ఎరన్నలే. భాషకేకాదు, తెలుగులో కావ్యరచానాశైలిని తీర్చిదిద్దింది కూడా ఈ మూర్తిత్రయమే. చతుర్వేదసారమైన వ్యాసభారతం వారిచేతిలోపడి కావ్యచిక్కణత్వాన్ని సంతరించుకుంది. పద్యవిద్యకు ఆద్యుడైన వాలీ శకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్యారా తెలుగుపొలంలో పదంమోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూలకందాలైన మూడు (గ్రంథాలలో భారతరామాయణాలు ఆంధ్రావళి చేతికందినవి. ఇక మిగిలింది వ్యాసభాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది. చూపు పడినా
సమోక్షణం ల
చేయిసాచే చొరవ ఏ కవికీ కలగనట్టుంది. ఆ మహాభాగవతఫలం ఒక తెలుగు చిలుకకొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో ఓరుగల్లుగడ్డలో బమ్మెరక్‌మ్మ పై అప్పటికే విరభద్రవిజయాన్ని ee se a భోగినిదండకాన్ని జక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. ఆ శుకరాజే మన పోతరాజు. ఆ “శుకముఖసుధా[ద్రవమున మొనసియున్న భాగవతఫలరసాస్వాదనం తెలుగురపికభావవిదుల మహిత భాగధేయం.
' ఎరభ[ద్రవిజయం రచించేనాటికి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్మృతులు (వ్రాయనివాడు. తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ప్రసాదమహిమచే ఆ "కృతిని రచింపగలిగాడు. వీరభద్రవిజయం పోతన్న చేయనున్న సెద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుక పెట్టిన భోగినీదండకం మలిచాలు. ఆ తరువాత పోతన్న మనసు మలుపుతిరిగింది. అటు ఏరశైవమతం ముదా ఇటు రసికరాజాను మతం మీదా దృష్టి తొలిగింది. వ్యాసునికి విష్ణుకథ విరచించని కొరత తొచినట్ల మన పోతన్నకు “శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచన కుతూహలం” ఎుట్మలించింది. అది రాకానిశాకాలం. సోమోపరాగసమయం. గంగాస్నానం. మహేశ్వర ధ్యానం - అదీ పోతన్న స్థితి. “కించిదున్మీలిత లోచనుడై” ఉండగా రామభ(ద్రుని సాక్షాత్కారం. మహా భాగవతం తెలుగుసేయుమని ఆనతి. వెరగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి, చిత్రం, పోతన్నకు కలిగిందేమో విష్ణుకథా రచనాకుతూహలం. చేసిందేమో మహేశ్వరధ్యానం, కట్టెదుట నిలిచినవాడో రామచంద్రుడు. ఆ మహానుభావుడు సూచించిన వస్తువో గోవిందకథాకదంబమైన భాగవత(గంథం. అంకితం తనపరనే అన్నాడు ఆ రామరాజు. జొ నన్నాడు మన పోతరాజు. “శ్రీ రామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని” “హారిక, నంద గోకులవిహారికి” అంటూ షష్ట్యంతా లెత్తుకొని ఆంధ్రభాగవతాన్ని చిన్ని కృష్ణునికి సమర్పించుకున్నాడు. రామన్నను (శ్రోతగా నిలుపుకొని భాగవతగాథను విన్నవించు కున్నాడు. అది చిత్రమా కాదు. వోతన్న పంవాందించుకున్న సమచిత్తం. శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు. ఈ నాలుగు మూర్తులను ఎకత్ర భజించడం పోతన్న అభేదభక్తికి అఎలలేని తార్కాణం. ఇంతటి సమన్వయదృక్పథం అప్పటి మతవాతావరణంలో అపూర్వం.
3 min నారాయణరెడ్డి
ఏ కథను ఏరుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితాలక్ష్యాలను ఏరకంగా సిద్దాంతీకరించాలి? ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు. కృత్యాద్యవస్థ్ర అంటే ఇదే. ఆది కవి నన్నయభట్టారకునికీ ఇది తప్పలేదు. అవతారికలో రాజరాజును గూర్చీ తనను గూర్చి చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు. తాను బ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు. అది ప్రధానంగా రాజరాజు మన్నిక. హిమకరుడు మొదలుకొని పాండవోత్తములవరకు తీగసాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది. అది కాస్త తన కులబ్రాహ్మణుడైన నన్నయ చెవిలో వేశాడు. భారతశ్రవణం అనెక పుణ్యఫల(ప్రదమని దానికి ప్రాతిపదికగూడా వేశాడు. ఆ రాజపోషకుని అనుమతంతో, విద్వజ్ఞనుల అనుగ్రహంతో తాను “నేర్చిన విధంబున” వ్యాసభారతాన్ని తెనిగించాడు నన్నయ భట్టారకుడు. తెలుగులో ఆది కవి నన్నయ్య. సంస్కృతంలో ఆదికవి వాల్మీకి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదలి భారతాన్ని చేపట్టడానికి ప్రధానకారణం రాజరాజుకు భారతంపట్ల గల అభిమానం అని తేలిపోయింది. అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్చ లేదెమో అని అనుకోవలసివస్తుంది. అవతారికా రచనలోనూ తదనంతరకవులకు నన్నయ్యే మార్గదర్శి. తిక్కన్న స్టూలంగా ఆ సంఎధానాన్ని అనుసరించినా కొంచెం కొత్తదారి తొక్కాడు. నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎేన్‌రో సూచించిన వస్తువు కాదు. తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక. సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించాడు. భాగవతావతారికను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దాడు. తిక్కన్న లాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారతరచనాకౌతుకం కనబరిస్తే పోతన్న శ్రీమన్నారాయణ కథా (ప్రపంచ విరచనాకుతూహలం కనబరిచాడు. అతడు నిద్రించే సమయంలో “కలలో కన్నట్లుగా” హరిహరనాథుడు కనిపిస్తాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వరధ్యానం చేస్తూ కన్నులరమూసుకొని ఉండగా రామభద్రుడగుపిన్తాడు. “కరుణారసము పొంగితొరగెడు చాడ్సున” అన్న సీసపద్యంలో హరిహరనాథుణ్ని రూపుకట్టించాడు తిక్కన్న. “మెటుగు చెంగటనున్న మేఘంబుకైవడి” అన్న సీసపద్యంలో సీతానాథుణ్ని
సమాక్షణం 4
చిత్రించాడు పోతన్న. అతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాథుడు సెలవిస్తాడు - భారతరచనా ప్రయత్నం భవ్యపురువార్థతరు పక్వఫలమని; దానిని తనకు కృతి ఇమ్మని. ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు - మహాభాగవతం 'తెనుగుసేయు'మని, తనపేర అంకితమిమ్మని. తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, నరేశ్వరుణ్నికాక సర్వేశ్వరుణ్ని కృతిపతిగా నిర్ణయించడం తిక్కన సోతన్నలకున్న సమధర్మం. ఈ కృతులు రచించేనాటికి ఇద్దరి మనః(ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారతరచనం తిక్కన్న దృష్టిలో భవబంధవిమోచనం. ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకున్నాడు.
“పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండంట, నే(
బలికిన భవహర మగునట;
పలికెద వేతొండుగాధథ( బలుకంగ నేలా?”
నాలుగు పలుకులను ప్రాసస్తానంలో చిలికి పులకలు వలార్చ్భుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ 'సహజ పాంఉత్యు నికి అది తెలియదా? అదీ విన్నవించుకున్నాడు.
“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు శూలికైన( దమ్మ చూలికైన విబుధజనులవలన ఎన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపణుతు.”
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమె. రామాయణం అలలా సాగిపోయే మనిషికథ. భారతం భిన్నలౌకిక (ప్రవృత్తుల సంఘర్షణవ్యథ. భాగవతం స్టూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక, సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్య మధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంత(గంథులున్న మహాగంథం. ఆ ముడులు విప్పుడం హారునికీ విరించికీ దుష్కరమే. మరి ఆ భాగవతరహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతన పై వేసి వ్యాసభాగవత వ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచాడు
ద్ క్ స నారాయణరెడ్డి
ఈ వినయశీలుడు. ఈ తేటపరచడం ఏ తెలుగులో? నన్నయ్య (ప్రారంభించిన తత్సమపదబహుళమైన తెలుగులోనా? లేక పాలకురికి సోమన్న (ప్రఘోషించిన జానుతెనుగులోనా; పోతన్న సాత్యికత అహంతలకూ వింత వింత పుంతలకూ అతీతమైనది.
“కొందతికి( దెనుగు గుణమగు.;
గొందటికిని సంస్కృతంబు గుణమగు; రెండున్ గొందజికి గుణములగు, నే నందతి మెప్పింతు( గృతుల నభ్యైయెడలన్”
కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపెస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ్య, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు. వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. (ప్రౌఢంగా పలికితే సంస్కృత భాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటక భాష అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగానీ, తామసం గానీ, పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాథుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వ మూర్తికి అద్దం పట్టింది. ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తా అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత ఒత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతనుగుతనం.
నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించారు. భాస్కర రంగనాథాదులు రామాయణాన్ని అందించారు. నాచనసోమన, మారనవంటివారు పురాణాలను అనువదించారు. ఎరెవ్వరూ తమ పురాకృత శుభాధిక్యంవల్ల భాగవతాన్ని తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించాడు పోతన్న. వేయి నిగమాలు చదివినా సుగమం కాని ముక్తి భాగవతనిగమం పరిస్తె అత్యంతసుగమం అని విశ్వసించాడు. ఆ ముక్తివాంఛే భాగవతరచనకు మూలం, మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం.
సబూక్షణం బ్ర
“శ్రీకైవల్యపదంబుం జేరుటకునైచింతించెదన్ లోకర
క్షకారంభకు భక్తవొాలనకళా సఠరళనకున భోననో
'ర్రేకస్తంభకుం గేళిలోలవిలసద్దుగ్దాలసంభూతనా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనొడింభకున్.” (|
ఇది నాందీశ్టోకం వంటి పద్యం. ఆశీర్ష్మమ్మస్కియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం 'దీని లక్ష్యం. “న శ్రీవాణీగిరిజాశ్సిరాయ ” అని నన్నయ అన్నాడు. శ్రీయన గౌరినాంబరగు' అని తిక్కన అన్నాడు. 'శ్రీకైవల్య్వపదంబు'ను పోతన ప్రస్తావించాడు. ఈ పద్యంలో నమ(స్కియతో పాటు వస్తునిక్షశం కూడా ఉండడం ఏశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అతడవతారపురుషుడు. లోకరక్షణం ఆ అవతారానికి (పేరణం. అతడు గజేం(ద్రాదిభక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపుప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింపజేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుస్ట్రశిక్షణకూ పా ఆకరదా టర భాగవతకథాచ[క్రం ఈ రెండు అంశాలచుట్టే చం[క్రమించింది. ఈ రకంగా పోతన పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిరేశించాడు. మరొక విశేషం. ఈ పద్యంలోని నందాంగనాడింభకుడు కేవల
©
ళ్
స్టితికారుడ కాదు. స్పష్టికారుడు కూడా. “కీలిలోల విలసద్దుగ్జాల సంభూతనానా కంజాత భవాండకుంభకు' అనే ప్రయోగంలో అది ధ్వనించింది. దానన (్రేకస్తం భకు' అనే మాటలో అతని లయకారత్వం స్సురించింది. అంటే ఈ పద్యంలో నందింపబడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. విశ్లేషంచుకుంటే టోధపడే అర్థమిది. కాష్టంకంటే ధూమం, ధూమం కంటే త్రయీమయమైన వహ్ని ఏశేషమైంది. అలాగే తమోగుణం కంటే రజోగుణం రజోగుణంకంటే (బహ్మ(ప్రకాశకమైన సత్వం విశిష్టమైంది. అందుకే తొల్లిటి మునులు సత్య్యమయుడని భగవంతుడైన హరీన
కొలిచారు. ఆ భగవంతుని ' సత్తనిర్భరస్వరూపమే పై పద్యంలో ఉల్రైేఖింపబడింది.
అవతారికలోని రచనాలక్ష్యాన్న శైవ తార నాందిపద్యాన్ని పరిశీలించినా తన ధ్యెయం కైవల్యమెనని బోధపడుతుంది. భవబంధరాబాత్యం, జన్మనాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన వాంఛించిన పరమపదం; పురాజన్మ
అ ల కాలాల రా నలా.
ర్ట (ప్రథమ స్కంధం ss 59
~
డా! సి. నారాయణరెడ్డి
తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి, భాగవతంలోని ప్రధానరస భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.
ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్యాలవాసి
ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా “ఈశ్వరార్చన కళాశీలుండ” ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృ్ళంగార కృతి రచించినా పోతన మహాభక్తుడుగానే పేరొందాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తి ప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగారప్రసక్తివల్లనూ, శ్రీనాథుడు శృంగార సనాథుడుగా స్థిరపడ్డాడు. రుకి ణీకల్యాణం, రాస(క్రీడాభివర్షనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగారదంతురితాలైన వర్షనలు చేసినా “పోతన్న తెలుగుల పుణ్యపేటి”' గానే క్షీర్తింపబడుతున్నాడు. ఇందుకు ఒక కారణం కాలం గడిచినకొద్ది విరిచుట్టూ అంతక కట్టుకథలు. మరొకకారణం కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ము(ద్రలు. శ్రి, న్సీసాధుని కృతులన్ని నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జలఘట్టాలన్న రాచకొలువులకే సమర్సితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినిళ్లు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజమూర్తి అటు కృష్ణుల్జో ఇటు శివుణ్జో దుయ్యబట్టాడు”. ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగువెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో నిక్కిపడే గౌడడిండిమ భట్టును ఉద్భట వివాదప్రాఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్లస్నానం చేయించ కునే దాకా తృప్తిపడని మత్యహంకృతి
£2 Ut పుల్లనరోజునేత యల పూల న న చన్ను వి విషంబు (ద్రావితం చల్ల దవాగి మింగితి నటంచును నిక్కెదవేల తిం(తిణీ పల్హనయ్యుక క్రమౌ నుడుకు. బచ్చలిశాకము బొన్సకూటితో మెల్లన నొక్క ముద్ర దిగమైంగుము నీపస గాననయ్యెడిన్.
(ii) సిరగలవానికిం చెల్లును
తరుణుల పదియాజువేల దగ బెండ్లాడన్ తిరిపెమున కిద్ద జాండడ్రా పరమేశా; గంగ విడుము; వాళ్తతి చాలున్.
సమోక్షణం 8
అతనిది. దిక్కు మొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడఊపిరిలో కూడా కవితలల్లగల్లిన (ప్రాఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు. సిరులకై ఉరుకులాడలేదు. అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని (ప్రకటించలేదు. పూర్వకవులతొపాటు, వర్తమానకవులతో పాటు భావికవులను కూడా బహూకరించిన ఏనయభూషణుడతడు. సమకాలీన కవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సంస్కారానికి నిదర్శనం. ఈ సంస్కారం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్యగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చి, నరాధిపపరాజ్మఖత్యాన్ని గూర్చి కొన్ని చాటుకథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞ సింగభూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం ఇదో కథ. శ్రినాథుడూ పోతన్నా స్వయానా బావమరుదులు. పోతన్న పొలం దున్నుతుంటే ఆ 'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్డు లేకుండా నాగలి సాగిపోవడం ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుకకంటి నీరు చనుకట్టు' మీద పడేటట్లు బావురు మనడం, అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మ నమ్మా అని ఈ పరమభక్తుడు ఓదార్భడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ “ఇమ గనుజేశ్వరాధ ముల కిచ్చి" అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులంబడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె" నని అవతారికలోని మరో పద్యం ఇచ్చే సాక్ష్యం. పోతన్న పేరు చెప్పితేనే సగటుసాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తుకొస్తుంది. ఈపద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్స్ కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్యరచనల్ ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని, 3. ఇమ్మనుజేళ్ళరాధథముల కిచ్చి వురంబులు వాహనంబులున్ సొమ్ములు. గొని పుచ్చుకొని సొక్కి శరీరము. బానీ కాలుబే నమ్మెటవేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె ని బమ్మెరవోతరా జొకండు భాగవతంబు జగద్రితంబుగన్.
9 నా స్, నారాయణరెడ్డి
“సాక్కి”, “శరీరం వాసి” “కాలుచే సమ్మెట(వైటులు”* “సమ్మతి” “ఇచ్చిచెప్పె” “ఈ బమ్మెరపోతరా జొకండు” ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదనవలసిన అవసరం లేకుండానే మరొక అంతస్ఫాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందున్నది 'ఉభయకావ్యకరణదక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్ళరాధములి పద్యంలో 'బమ్మెరపోతరాజొక(డు' అంటూ ప్రథమ పురుషం దూకుతుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత “అని మదీయ” అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్సాన్ని బట్టి కాక అన్వయదోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతరకాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో; సింగయ్య భాగవతంలోని షష్ట సర్కధాన్ని రచించాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెర పోతరాజును స్మరించాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్యమిది :
“ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నంగం బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూటులు చేసినవాని భక్తిలో
నమ్మినవాని భాగవతనైస్టికుండై తగువాని6 బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజు. దలంచి (మొైక్కెదన్”. '
ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మను జేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె ఈ బమ్మెర పోతరాజొకండు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో “పన్నగ రాజశాయికిన్ 'సొమ్ముగ ...... భాగవతనైఫ్టికుడై ...... తగువాని ....... బమ్మెర పోతరాజు” అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో నాము ్యలు' 'బమ్మెరి ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆఆ మాటలేఉన్నాయి. అక్కడ 'జగద్దితంబుగన్' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నంగ' అని ఉంది. “సమ్మతి శ్రీహరి కిచ్చి” చెప్పకు అని అందులో ఉండే ఆ స్వామికి 'సామ్ముగ వాక్య సంపదలు సూణులు' చేయడం ఇందులో
4. ఆంధ్రప్రదేశ్‌సాహిత్య అకాడమీ ప్రతినిబట్టి 'సమ్మెటవాటులే” అనుకోండి.
సమోాక్షణం 10
ఉంది. ఈ రెండు పద్యాల్గోనూ పోతన్నభక్తితత్సరతే ఉగ్గడింపబడింది. పైగా రెండు పద్యాల గతికూడా ఒకేస్టితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యె ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే అనుమానం కలుగుతుంది. అలా కాదుట పద్యానికే సింగన్న పద్యం అనుకరణవేమో-అని ఎవరైనా వాదించవచ్చు. అందుకు నా సమాధానం మొదట చెప్పిందే. పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, ధారాసిద్దిలో గానీ ఈ పద్యంలో పోతన్నము([ద్ర ఏ మాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైనఎమి' లాంటి పంక్తులు సోతన్నవే అంటే అర్ధముంది. 'హాలికులు 'కొద్దాలికులు' అంటూ 'ప్రాసస్టానంల్ గుప్పించిన అనుపాససౌరభం ఇందుకు నాక్ష్యం.
అవతారిక దృష్ట్యానే కాక భాగవతకథల్ల్ ఉపాఖ్యానాల్స్ పోతన్న మూలా తిరిక్షంగా పెంచిన పట్టులనుబట్టి, 'పర్ఫిన పద్యాలనుబట్టీ, అతని సత్వరమణీయ మూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లోదుని నిశ్చయంల్, గోపికల తదగతిల్,, వామనుని ఉత్తేజంలో ఇవేకాక నవవిధభక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్సుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరిచినోయి, ఆయా భాగవతుల ((్రఎళా కీర్తనలకు లోనై ఆ పాత్రలన్న తానై పరవశించి, పద్యసంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర. భాగవతంలో కోకొల్లలు. అందుకే అంటున్నాను - అవతారికలోనే కాక ఆం(ధ్రభాగవతంలో కూడా అడుగడుగున పోతన్న సాత్త్వికచిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విష్పారినవని.
నవవిధభక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ (గంథం వ్యాస భాగవతం. ఆ భక్తి రసఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలి సారిగా మధురభక్తికి పచ్చలతురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుండు పలికించిన భక్తిశాఖలివి :
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్భనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్”
దీనికి పోతన్న చెసిన తెలుగుసేత ఇది -
11 డో సై; నారాయణరెడ్డి
“తనుహృద్భాషల సఖ్యమున్, (శ్రవణమున్, దాసత్వమున్, వందనా
రృనముల్, సేవయు, నాత్మలో నెణుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్, హరిన్ నమ్మి స
జ్ఞనుడై యుండుట భద్రమంచుందలతున్ సత్యంబు దైత్యోత్తమా”
(ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, (ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తి శాఖలకు విరబూసిన ప్రసూనాలు. (ప్రహ్లాదుడు, రుక్మిణి, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమభాగవతసత్త్యం, అరీణ భక్తితత్త్యం శబలసుందరంగా కనిపిస్తాయి. ఇది చెప్పాలని (ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో పలికించాడు పోతన్న!
“మందారమకరందమాధుర్యమునం దేలు
సమధుపరబటు నవస ముదనముతలకుో అంటాడు. మరోసారి -
'కంజాక్షునకుగాని కాయంబు కాయమె' అంటాడు. ఇంకోసారి - 'కమలాక్షు నర్చించు కరములు కరములు" అంటూ లాటానుప్రాసల్లో ఉద్దాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం' ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడో ఎన్ని తీర్లంటాడో విసుగులేదు భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోషమని అనిపించనే అనిపించదు పరవశించిన ఆ లేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్డ్ కోటికెక్కిన 'మందారమకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వికుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవపురాణంలోనూ ఈ పద్యంపోలికలే ఉన్నాయి.
“రాకామలజ్యోత్సు (దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి (ద్రావ' * అని సోమన్న అంటే -
'పూర్లేందు చంద్రికా స్ఫురిత చకొరకం
౧ టేనివపురలాణరి
సమిక్షణం 1
బరుగునే సాంద్ర నీహారములకు” అని పోతన్న అంటాడు. 'విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియునే ప్రబ్బలి విరుల” ”
అని సోమన్న అంటె - 'మందార్ మకరంటి మాధుర్యమునందేలు మధుపంబు వోవునే మదనములకు”
అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యం వల్ల పోతన్న కెందుకువచ్చింది? అక్కడే ఉందిపోతన పోత. 'మందారి “మాధుర్య 'మధుపి 'మదనములు' - ఎన్ని మకారాల(వ్రాకారాలు కట్టాడు! పద్యాన్ని ఎంత ప్రాసాద రమ్యంగా నిలబెట్టాడు. అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టాడు. తరువాత వాళ్లైవరైనా ఈ శైలిని అనుకరిస్తై జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టాడు. మరి “కమలాక్షు నర్చించు కరములు కరములు” కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో -
“శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ” అని శ్రీనాథుడెన్నడో అన్నదే. కానీ లోకానికి తెలిసింది. “కమలాక్షు నర్శించు కరములు కరము”లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధతోరణమే.
నవవిధభక్తుల్లో “శవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్భనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం” ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటె భిన్నతత్త్యం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ట గలరక్తికీ భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్భన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలుడున్నాడు. అర్జునుడున్నాడు. ఏళ్ళది (ప్రధానంగా
7. బినవవురాణం
13 డా॥ స. నారాయణరెడ్డి
సఖ్యభక్తి. ఆనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణ, వందన, పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధుర భక్తికి మూల మేది ? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మ నుండి ఖండశః అంశతః విడివడిన బీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనయే భగవ(ద్రతి భావనకు (ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్యాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపికలున్నారు. వాళ్ళకు ఇళ్లూ వాకిళ్లూ ఉన్నాయి. కొందరికి పతులూ సుతులూ ఉన్నారు. అయినా శారద యామినిలో యమునాతీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదెపదె స్మరించుకొని ఇలా ఆ(క్రందిస్తారు - “నల్లనివాండు పద్మనయనంబులవాండు కృపారసంబు పై జల్లెడువా(డు మౌళిపరిసర్పితపంఛమువాండు నవ్వు రా జిల్లైడు మోమువా(డొకండు చెల్వలమానధనంబు ఠొది-నో మల్లియలార। మీ పాదలమాటున లేండుగదమ్మ చెప్పరే.” మధ్య మధ్య ఆ మాధవుడు, ఆ గోపికామనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సం(భ్రమిస్తాయి - “అదె నందనందను డంతర్హితుండయ్యె. బాటలీతరులార। పట్టరమ్మ. సూలావతుల( గృష్ణ | యేల పాసితి వని యెలేయలతలార । యడుగరమ్మ. వనజాక్షుండిచటికి వచ్చి వారు గదో చూతమంజరులార | చూడరమ ఖై మానినీమదనుతో మారాక యెతిశగించి మాధఎలతలార । మనుపరమ్మ.
సమోక్షణం 14
జాతిసతులం బాయ నీతియె హరికని జాతులార । దిశల. జాటరమ్మ. కదళులార । పోయి కదలించి శిభిపింఛ జూటు( దెచ్చి కరుణ జూపరమ్మ.
సమస్త చరాచరజీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ ఘూాధనడ తమధవుడని (భ్రమించారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్గ(ప్రవృత్తే ఈ మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్లనంలో హృదయంగమంగా చిత్రించాడు పోతన,
లోకంలో భక్తకవులు పలువురున్నారు. వారందరు (ప్రజాకవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన (ప్రజాకవులుగా ప్రాచుర్యం సొందిన భక్త కవులు. మరి (ప్రజాకవి ఎవడు? సామాన్యప్రజల జీవిత సమస్యలను చిత్రించేవాడు. ఇది బాగా వాడుకలో ఉన్న అభిప్రాయం. స్టూల దృష్టితో చూస్తే పోతన్న (ప్రజాకవి కాలేడు. అతడు (ప్రజల దైనందిన జీవితసమస్యలను బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావపరంపరలకు (శుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో (ప్రహ్హాదునివంటి ఆజన్మజ్ఞానులున్నారు. గజేం(ద్రునివంటి అర్లజ్ఞానులున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపరి పీడితులున్నారు. ఆయా భక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మాలసూ(త్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తిపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన
సామాన్యప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియెన పోతన్న (ప్రజాకవియెనాడు. — య అవల a a
“కలడు కలం డనెడువాడు కలడో లేడో” అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు. ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. “ఇందుగలడందులేడని సందేహము వలదు”. ఇది ఏ (ప్రహాదభాషితమో కానక్కరలేదు. ఏ దృఢసంకల్పుని కైనా ఇది సరిపోతుంది. “ఊరక రారు మహాత్ములు”. దీన్ని ఏ గర్గమునికో ముడిపెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది. “ఎందరో మహానుభావులు” అన్నంత వ్యాప్తి పొందిన సూక్తి ఇది. అయితే ఈ సూక్తి సహజగాంభీర్యాన్ని కాస్త వదలుకొని, కాలంగడిచినకొద్దీ ఛలోక్తిగా మారడం కూడా జరిగింది. అంటే సామెతలకోవలో చేరిందన్న మాట. ఒక కవి రచించిన పద్యవాదాలు సామెతలుగా, లోకోక్తులుగా చెలామణీ కావడంకంటె ఆ కవికి అంతకుమించిన
15. డా॥ సి . నారాయణరెడ్డి
ప్రాచుర్యం ఏముంది? ఇలా లెక్కించుకుంటూ పోతే పోతన్న వేలవేల పద్యాల్గ్‌ంచి వందలాది పాదాలను ఉదాహరించవలసివస్తుంది. 'ప్రాచీనాంధ్రకవులలో బహుళంగా ఉదాహరింపబడుతున్న వాళ్లల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు పోతన్న. మరొకడు వేమన్న, వేమన్న అక్షరాలా ప్రజాకవి. అధిక్ష్రపం అతని ఆయుధం.
ంఘసంస్కరణం అతని లక్ష్యం. అతని (ప్రతిపద్యం (ప్రజల బీవితాలకు సంబంధించిందే. అతని ప్రతి విసురు పచ్చని ప్రజాజీవనాన్ని తొలిచే చిడపురుగులకు . సంబంధించిందే. ప్రజలభాషలో (ప్రజలసమస్యలను చిత్రికపట్టి వేమన్న ప్రజాకవియెనాడు. భాగవతుల భక్తిభావనలను సామాన్య ప్రజల ఆర్తికి పర్యాయంగా సమన్వయించి పోతన్న ప్రజాకవియెనాడు. బమ్మెరకు వెళ్లి అక్కడి పాలాల నడిగితే చెబుతాయి-ఇదిగో ఇది పోతన్నగుడి, అదిగో అది మల్లన్నమడి అని. పోతన్న గుడి నిజంగా గుడి కాదు. పాతుకొని ఉన్న ఒక రాతిపలక. ఆ రాతిపలకను పోతన్నకు ప్రతిరూపంగా నేటికీ అక్కడి పల్లియులు భావించుకుంటున్నారంటే ఇప్పటికి పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో ఊహించుకోవచ్చు. మరి మల్లన్న మడి మాటేమిటి? ఈ పోతన్న కొడుకైన రైతన్న దున్నిన పొలమది.
కవితాకేదారాన్ని పండించిన హాలికుడుగా, అన్ని వేళలా తలచుకోవడానికి అనువైన పద్యఖండాలను అందించిన ఆదర్శమానవుడుగా పోతన్న చిరంజీవి. భావికవులను బహూకరించిన ఆ పరమభాగవతునికి తప్ప అంతంతమాత్రం వానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్యలభావి. ఎప్పుడో పొట్టి వడుగైనస వామనమూర్తి ఇంతై అంతై అంతంతై మూడు లోకాలను ఆ(క్రమించినట్లు - ఎక్కడో బమ్మెరవంటి చిట్టూరిలో పుట్టిన పోతన్న మూడు కాలాలను ఆకట్టుకునే అమృతకృతులను నిర్మించగలిగాడు. అవతారికలో అతడు నివేదించుకున్న ఈ పద్యం చూడండి.
“ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్ తెనుంగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తా నెట్టిదో తెనుంగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా జననంబున్ సఫలంబు. జేసెద( బునర్జన్మంబు లేకుండలోన్” భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.
శో
జాషువా కవితావ్యర్తత్వం
“రాజు మరణించి నొక తార రాలిపోయె కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించె రాతి విగ్రహములందు సకల జీవించె (పజల నాలుకలయందు' .
జాషువా సుకవి. అతన వ్యక్తిత్వం సంస్కార(ప్రియుల హృదయాల్న్ బీవిస్తున్నది. అతని కవితావ్యక్తిత్వం (ప్రజల నాలుకల జీవిస్తున్నది. అసమసమాజం బాకులు గుమ్మినప్పుడు, అంటరానితనం విషాగ్నులు చిమ్మినప్పుడు, దుర్భర దారిద్ర్యం వెన్నాడినప్పుడు, దురంతవేదన గుండెల్లొ తుకతుక ఉడికినప్పుడు జాషువా గురొస్తాడు. అతని 'ఫిరదౌసి” గుర్తొస్తుంది. 'గబ్బిలం' జ్ఞాపకానికి వస్తుంది. శ్మశాన వాటి” నిట్టూర్వు పొగలతో కట్టెదుట నిలబడుతుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఖండకృతులు (ప్రతిఘటనకు ఓంకృతులై ప్రతిధ్వనిస్తాయి.
జాషువా కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేము. అవి ఒకదాని కొకటి కారకాలు, ఉపస్మ్కొారకాలు, అవిఖాజ్యంగా కొరిసిముండ్‌న
అనలజాలలు.
బాల్యంలో తన ఊళ్ళో నాటకం చూద్దామని టిక్కెట్టు కొనబోతూ ఉంటే
“నీవు అంటరానివాడివి, రాకూడదని ఈసడింపబడినప్పుడు, తెలుగుభాష మీది మక్కువతో పురాణేతిహాసాలు చదువుతూ ఉంటే, “జాషువా హిందువైపోతున్నా”డని స్వమతస్టులుసిత్కరించినప్ప డు, కో పురపు పుకవుల అవధానం విని తాను వ్రాసిన అభినందనపద్యాలను వేదికపై నుంచి వినిపించాలనే కుతూహలాన్ని "అంత్యవర్లజాడు సభలో ప్రవెశార్హుడుకా” డన అన్యవర్జాల వారు తృణీకరించి
నప్పుడు, అటు హిందువులు ఇటు |కైస్తవులూ విడివిడిగా తనను వెలివేసినప్పుడు, పాడుపడ్డ మసీదే పాఠశాలగా, గుడ్డి దీపమే గురువుగా భారత భాగవతాలు తాను చదువుకున్నప్పుడు. సాలీళ్చు, గిజిగాళ్లు, గబ్బిలాలు, కముజులు, తన నేస్తగాళ్లై కల్నళ్లు
స్తా డౌ॥ సిం నారాయణరెడ్డి
తుడిచినప్పుడు జాషువా తరుణ హృదయంలో చెలరేగిన ఒక్కొక్క వేదనా స్పులింగం ఒక్కొక్క ఖండకృతిగా రూపొందింది. జాషువా కవితకు ఊపిరి అతని శ్యాసకోశాలు ఎగజిమ్మిన ఆవిరి.
కవితకు ప్రభుత చేసిన అన్యాయం ఫిరదౌసిలోని ఇతివృత్తం. అస్పృశ్యుని ఆత్మక్షభ “గబ్బిలా”నికి అంతరంగం. సమతాదృక్పథం “శ్మశానవాటి”కి నేపథ్యరంగం.' ఇలా అతని లఘుకృతులూ, ఖండకృతులూ (ప్రాయికంగా స్వాను భూతులకు ఆ॥(మైేడితాలే.
జాషువాకున్న ఎన్నో బిరుదుల్లో 'కవికోకిల' ఒకటి. అన్ని బిరుదుల్లోనూ అన్వర్హంగా నిలిచిపోయింది ఇదే.
చిలక ఫలరసాలను ఆన్యాదిస్తుంది. అంత తియ్యగానూ పలుకుతుంది. తుమ్మెద పూలతేనెలను గ్రోలుతుంది. అంతకమ్మగానూ రుంకరిస్తుంది. మరి కోకిల ఫలాలను ముట్టదు. పూలను తాకదు. కొమ్మలమాటున ఉంటుంది. ఒగరుచిగుళ్ళను మేస్తుంది. అవ్యక్తమధురిమలను సంతరించుకున్న కుహూగీతం వినిపిస్తుంది. చిలకపలుకు చెట్టుదాటదు. తుమ్మెదరొద తోట దాటదు. కోకిల కుహూనాదం కోనదాటి, కొండదాటి, కోటదాటి, పేటదాటి విశ్వాంతరాళంలో మారు(మోగుతుంది.
జాషువా అజ్ఞాతుడుగా, అనాదృతుడుగా సంఘం మాటున బ్రతికాడు. చేదుబాధల చిగుళ్ళను పస్ స్వాదుకవితలు ఆలపించాడు. పీనుకొరతడట్, గుంటూరుదాటి, సమస్తాంధ్రం అంచులుమీటి ఎక్కెడెక్కడ తెలుగుందో ఎక్కెడెక్కడ అ(శ్రుసిక్షమైన కనువెలుగుందో అక్కడిదాకా జాషువా కలగీతం పయనించింది. అందుకే జాషువా కవికోకిల. తీయగా పలికినందుకూ కాదు; “పంచమస్వర" సామ్యాన్నిబట్టి కొందరు భంగ్యంతరంగా ఊహించినందుకూ కాదు.
వరకవీంద్రుని కవిత్వం ఎలా ఉంటుందో చెప్పిన పద్యంలో జాషువా
కవితాదృకృథం ధ్యనిస్తున్నది. ఆ దృక్పథమే జాషువా కవితాస్వరూపానికి అక్షరాలా వర్తిసుంది.
1. ఇట నస్త్రుళ్ళత సంబరించుటకు తానేలేదు' : శశాన వాటిక (ఖండకావ్యము హు)
సమోక్షణం 18
మదమరాళంబుల కుదురైన నడకలో
రాణించు సహజంపు రాజసంబు కదనుద్రొక్కు గుతాల గర్వంపుమెడలవం
పులనుట్టిపడు కులుకుల పసందు నెలకూనలంటని అండుజవ్వన కుచ
ద్వయి నేలు వలరాచవాని బిగువు కలికిగులాబిమొగ్గలమిది విశ్వమో
హనమైన సున్నితమైన మెదుపు
మధురరసమును గడుపున మాటుకొన్న
ద్రాక్షఫలగుళుచ్చముల యందముల తూగు
వరకవింద్రుని కావ్యప్రపంచమందు
ప్రతిపదంబున మదికి దర్శనమొసంగు. *
ఈ పద్యంలో ఉత్తమకవిత్యానికి ఉండవలసిన సమగతి, వక్రోక్తి, ప్రాఢి, మార్దవం, మాధుర్యం సూచింపబడ్డాయి. శ్రీనాథుడు భీమఖండం అవతారికలో ఇలాంటి అభిప్రాయాలనే ప్రకటించాడు.
హరచూడాహరిణాంకవ(క్రతయు, కాలాంతస్సురచ్చండకా
పరు షోద్గాఢపయోధరస్సుటతటీపర్యంతకాఠిన్యమున్
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులం
జిరకాలంబు నటించుచుండు కవిరాజీగేహరంగంబులన్.
శ్రీనాథుని వక్రత జాషువా సూచించిన కదను దొక్కే గుర్రాల మెడల వంపుల్లో ఉంది. వంపు అంటే వ(క్రతే కదా! శ్రీనాథుడు తెలిపిన పయోధరకారిన్యం జాషువా సూచించిన “కుచద్యయి బీగువులొ ఉంది, ఈ కాఠిన్యం (ప్రొఢికి రూపాంతరం. శ్రీనాథుడు ప్రకటించిన సరసత్యాన్ని జాషువా “మధురరసం”గా రూపొందించాడు. కవితాలక్షణనిర్దేశంలో శ్రీనాథునికీ, ఈ అభినవశ్రీనాథునికీ ఎంతో సాదృశ్యం ఉంది. పద్యం నడకలోగూడా శ్రీనాథుని ముద్ర జాషువాపై నిర్లిద్రంగా ఉంది. గలగలపారే మాటలగొలుసులమధ్య, ప్రాఢతానిర్భరంగా సాగే
Pr DT cr Tr rr TET LPR Rin sR TT TTT RI TTT rT TTT TLL cb LE ననన TRL ETE TTT TTT TT TTT TTT TTR rR ERT ETE TET ఆల
wa ఖండకావ్త (యఘు -2.
16 డౌ॥ సి. నారాయణరెడ్డి
సమాసాలమధ్య, పాదమధ్యంలో, ప్రాయికంగా యతిస్థానంలో చిన్న సంబోధన విసరడం ఇద్దరికీ ఆజానజంగా అలవడిన అలంక్రియలు. అతడు “పక్షీ! సేయు దాక్షిణ్యమున్” అని అంటే ఇతడు “తబిసిపిట్టా ! నీకు మేలయ్యెడున్” అంటాడు. “ఢక్కామల్లు పసందు” వంటి శార్జూలాలు, 'ఆకాశరామ నిళ్ళాడు చక్కదనాల' వంటి సీసాలు జాషువా శ్రీనాథుని మూసలో పోసి తీసినవే. అరబ్బీ, ఫారసీకపదాలు, ఉర్తూమాటలు విరివిగా ప్రయోగించడంలోనూ ఈ కవులిద్దరూ కవలబిడ్డలే. అసలు ప్రాచీనాంధ్రసాహిత్యంలో శ్రీనాథుడు ప్రయోగించినన్ని అన్యదేశ్యాలు (అరబ్బీ, ఫారసీ, ఉర్దూ) మరెవ్వరూ ప్రయోగించలేదు. గుల్ల్హాము (గులాం-బానిస) కుల్లా (కులాహ్-టోపి) హజారము (హుజ్రా-ఆస్టానం), కుందనము (కుందన్- బంగారము). ఖుసి (ఖుషి-సంతోషం) లాంటి అన్యదేశ్యాలు శ్రీనాథుని కృతుల్లో యాభైకి పైగా దొరుకుతాయి. జాషువాలాగా వుంఖానుపుంఖంగా ఉరూ, ఫారసీక పదాలను ప్రయోగించినవారు లేరు. అవి కేవలం ప్రయోగవైచిత్రికోసం స్వీకరించినవి కావు. జనంలో నలిగిపోయినవే. వ్యవహారంలో అనునిత్యం ఎదురుపడేవే. కుమ్మక్కు (కుమ్మక్ - సహాయం) నగిషీ (నళ్ట అలంకరణ), హయాం (అయ్యాం-దినాలు, రోజులు) గలభా (ఘల్భు-గొడవ) పురమాయించి (ఫర్మానా-సెలవిచ్చుట) ఇంకా షరాబ-. కులాస, నసీబు, తయారు, ముస్తాబు, మామూలు, దర్గా, ధీమా, పసందు, కోనకిస్కాగాడు వంటి ప్రయోగాలు జాషువా కవితలో కోకొల్లలుగా దొరుకుతాయి.
స్వమతస్టులూ, అన్యమతస్థులూ తనను నిరసించినప్పుడు, జాషువా సాయెబులపంచలో కొన్నాళ్ళు గడిపాడట. ఈ ఉర్జూపదాల ముమ్మరం ఆ
హవాసఫలితమని కూడా అనుకోవచ్చు.
వ్యవహారంలో ఉన్న పదాలు ఏ భాషవైనా కావచ్చు స్వేచ్చగా కావ్యాలలో ప్రయోగించాలన్న ఆధునికదృక్పథాన్ని జాషువా ఏనాడో సమర్థించాడు. తాను ఛందోబద్ధంగా పద్యాలు (వ్రాసినా, భాషావిషయికంగా వ్యావహారికపదప్రయోగానికి బాసటగా నిలబడ్డాడు. ఛందోనిబంధనలను కొంతకు కొంత సడలించాలన్నాడు. “కాసా క కారానికీ యతిలేదన్న వారిని నిశితంగా విమర్శించాడు. సంఘ సంస్కరణరంగంలో కందుకూరి వీరేశలింగంగారికి కైమోడ్సులు ఘటిస్తూనే అతడు
సమోక్షణం 20
తన ఆంధ్రకవుల చరిత్రలో (ప్రజాకవి వేమన్నను చేర్చకపోవడాన్ని నిరసించాడు. మరు మకాఅటిల్లైల్లే అణగిమణిగి ఉన్న తెలుగు నుడులను సమాదరించని పండితమ్మన్యులను పరిహసించాడు.
వ్యవహారంబున (భష్టమయ్యు రసభావస్ఫూర్తి కల్పించి మా ర్రవముల్ శబ్దములెన్నియో కలుగ, శాస్ర్రజ్ఞానమా(త్రుల్ పురా కవితోన్మత్తు లెరుంగజాలుదురె కుగ్రామిణ భాషాద్దీలో చవులూరించు తెలుంగు పల్కుల జగా స్వారస్యరాహస్యమున్.
కవిత్వం భువనహితం కోరేదిగా ఉండాలని జాషువా విశ్వాసం. రాజుల భోగవర్లనలు, విరహిణుల అంగాంగవర్షనలు అతనికి గిట్టవు.
(ప్రభువుల పెండ్డిపరంటాలు వర్షించి కాలంబు సెక్కేండ్లు ఖర్చుపెట్టి తమకే తన నతు మూర్భలువోవు రాణివాసంబును రచ్చకీడ్చి అంగాంగవర్లనావ్యసనంబు రెట్టంప యువకజీవితకోటి కుచ్చులొడ్డి పదియు నెన్మిదిమార్లు పాడిన శ్రీరాము చరితంబు వగరెక్క తిరుగబాడి శరణు శరణటంచు పరుగులెత్తుచు వచ్చు ఆర్తలోక రుత మనాదరించి భువనహితముగోరు కవితాకళాశక్తి స్వార్హజడధి నూరవై చినారు.
భావకవితాయుగం మహోజ్ఞ్యలంగా వెలుగుతున్న రోజుల్లో తలయెత్తిన కవి జాషువా. భావకవిత్వాన్ని ప్రణయకవిత్వానికి పర్యాయంగా చాలామంది
21 డా| సి. నారాయణరెడ్డి
వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అది తప్పు, భావకవిత్య భూరుహానికి శాఖలెన్నని Y ప్రణయకవిత్వం, ప్రకృతికవిత్వం, దేశాభిమానకవిత్వం, సంఘసంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతిగీతాలు వగైరా. అయితే భావకవిత్వం ఇంత శాఖాబహుళంగా విస్తరించినా, ప్రణయకవితాశాఖ అన్నిటిని మించి (ప్రసరించింది, ఫలించింది. అందువల్ల స్టూలదృష్టికి భావకవులంటే ఊహాంబరవిహారులూ, అందని |[పేయసికై అర్రులు సాచే స్వప్షసంచారులుగానే గోచరించారు. జాషువా దేశాభిమానకవిత్యం, సంఘ సంస్కరణ కవిత్వం రచించినా ప్రణయకవిత్వంవైపు పోలేదు; 'సఖి' వంటి ఒకటి రెండు ఖండకృతుల్లొ తప్ప. నిష్టురజీవితసత్యాలనే కన్నీట తడిసిన కరకు పాళీతో చిత్రించాడు. కంటికి కనిపించిన వాస్తవాలనే (ప్రవచించాడు. ఊహాప్రేయసీ " వర్షనను నిరసించాడు.
కమ్మ
ద్యమొక్కటి వ్రాయజాల; వన్నిటిలో “ము
ఆ శవమును పే
గ్రమ్మాః ('ప్రణయమ్మో, యని
యుమ్మలికించెదవు నీదియుం గవనంబా?
కవిసమయంబు తప్పి, నుడికారపుసొంపును పాడుచేసి, నీ
వెవతుక కోసమో । కుమిలి యేడ్సుచు చక్కని తెల్లుకైతకా
యువులు కుదించి, యేమిటి కయోమయముంబొనరింతు వీవు? నీ
కవనము పాడుగాను వెడగా । యికనేనియు రమ్ము దారికిన్.
'సాలీడు'లో కూడ కళల పరమార్థం కేవలం అందం కాదని, నలుగురికి ఉపయోగపడని జిలుగు నగిషీలు వ్యర్థమని అభిప్రాయపడ్డాడు.
ఢక్కామల్లు పసందు నేతపనివాండ్రా, నియుపాధ్యాయు? లి
ప్లాక్కండున్ కనరాడు, డాగుకొనినారో నీదు గర్భంబునం
దిక్కాలంబున నిన్నుమించు పనివాడే లేడు దుర్వాత్తికిన్
దిక్కై ని అసమానకౌశలము వ్యర్థీభూతమైపోయెడున్.
సమోక్షణం 22
జాషువా పదాల పొందికలలో కూడా పొదుపును పాటించాడు. శ్రీనాథుని కవితాలక్షణాలను ఎన్నిటినో చిక్కబట్టుకున్నా అతడు చేసినట్లు 'అంభోజప[త్ర దీర్హాయ తాక్షి' వంటి అనవసరసమాసాడంబరంవైపు మొగ్గుచూపలేదు. తోచినంతలో తూచివేయడం, నొక్కి చెప్పవలసివచ్చి నప్పుడు చేయి సాచి వేయడం జాషువా పదప్రయోగ విశిష్టతలు. ఆ ఒరవడిలో ప్రాదెలుగుపలుకుబళ్లు కరళ్లు కరళ్లుగా దొరలుతాయి. తననాటి నుడికారాలు తళుక్కు మంటాయి.
పరభాషాపదాలు పల్లటిలు కొడతాయి.
కొందరు కవులు వర్ష్యవస్తువును చిత్రించడానికి ఉల్లేఖాలనూ, ఉత్రేక్షాపరం పరలనూ ఆ(శ్రయిస్తారు. ఒకే అభిప్రాయాన్ని భావచిత్రతోరణాలతో రకరకాలుగా అలంకరిస్తారు. కేవలసౌందర్య(ప్రతిపాదనకు ఈ శైలి, ఈ రీతి ఉపయుక్తం గానే ఉంటాయి. కాని ఒక సందేశాన్ని ఆవేశాత్మకంగా చెప్పేటప్పుడు ఇవే ప్రతిబంధకా లుగా పరిణమిస్తాయి. జాషువాకు పద్యాన్ని చిత్రికపట్టడం తెలుసు. భావాన్ని చిత్రచిత్రాలుగా కూర్చడమూ తెలుసు. కాని ఎప్పుడోతప్ప అతడీదారి తొక్కలేదు. సూటిగా, సెలయేటిధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా కవితలు చెప్పడం అలవరుచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏ కళకైనా రసావేశమే ప్రాణసదృశం. అందుకే జర్మన్ మహాకవి గెథే అన్నాడు. “TIUE art Cannot exist without emotion” అని. ఈ రసావేశం లేనివాళ్లు బుర్రతో చూస్తారు. బుద్దితో రాస్తారు. జాషువా అనుభూతితో చూస్తాడు, ఆవేశంతో రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలాకాకుండా పిల్లకాల్వల్లా పారిస్తాడు. ప్రణాళికాబద్దంగా ప్రవహించే రసావేశమే ఉత్తమకవిత్వాన్ని సృష్టించగలుగుతుంది. థామస్ హార్డీ “Poetry is emotion put into measure” అన్న నిర్వచనానికి పరమార్థం ఇదే.
జాషువా రసావేశానికి “ఫిరదౌసి”, “ముంటాజమహల్”, “గబ్బిలము”, “శ్మశాన వాటి” వంటి అనేక కృతులు ప్రత్యక్షాకృతులు. ఈ దృష్టికలవాడు కాబట్టే ఆవేశాన్ని విరిచేసే శ్లేషలజోలికి యమకాలపాలికి పోలేదు. పోయిన ఒకటి రెండు సందర్భాలు కూడా భావనారమ్యంగానే ఉన్నాయి.
23 డా! సి. నారాయణరెడ్డి
అతడు శ్లేషను తమాషాగా ప్రయోగించిన సందర్భం. బీర్గదేవాలయముల వసించుకతన కటికచీకటిలోని చక్కనిగుణంబు అవగతము చేసికొన్న దివాంధమొకటి పగలు వలదని శ్రేషగా పలుకసాగె. పగలు అంటే దినమని పగలంటే విరోధాలని స్పష్టం. అలాగే ఏకా ఆంజనేయులను గూర్చి వ్రాసిన నక్షత్రమాలలో యమక (క్రీడకు లోనైనాడు. ఎకాయన నిర్వురుగా రేకాయన నొక్కడే యదెట్లనగ కళా లోకాయుస్వౌధంబున క్రేకైకస్తంభమొక్క యేకాయేకా ।
“ఏకాయేకా” అంటే ఏకాయే+కా. కా అంటే ఏకా ఒక్కడే కదా అని.
కరుణరసాన్ని వరించిన కవి జాషువా. “ఈనాడు రచింతు; రిద్దకరుణా పరిణద్దరసప్రబంధముల్' అని స్పష్టంగా కరుణరస ప్రాధాన్యాన్ని ప్రకటించాడు. కరుణరసంతోపాటు, వీరరసాన్నీ జాషువా స్వీకరించాడు. స్థూలంగా చూస్తే జాషువా రచనల్లో కరుణం అంగిరసంగా, వీరం అంగరసాల్లో ఒకటిగా భాసిస్తాయి. కాని ఈ రకమైన సంప్రదాయసిద్దమైన రససిద్దాంతాల కొలమానాలతో చూస్తే జాషువా కవితావిశిష్టత అందదు. అతని రసదృష్టిని విలక్షణదృష్టితోనె కొలిచిచూడాలి. నీరుగార్చే కరుణమో, నిప్పులుగక్కే వీరమో మాత్రమేకాదు. ఈ రెంటి కలయికతో రూపొందిన ఒక వినూత్నరసదృక్సథం నా దృష్టికి భాసమానమౌతున్నది. జాషువా కేవలకరుణరసైకకవీకాదు; కేవలవీరరసైకకవీకాదు. ఇలా అన్నంత మాత్రాన ఇతని కవిత్వం కరుణ+వీర ఉభయరసాల సముచిత సమ్మేళనం. అనీ అనుకోరాదు. ఇతని కృతుల్లో ప్రముఖంగా ప్రజ్యరిలై రసం కరుణఎరఠు
కరుణం శోకమూలకం. వీరం ఉత్సాహమూలకం. శోకం ఆశానిహతివల్ల ఏర్పడుతుంది. ఉత్సాహం ఆశాప్రగతివల్ల పొంగులెత్తుతుంది. జాషువా కవిత్వం
సమిక్షణం 24
4
చిందించే కరుణరసం ఉత్త కన్నిళ్ళదికాదు. ఉప్పెనలను దాచుకున్నది. జాలితో జావగారేది కాదు. జ్వాలలను ఎదలో ముడుచుకున్నది. ప్రార్థనాత్మకమైంది కాదు. (పతిఘటనపూర్వకమైంది.
వీరరసం త్రివిధమని తొలుత భరతుడు (ప్రతిపాదించాడు. దానవీరం, యుద్దఎరం, ధర్మవరం. రానురాను రసగంగాధరకారుని చేతిలో ఈ వీరం ఎనిమిది తలకాయలతో ఎదిగింది. అచ్యుతరాయల 'సాహిత్యసార' (గ్రంథంలో ఏకవింశతి రూపాలుగా అవతరించింది. కళావీరం, కవిత్వ ఏరం, రూపనీరం, సంపద్విరం, జ్ఞానవిరం - అంతేనామరి। గానవీరం. ఈ రకంగా ప్రాచీన లాక్షణికుల దృష్టిలో ఎరరసభేదం నిర్లేశింపబడింది. నిజానికి కళావీరం అన్న ఒక్కమాటలో కవితావీరం ఉంది. గానవిరంకూడా ఉంది. జ్ఞానవీరంకూడా ఇమిడిపోతుంది. తర్కశక్తి మూలకంగా ఏర్పడిన (ప్రభేదాలివి. పెంచుకుంటూపోతే ఎన్ని వీరాలకైనా అవకాశం ఉంటుంది. ఓట్లకాలంలో ఎంతకూ మైకునువదలకుండా గంటలకొద్ది ఉపన్యసించే వక్తది ఉపన్యాసఎరం కాదా? బడిగంట మోగినా తరగతిలో పాఠప్రవచనం కొనసాగించే పంతులుగారిది పాఠనవీరం కదామరి? అది అలా ఉండనీయండి.
జాషువా కరుణరసంలోనుండి వీరరసాన్ని పొంగించినకవి. అతడు చిందించే కన్నీళ్ళు అన్నిగోళాలు. అవి దేబిరించేవికావు. గూబలను గుద్ది పలకరించేవి.
కరుణరసమొకండె కఠిన రాక్షసముల హృదయములను గలచి ముదము గూర్చు వేడికంటి నిటివిలువ సహజమైన చలువలీను అ(శ్రువులకు లేదు '
జాషువా కృతుల్లోని కరుణవీరానికి కీలకమూ, మూలకమూ అయిన పద్యమిది. కన్నీళ్ళలో కణకణమండే స్పులింగాలను పాదుగుకున్న కవి కాబట్టే --
“కఠినచిత్తుల దురాగతములు ఖండించి
కనికార మొలికించు కలము నాడి”
చమునానిల్) ర్‌ం
25 జ్ స్స్ నారాయణరెడ్డి
అని హెచ్చరించగలిగాడు. కాల్చే కన్నిళ్ళను దర్శించడం అంటే కరుణ వీరరససిద్దాంతానికి (ప్రాతిపదిక వేయడమే కదా! “గబ్బిలము” లోని
వాని తలమీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింప లేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున అంటువడని నాడు
మూడు మూర్తులకును గూడ కూడులేదు
అన్న పద్యంలోనూ నిర్వేదంతో కూడిన (ప్రబోధమే వెల్లివిరుస్తున్నది. అస్పృశ్యుడు పండించిన ధాన్యమే కదా ఆలయంలో సమర్పించే నైవేద్యం ? అంటరాని వాని ధాన్యాన్ని అంటుకోమని ఆ దేవతలే అనుకుంటేవాళ్ళకు కూడు లేదు. పూజార్లకు నిడ లేదు.
ప్రతిమల పెండి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పా(త్రలన్
మెతుకు విదల్స దీభరతమేదిని; ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహనుల క్షుత్తులాజునే.
ఈ పద్యంలోనూ ఆ (ప్రతిఘటనమే రెక్క విప్పింది. కరుణరసానికి సంచారి భావాలు దైన్యం, గ్లాని, జడత, చింత, నిర్వేదం మొదలైనవి. ఎరరసానికి సంచారిభావాలు అమర్హం, (క్రోధం, వితర్కం, ఆవేశం, ఉగ్రత మొదలైనవి. జాషువాకృతుల్లో గోచరించే కరుణవీరం ఏకకాలంలో దైన్యాన్ని, (ప్రబోధాన్ని, నిర్వేదాన్ని, (క్రోధాన్ని, జడతను, ఉగ్రతను, చింతనూ, అమర్షాన్నీ - ప్రత్యక్షకరిస్తుంది. అభ్యుదయకవిత్వంలోనూ కరుణవీరప్రతిపాదనమే (ప్రముఖంగా కనిపిస్తుంది. ఇందుకు ఆద్యుడు జాషువా. 'కరుణవీరం' అనే వినూత్న వీరరసభేదాన్ని నేను ప్రతిపాదించడానికి స్ఫూర్తిని కలిగించింది జాషువా కవిత్వమే.
కలాన్ని కులంతో కొలిచే మనస్తత్యాన్ని జాషువా గర్హించాడు. చాతుర్వర్ల్య వ్యవస్థామూలాన్ని కుదిలిస్తూ ఇలా అన్నాడు.
ముసలివాడైన (బ్రహ్మకు పుట్టినారు
నలువురు కుమారు లనుట విన్నాముగాన
సబూక్షణం 26
పసరమునకన్న హీను డభాగ్యుడైన
యెదవ కులస్టు డెవ్వరమ్మా ! సఎత్రి !
అసలునాలుగువర్ణాల విభజనమే ఆధునిక కాలంలో అర్థం లేనిది. అందులో ఐదవ కులమేమిటి? ఆ కులం అంటరానిది కావడమేమిటి? ఎవరు దీనిని సృష్టించారు? భారతీయులు ఎందుకు దీన్ని ఇంకా అనుసరిస్తున్నారు? జాషువా గుండెలో మొలకెత్తిన ప్రశ్నలివి. భారతంవంటి ఇతిహాసంలో కుమారా'స్త విద్యాసందర్శనఫుట్టంలో పరమతేజస్విదైఎన, శరపాండితీధురంధరుడైన కర్లుడికిపట్టిన దుర్గతే తనది. ఆ ఘట్టంలో కర్షుని కదనపాండితిని కులంతో కొలిచారు. జాషువా జీవితంలోని తొలిఫుట్టంలోనూ కవనప్రతిభను వర్ణాల పడికట్టురాళ్ళతో తూచారు. ఆనాటి కర్షుడికీ, ఈనాటి జాషువాకూ ఎదురైన పరాభవం ఒకటే. అందుకే కర్గుని వ్యక్తిత్వంతో జాషువాకు సాన్నిహిత్యం ఏర్పడింది. “కర్షుడమాయె కులపరీక్షకుల నడుమ?” అని ప్రశ్నించే మనస్తత్వం పొడచూపింది. కర్ణునితో తనకున్న తాదాత్మ్యాన్ని ఈ కవి స్పష్టంగా చెప్పుకున్నాడు.
నీ పేరెత్తిన నామనఃకుహరమంధీభూతమె,. క్షుబ్దమై
వాపోవున్; తనువెల్ల కంచుకితమై వ్యాలోలమై పొల్చు, గ
ర్లా। పౌరందరు డేయు బాణముల యన్యాయధ్యనుల్ నా చెవిన్
రాపాడున్ కఠినంబులై; మన విచిత్ర స్నేహమూహించితే ?
కురుకుమారుల సభలో ఆ సూతపు(త్రునికి జరిగిన అవమానమే అనేక కవితాసదస్సుల్లో తనకు జరుగుతూ వచ్చింది. సూర్యరాయ మహీపతిని సందర్శించినపుడు చెప్పిన పద్యంలో జాషువా ఆత్మవేదన అసిధారాసదృశంగా వ్యక్తమౌతున్నది.
నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే
ఖాకమనియవైఖరులు గాంచి “భళీభలి!” యన్నవాడె” మీ
దేకుల” మన్న (ప్రశ్న వెలయించి, చివుక్కున లేచిపోవుచో
బాకున (క్రుమ్మినట్టగును పార్టివ చంద్ర! వచింప సిగ్గగున్.
కవిత్వంకోసం కవిత్వం వ్రాసే ప్రవృత్తి కాదీ కవిది. సంఘటనలు తన గుండెనుచిల్సినప్పుడు సంఘానికి ఎదురుతిరిగి సవాలు చేశాడు. అన్యాయాలకు
27 డా! సి. నారాయణరెడ్డి
అంత మెప్పుడని ఆక్రోశించాడు. కులమతవ్యవస్టను కూకటివేళ్ళతో పెల్లగించాలని కలాన్ని గునపంగా ప్రయోగించాడు. ఆకలిని, శోకాన్నీ నిర్మూలించే వినూత్మ వ్యవస్టకోసం అగ్రుసాచాడు. సంఘమే రణరంగంగా, సంస్కరణమె చరమలక్ష్యంగా పరిక్రమించాడు. ఈ సంఘసంస్కరణాభిలాష ఇతని కవిత్వంలో చతుర్ముఖాలుగా సాగింది. 1. మతవైషమ్యనిరసనం, 2. అస్పృశ్యతానిరసనం 3. అంధవిశ్వాసనిరసనం 4. దారి(ద్రనరన నం. ఈ నాలుగు అంశాల పునాదులమీదనే ఇతని సంఘసంస్కరణకవఎతానర్మాణం జరిగింది.
జాషువా ఆలోచనాసరళికి హేతువాదం మూలం. ఆంతర్యాన్ని పరిశీలించ డం, అసమానతను ప్రశ్నించడం, అన్యాయాన్ని ప్రతిఘటించడం ఇతని హేతువాద శీలానికి ఆయువు పట్టు. గొర్రెలు తలలు వంచుకుని వెళ్లిపోతాయి. పదునైన బుర్రలు ఎదురు తిరిగి (ప్రశ్నిన్హాయి. సెత్తందారులన్కు గుతానాములను, స్వార్హపరాయణులను, పరాన్నభుక్కులను, కుహనాభక్తులను, చిత్తశుద్దిలేని పూజారులను - చివరికి దేవుళ్ళను అ
“ముసుగులో గుద్దులాటలు పొసగవింక
హక్కుగలదయ్య (ప్రశ్న సెయంగ నిన్ను”
అని జాషువా సూటిగా దేవుణ్ణి సవాలుచేసింది ఈ హేతువాదబలంతోనే. ఆది దేవుణ్ణి ప్రశ్నించిన జాషువా వ్యాసుణ్ణి ప్రశ్నించడంలో ఆశ్చర్యమేముంది?
వ్యాసముని! భారతమును
వ్రాసిన కవినాథ! పాండురాజసుతులలో
దోసములేదా? యేదీ
నా సంశయములు నివారణముసేయగదే!
భీష్ముని సంహారరహన్యాలను అడిగి తెలుసుకున్న ధర్మరాజును “అశ్శత్థ్భామాహతః అని బొంకనట్లు బ్ తరి పబ్బం గడుపుకున్న ధర్మరాజును, ఏకలవ్యుని బొటనవేలును సుతారంగా తప్పించి పాండవ పక్షపాతాన్ని ప్రదర్శించిన ద్రోణాచార్యుణ్ణి, ఒక్కొక్కరి అక్రమాన్ని పేరు పేరున నిలదీసి అడిగాడు.
అస్పృశ్యుల్లో “మాలి, 'మాదిగి లనే రెండు తెగలుండటం, అవి కక్షలకూ, కలహాలకూ దారితీయడం ఈ కవికి సంతాపహేతువులైనవి. అ(గ్రవర్ణాల దౌష్ట్యాన్ని
సమోక్షణం 28
ఎంత నిర్భయంగా ఖండించాడో, అంతిమవర్గాల అజ్ఞానాన్ని అంత నిష్టాక్షికంగానే నిరసించాడు.
మాలా? తోలా? యనుకొని తేలుచుకొనకుండ కెడద తృప్తిపడకు మా మాలలు మాదిగలు జగ
తృాలక! మతబొధలేల? ప్రార్థనలేలా?
అభ్యుదయకవిత్యానికి మార్క్స్ ప్రతిపాదించిన వర్గసంఘర్షణ సిద్దాంతం (ప్రాతిపదిక. సంఘంలో ఉన్నవారూ లేనివారూ రెండు వర్గాలనీ, ఈ ఉభయ వర్గాలకు నరంతరసంఘర్హణ అనివార్యమని, అయితే అంతిమవిజయం పేడితవర్గానిదే అనీ మార్క్స్‌వాద సారాంశం.
జాషువా భావకవిత్య్వయుగంలో కలంపట్టి అభ్యుదయకవిత్వయుగంలో అంచులుముట్టిన కవి. అభ్యుదయకవిత్వంలోని వర్గసంఘర్షణం, ఆర్జికవ్యత్యాస నిర్మూలనం, దోపిడీవర్గాలపై తిరుగుబాటు, సమసమాజనిర్మాణం, సమరవిముఖత, శాంతిప్రియతవంటి ఆశయాలు జాషువా కవిత్వంల్ నూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే ఇతని వాణివేరు; బాణివేరు, అభ్యుదయకవులు స్వీకరించిన గేయచ్చందస్సునూ, వచనకవితారీతిని ఇతడు చేపట్టలేదు. శిష్టవ్యావహారికశైలిని అభిమతించలేదు. వ్యవహారసన్నిహితమైన (గ్రాంథిక శైలిలో లక్షణబద్దంగా సాగే పద్యాలను రచించాడు. అభ్యుదయకవిత్వానికి అనివార్యమైన వాస్తవికతావాదాన్ని భావకవిత్వయుగంలోనే స్యాయత్తం చేసుకున్నాడు. అయితే ఇతనిది మార్క్స్ దారికాదు. మహాత్మపథం, మహాబోధి దృక్పథం. అందుకే భావకవులకంటే అభ్యుదయకవులే ఇతనికి ప్రతిపాత్రులయ్యారు. కేవల ప్రకృతివర్షనాలంపటులైన భావకవులను నిశితంగా విమర్శించాడు.' సమకాలీనులైన అభ్యుదయకవులను నిండుగుండెతో సమర్థించాడు.
1. వూదోటల మదబంభర
నాదముల విలానవతుల నడబెడగుల నా
వ్లోదించు కవులకీ నిరు
పేదల ఆ(క్రందనములు వినులబడునా?” -ముసాఫద్దు 2. కాందిళీకుడు.
29 డౌ॥ స. నారాయణరెడ్డి
“మాకవు లాలపింతురు సమంచిత నవ్యయుగోచితంబులై
ఆకటిచిచ్చులార్సు హృదయషప్రవిదారి దయాకథాంశముల్ *
అన్న పంక్తుల్లో అతని యుగోచితప్రగతిదృష్టి అగుపిస్తుంది. ఆకలిపైన తిరుగుబాటు చేసే విషయంలో ఇతనిది అచ్చంగా అభ్యుదయకవుల దృక్పథమే. రేడియోను ఉద్దేశించి వ్రాసిన పద్యాల్గ్‌నూ అన్నార్తుల ఆక్రందననే ధ్వనింపజేశాడు.
రేయిబవలు భారతీయసంస్కృతి పేర
గండశిలలు చూస కథలుచెప్పి
కటికిపేదవాని కడుపులోగల చిచ్చు
గడపగలవి నీను గగనవాతణి,
ఆస్తి ఏ ఒక్కవర్గం గుత్తసొత్తుగా ఉండరాదనీ, అది అందరికీ సమంగా అందాలనీ (ప్రబోధించిన అభ్యుదయకవిత్వసిద్దాంతాన్ని ఇతడూ (ప్రబోధించాడు.
సహజమైన ప్రకృతిసౌఖ్యంబు లొకవ్యక్తి
దొంగిలించి మనుట దొసగు నాకు,
ఈ పంక్తుల్లో దోపిడీ వర్గాలపై ధ్వజమెత్తిన తిరుగుబాటు కనిపిస్తున్నది. స్వరాజ్యం సంపాదించి మూడు సంవత్సరాలైంది. ఏమిటి నివు సాధించిన (ప్రగతి? 'మారుపల్క వేమి మంతిరన్న' అంటూ ఆ రోజుల్లోనే పాలకును నిలదీసి
ప్రశ్నించాడు.
అ ee న ప”
కాలం గడిచినకొద్ది జాషువా కవిగానే కాకుండా వ్యక్తిగానూ మహోన్నతంగా ఎదిగిపోయాడు.
మతపిచ్చిగాని ఖో
£3 న్నతిగాని స్యార్ధచింతనముగాని నా ళం
కృతులం దరండదు, శబ్దా
కృతి బ్రహ్మానందలక్ష్మి నృత్యమొనర్చ్భున్
అని 'కొత్తలోకము” అనే కావ్యంలో చెప్పుకున్నాడు. 'హృదయము గలట్టి నవరచయితనునేను” అని వార్దక్యంలోనూ నిత్యనూతనత్యాన్న అభిలషించాడు.
సమోక్షణం 30
తనది కమ్మని వాక్కుల్లొ నిర్భయంగా అందించిందే కవిత్వమని చాటి చెప్పాడు. తొలిరోజుల్లో “గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను” అని గానంచేసిన జాషువా, “భరతఖండంబు నా పాఠశాల” అని మననంచేసిన జాషువా, (క్రమ(క్రమంగా
“నిఖిలలోకమెట్టు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్శనరుడ సక్
అనే విశ్శజనినదృక్పథాన్ని అలవరచుకున్నాడు. అలాంటి సువిశాలదృక్సథం ఉండడరి వల్లనే ప్రపంచస్థాయిలో ఏ మూలలో, ఏ మాత్రం మంచి జరిగినా, కవితారూపంలో (ప్రశంసించాడు. చెడు జరిగితే అభిశంసించాడు.
కవిత్వంకోసం కవిత్వం (వాయడం, వర్లనలకోసం వర్లనలు చేయడం, చిన్న విషయం చిత్రించడానికి ఎన్నెన్నో రంగులు పూయడం జాషువా (ప్రవృత్తికి సరిపడదు. అంతమాత్రాన భావచిత్రాలు వేసీ సమర్ధత లేనివాడని నా అభిప్రాయం కాదు. ఒక దృశ్యాన్ని కళ్ళముందు బొమ్మ కట్టించడానికి, ఒక సన్నివేశాన్ని మనసుకెక్కించడానికి అక్కరలేనన్ని మాటబొమ్మలు గీసే కవుల కోవలోనివాడు కాడితడు. ఒక దృశ్యాన్ని చిత్రించడానికి ఒక టిమ శ వెస్తాడు. అది చాలు హృదయం మీద మృదులముద్ర వేయడానికి. గబ్బిలాన్ని గురించి ఇలా అంటాడు.
ముక్కు మొగమున్న చికటిముద్దవోలె విహరణముసెయసాగె గబ్బిల మొకండు.
గబ్బిలాన్ని రూపు కట్టడానికి ఇంతకు మించిన ఉపమానం ఎక్కడ దొరుకుతుంది? గబ్బిలం కాళ్ళు పైకి సాచి తిరుగుతూ ఉంటుంది. దానికి కవి ఉక్తి చమత్కృతితో పలువిధాలుగా వ్యాఖ్యానాలు చేయవచ్చు. కాని జాషువా చూపిన కారణం అతని భావుకతాచమత్కృతికీ, వాస్తవికతాపరిణతికీ ఎత్తిన దీపంలా భాఎస్తుంది.
నరుని కష్టపెట్టి నారాయణుని గొల్ఫు
ధర్మశిలురున్న ధరణిమీద
కాలుమోపలేక గబ్బిలమ్మొక్కటె
చరణయుగళి దివికి సాచి నడచు.
31 డా॥ సి. నారాయణరెడ్డి
మెత్తని అధిక్షపంత్ మాటబొమ్మను కట్టి చిత్తాలకు హత్తుకునేటట్టు చేయడంలో ఇతడు సిద్దహస్తుడు.
జాషువా ప్రధానంగా కరుణరసాన్ని అప్పుడప్పుడు హాస్యరసాన్నీ పోషించినా, శృంగారరసాన్ని స్పృశించకపోలెదు.
ముంటాజమహల్ కావ్యం సంయోగవియోగశ్చంగారాలను సమభంగిలో చిత్రించిన రసవత్కృతి. షాజహాను ముంటాజమహలుల (ప్రగాఢప్రణయాన్ని, సుమధురసంయోగ సన్నివెశాలను ఎంత సుందరంగా, సభ్యతాబంధురంగా చిత్రించాడో ఈ పద్యం చెబుతుంది.
ఆ సతీపతుల గాఢాశ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబులేదు
ఆ దంపతులకు నాహ్హాదంబు కూర్తుక తొలగిన వెన్నెలతునకలేదు
ఆ(పేమజీవుల అనురాగవృద్దికై రుతమొనర్ఫ్సని పరభృతములేదు
ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దులచేత తీపికెక్కని (ద్రాక్షతీగలేదు
అవధిలేని వారి యానందకేళికి
తోడుపడని పూలతోటలేదు
వారికూర్మిపెంపు వలచి వర్లనజేసి
సుప్రసిద్దిగనని సుకవి లేడు. తాను పొందిన అనుభూతికి రమణీయశబ్దాకృతి ఘటించడంలో ఇతని
కున్న పనితనాన్ని “శిశువు” చెబుతుంది. “శ్మశాన వాటిక” చాటి చెబుతుంది.
నవమాసములు భోజనము నీర మెటుగక
పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ముజేసెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
సమోాక్షణం 32
నునుచెక్కిళుల బోసినోటి నవ్వులలోన ముద్దులుచి(త్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీరమధుధార లన్నంబుగా తెచ్చుకొన్ని యతిథి బట్టగట్టడు బిడియాన పట్టువడడు ధారుణీపాఠశాలలో చేరినాడు వారమాయెనో; లేదొ? మా (ప్రకృతికాంత కఖపియున్నది వీని కాకలియు నిద్ర '
ఈ పద్యంలో ఆలోచన, ఆలాపన ఎంత అందంగా చెట్టపట్టాలేసు కున్నాయా ! 'శ్మృశానవాటిక'లోని ప్రతిపద్యం తీవ్రమైన అనుభూతికీ, రసనిర్భరమైన వాగ్రీతికీ ఒక (ప్రతీక. ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన గజిగిపోయె ఇచ్చోట; నేభూములేలు రాజన్యుణ యధికారము[ద్రిక లంతరించ ఇచ్చోట; నే లేత యిల్లాలి నల్లపూ సల సౌరు గంగలో గలసిపోయె ఇచ్చోట; నెట్టి పేరెన్నికంగనుగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించె.
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జెగదలించ యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్లమౌ దృష్టులొలయ '
నవని పాలించు భస్మసింహాసనంబు. ఆలోకించిన గుండియల్లరుగు; నా యా పిల్లగోరీలలో నేలేబుగ్గల సౌరు రూపజియెనో యె ముద్దు నిద్రించెనో?
1. శిశువు
ele డా॥ సి. నారాయణ రెడ్డ
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్యాల జీవించునో ? యీ లోకంబున వృద్దిగాదగిన యేయే విద్య లల్ల్హాడునో ?
రవిం(ద్రునిలాగే జాషువా అనేకపర్వవిభక్తమైన మహాకావ్యం వ్రాయలేదు. (వాసినవన్నీ లఘుకావ్యాలూ, ఖండకావ్యాలూ. రసావేశంలో ఊగిసలాడి రుటితి స్ఫూర్తితో కవిత్వాన్ని విసిరేకవి నెలలకొద్ది నిలకడగా కూర్చొని (గ్రంథరచన చేయడు. జాషువా మౌలికంగా ఆవేశం తరుముతుంటే కలం అందుకున్న కవి, అందుకే ఆకలం నుంచ రాసులు రాసులుగా ' ఫరదౌసి, “గబ్బిలము”, 'ముంటాజమహలు” 'కాందిశీకులు”, 'స్వప్షకథ', “బాపూజీ, నేతాజీ, 'స్వయంవరంి, 'ముసాఫర్లు' 'ర్రస్తుచరిత్రము”, 'కొత్తలోకము' వంటి లఘుకావ్యాలూ, ఏడు 'ఖండకావ్య' సంపుటాలూ, మూడు 'నాకథ'లూ వెలువడ్డాయి.
అధునికాంధ్రకవిత్వంలో ఖండకావ్య(ప్ర(క్రియ రాయ(ప్రోలుతో పొట మరించినా, పుష్పించింది జాషువా కవితలోనే. ఖండకావ్యం (వ్రాసి అఖండ కావ్యస్ఫూర్తిని అందించిన కీర్తి జాషువాకే దక్కింది.
తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదని, ప్రతిభను కులమతాలతక్కెడలో తూచరాదని విశ్వసించి తన జీవితమంతా ఆ విశ్వాసాన్ని కవిత్వంగా నిశ్శసించిన జాషువాలోని ప్రతిఘటనదృకృథాన్ని ఆవిష్కరించడానికి ఈ ఒక్క పద్యం చాలు.
గవ్వకుసాటిరాని పలుగాకులమూక లసూయచేత న
న్నైవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే ?
యివ్వసుధాస్థలిం బొడమరే రసలుబ్బులు? గంటమూనెదన్
రవ్వలు రాల్ఫెదన్ గరగరల్ పచరించెధ నాం(ధ్రవాణికిన్.
“ఎవ్వరెమన్ననం[డ్రు నాకేమి కొత” అని (ప్రత్యర్థులను ధిక్కరించిన శ్రీనాథుడు ఎక్కడైనా ఈ 'మధురశ్రీనాథుణ్ణి' కలుసుకుని పై పద్యం వింటే ఒళ్లు మరచి అమాంతంగా కాగలించుకోకుండా ఎలా ఉంటాడు?
జాను. కవులు వర్గాతీతులు కదా!
కస క ESE
యెంకి పాటల్లోని కావ్యత్వం
కవిత్వం హృదయధర 10. ఒక పద్యం పుట్టాలన్నా, ఒక పాట గజ్జె కట్టాలన్నా మథనం తప్పదు. మననం తప్పదు. కృతి ప్రారంభంలో కలిగే అవస్థను సూలంగా క్యత్యాద్యవస్థ అంటే, గీతి ప్రారంభంలో ఏర్పడే అవస్థను సూక్ష్మంగా గీత్యాద్యవస్థ అనుకోవచ్చు. ఈ అవస్థలో ఒక కిశోరమూర్తి. 1917-18లో మదరాసు మహానగరంలో కదిలే ట్రాంబండి. ఆ బండి రొదలో ప్రయాణికుల సందడిలో ఆ తరుణహృదయంలో ఒక లయ పుడుతున్నది. అది అక్షరాలు తొడుక్కోవాలని గొంతుదాకా వచ్చి గోలపెడుతున్నది. అదో ప్రసవ వేదనలా ఉంది. గుండెకూ గొంతుకకూ మధ్య ఆసుపోసినట్టు తిరిగిన ఆ భావవీచిలో, ఆ రాగరోచిలో అవతరించింది ఒక పాట పాపగా. అయితే ఆ పాపకు పసితనం లేదు. బాల్యం లేదు. అది పుట్టింది సద్యోయౌవనగా.
“గుండె గొంతుకలోన కొట్టాడుతాది కూకుండనీదురా కూసింతసేపు”.
ఇదీ ఆ పాటకు పల్లవి. ట్రాంబండిలో గుండెగొంతుకల సంరంభాలను అనుభవించిన ఆ కిశోరమూర్తి నండూరి వెంకటసుబ్బారావు. మదరాసు క్రైస్తవ కళాశాలలో పట్టపరీక్షకు చదువుకుంటున్న యువజిజ్ఞాసువు.
యెంకి:
యెంకిపాటల్లోని ఈ మొదటిపాట జననం (ట్రాంబండిలో జరిగినా నామకరణం ఆ తర్వాతే జరిగింది. ఈ తొలిపాటలో యెంకిపేరు కనిపించదు. యెంకి ప్రవృత్తిలో పదునైన రెండంచులు కనిపిస్తాయి. ఆశ పెట్టడం, విసిరికొట్టడం. బులిపించడం, అంతలోనే జడిపించడం.
'ళటో మాకోయెట్టి మరిగించినాదీ పల్లకుందామంటె పాణమాగదురా” అని అనిపించడం.
35 డా! సి. నారాయణరెడ్డి
నండూరివారు ముందుగా ఈ పాత్రను ఊహించుకోలేదు. మథనం ఫలితంగా వెలువడిన ఆ మొదటిపాటలో ఒక శృంగారనాయిక అలవోకగా తలయెత్తింది. ఆ నాయికకే ముచ్చటగా పరుపెట్టుకున్నారు ముద్దుల నాయెంకి' అని. యెంకిని కావ్యనాయికగా తీర్చిదిద్దుకున్న క్షణంలోనే ఒక శృంగారనాయకుడు రూపుదిద్దుకున్నాడు 'నాయుడుబావ'గా.
పూర్వరంగం :
నండూరి వెంకటసుబ్బారావుగారిని కన్న ఊరు వసంతవాడ. అప్పటి కృష్ణాజిల్లాలో ని ఇప్పటి ఏలూరు తాలుకాలోనిది ఆ వూరు. నండూరివారు 1895 డిసంబరులో జన్మించారు. “కంఠంలో కిన్నరుడున్నాడే” అన్నారు జాతకం (వ్రాసినవారు. “అమావాస్యనాడు పుట్టాను. జారుణ్ళో చోరుణ్లో అవుతానురా' అని తరువాత సరదాగా అంటుండేవారు నండూరివారు. ఈరెండూ నిజమే. కంఠంలో ఒదిగిన ఆ కిన్నరుడే యొంకిపాటల రూపంలో తెలుగు నేలను గాంధర్వంలో ముంచెత్తాడు. అమావాస్యనాడు పుట్టిన వలితమేమో రసికహృదయ గోపికాజారుడైనాడు. అసంఖ్యాకపాఠకచిత్త చోరుడైనాడు. ఆరో ఏట సంగీతం నేర్చుకున్నాడు. స్వరజ్ఞానం అలవడింది. రాగసరిచయం ఏర్పడింది. అది భవిష్యత్తులో యెంకిపాటల రాగస సృష్టికి (ప్రాతిపదికగా మిగిలింది.
చిన్నప్పటినుంచీ పాటలంటే చెవికోసుకొనేవారు నండూరివారు. ఎన్ని తీర్హపాటలు, నూర్లపాటలు విన్నారో? నోరారా పాడుకున్నారో? వారు పదే పదే పాడుకునే పాటను నాకు ఈ మధ్య వినిపించారు, వారి కుమారులు శ్రీ బాలసూర్యారావుగారు.
“ఒంటిచేద్దజ్ఞమ్మూ భామా
ఒప్పుదు నా మనసూ
రెండుచేతూ లెత్తీ భామలు
దజ్ఞం పెట్టండి”.
ఇలాంటి పాటలెన్నో బాల్యంలో వార సేత తటాత స్వతహాగా ఏకసంత(గ్రాహి కావడంవల్ల వాటిని చిరకాలం మననం చేసుకుంటూ ఉండేవారు.
సమోక్షణం 36
కళాశాలలో చేరకముందే జానపదగీతాల వరసలను ఆకళించుకున్నారు. 'చెల్ మోహానరంతో పాటలు, 'వెంకయ్య-చం(ద్రమ t పాటలు, 'నారాయణమ శ్ర పాటలు, వారి హృదయంలో చివుళ్లు తొడుక్కుంటూ ఉన్నాయి. గురజాడవారి 'ముత్యాలసరాలు' గళపేటికలో మిలమిలమెరుస్తూ ఉన్నాయి. బసవరాజు అప్పారావు గీతాలు ఆ రసాత్మను కొనవేళ్లతో స్పృశిస్తూ ఉన్నాయి. ఇన్ని (ప్రభావాలు ప్రోద్బలకంగా సహజసంస్కారం (పైరకంగా వెలువడిన తొలిగీతం “ముద్దుల నా యెంకి. ఈ (ప్రభావాలతోపాటు ఆంగ్ల విద్యా ప్రభావం కూడా నండూరివారి ఆలోచనామండలంపైన సముచితము(ద్ర ప సిత్టస్, ఆంగ్ల కాల్వనిక కవులలో ముఖ్యంగా రాట. బర్న్స్ స్కాట్లండ్ జానపదభాషలో (వ్రాసిన గ్‌తాల (ప్రభావం ఆత్మీయంగా సనిణిసిరిది.
బర్న్స్ - నండూరి: బర్చ్న్ సజీవమైన స్కాటిష్ మాండలికభాషలో పాటలు వ్రాశాడు. నండూరి
గోదావరీ మాండలికంలోనూ, విశాఖప్రాంతంలోని తూర్పుయాసలోనూ పాటలు రచించాడు.
Went అనడానికి ౪౮౪౦ అనడం None అనడానికి ౧౧౦౧౪ అనడం
50 అనడానికి 506 అనడం - స్కాట్టండ్ మాండలికాల్లొ కనిపిస్తుంది. ఇలాంటి (ప్రయోగాలు బర్న్స్ గీతాల్లో కోకొలలర యెంకిపాటల్లో నా వైపు అనడానికి 'నాకాసి', పోయింది అనడానికి 'పోనాది', పడుకున్నావా అనడానికి 'పొండుకున్నావా' ఇలాంటి ప్రయోగాలే. "86౧౧5 tinkered old indecent songs" అనే అభి (ప్రాయాన్ని ఆంగ్ల విమర్శకులు వెలిబుచ్చారు. నండూరి 'వెంకయ్య-చం(ద్రమ్మ 'నారాయణమ్మ-నాయుడు బావి, 'చల్‌మోహనరంగా' పాటల్ట్‌ని అశ్లీలచ్చాయలను పరిహరించి వాటిలోని పలుకుబడిని, జిలుగునుడిని స్వీకరించాడు. బర్డ్స్ వ్రాసిన "Love episodes" చాలా ఉన్నాయి. నండూరి యెంకిపాటలను ఒక (క్రమంలో పరిశీలిస్తే ఒక ఉదాత్త ప్రణయకావ్యమే అవుతుంది. RnyMster గా బర్చ్స్
9
37 డౌ॥ ౨. నారాయణరెడ్డి
పేరొందిన కవి. మాత్రాచ్చందస్సులను గీతానుగుణంగా మలచుకోవడంలో నండూరి అందెవేసిన చేయి. బర్చు ప్రత్యేకత Glorified Simplicity. అంటే సామాన్య విషయాన్ని సముదాత్తంగా వర్షించడం. యెంకిపాటల్లో ఉన్న బీవగుణమూ ఇదే. మరింత ఆంతరికంగా పరిశీలిస్తే బర్న్ గీతాలతో సంవదించే యెంకిపాటలు కొన్ని స్ఫురిస్తాయి. మచ్చుకు -
“నమలిమింగిన నాయెంకి” అనే పాట, బర్గ్ వ్రాసిన Bonnie Lesley (బానీలెస్టీ) అనే ఒక అందమైన పిల్ల రూపగుణచిత్రణ.
"For nature made her what she is
and never made sie! anither?"
అనే పంక్తుల (ప్రభావం
“యెంకివొంటీపిల్ల లేదోయి లేదోయి”
అనే పల్లవిలో ధ్వనిస్తున్నది. బరు పంక్తుల్లొని “నీ వొక రాణివి, మేము నీ బానిసలం అన్నభావన “రాసోరింటికైన రంగుదెచ్చె పిల్ల”
అనే పంక్తిలో దరహసిస్తున్నది.
“Thou art divine” అన్న బర్ట్ ఆరాధన
“యెంకొక్క దేవతై యెలసెనంటారు”లో పునర్దర్శనమిస్తున్నది.
బర్నకూ నండూరికీ ఉన్న ఆత్మబంధుత్వంలో Local Colouring కూడా చెప్పుకోదగింది. స్కాట్లండ్ జానపదవాతావరణాన్ని బర్న్స్ చిత్రించగా, తెలుగునాటి పల్లీపరిసరాలను, పైరు పచ్చలను, వాగువంకలను నండూరివారు పాటల అద్దాలలో పదిలంగా చూపెట్టారు. “పచ్చనిసెలు, 'పండుయెన్నెలి, 'యేటి 'గట్టు', “ఏతాం”, 'గోనెపట్టా', “గొంగడి”, 'మామిడితోటి, 'డొన్నసేలు”, 'కుజ్బూమభ్రో, 'గొడ్డుగోదా, 'యీయేపునోయావు ఆయేపు నోయావు, 'ఈకాడ నోకొండ ఆకాడ నోకొండ'-ఎన్నని ? ఎన్నెన్నని ?
l.Such ౨. Another
సమోాక్షణం 38
యెంకిపాటలు - కావ్యత్వం
“యెంకివోటల” తాలిము[ద్రణ 1925లో వెలువడింది. ఆ సంపుటిలో 35 పాటలున్నాయి. మలిముద్రణ 1953లో వెలువడింది 43 కొత్త పాటలతో పాటు. అచ్చెన ఈ పాటలు భావాను(క్రమంగా ఉన్నవి కొప్పు, ముఖ్యంగా తొలిము[ద్రణలోని పాటలు పత్రికల్లో నుంచి సేకరించి యథేచ్చగా ప్రచురించినవె. ఇప్పుడున్న పాటల క్రమాన్ని బట్టి పరిశీలిస్తే యెంకిపాటల్లోని భావపరిణామంగాని, రసయానంగానీ అవగతం కావు. ఏ పాటకాపాట ఒక మెరుపులా మెరుస్తుంది. ఒక తరంగలా ఉరుకుతుంది. కానీ కాలాతీతకాంతి ప్రసరణం, నిరంతరజీవ వాహినీత్వం గోచరించదు. నండూరి కారయిత్రిప్రతిభ పల్లవ, కొరక, (ప్రసూన, ఫలదశలను అనుభవించిన [క్రమపరిణతిని గమనించాలంటే ఈ పాటల వెనుక ఒక కావ్యత్యాన్ని, ఒక అనుస్యూతత్యాన్ని గవేషింపవలసి ఉంటుంది. ఆ దృష్టితో ఈ పాటలను పునఃపరిశీలించగా వీటిలో నాకు స్ఫురించిన ప్రణయదశలు నాలుగు.
ప్రణయ ప్రస్తానం : ™ థి
1. పూర్వరాగం :
లాక్షణికులు (పమ తొలుత నాయికలోనే ఉదయించాలని చెబుతారు. యెంకిపాటలు లక్షణశా|స్తాన్ని ముందుంచుకొని వ్రాసినవి కాకున్నా, ఏటిల్డ్‌నూ నాయికే ముందుగా నాయకుణ్ని ప్రేమిస్తుంది. మొట్టమొదటి పాటలో ఈ మొగ్గు కనిపస్తున్నది.
“నాకాసి సూసాది నవ్వు నపోస్తాది.”
ఆ చూపులో చక్షూరాగం అనే మదనావస్థ ఉన్నది. “వానలచ్చిమి” అనే గీతంలో నాయకుడు 'జామురాతిరియేళి చేనిలో ఉండగా మెల్లగా వస్తుంది. చల్లగా వస్తుంది. మనస్సంగం అనే అవస్థ ఇందులో ధ్వనిస్తున్నది. అయితే ఈ మదనావస్థలు
ఎం ( థి తాలి యు కేవలం నాయికాపరంగా ఉన్నాయని అనుకోరాదు.
“మందొ మాకోయెట్టి మరిగించినాది,
వల్లకుందామంటి పొణమాగదురా”
39 డా|! సి. నారాయణరెడ్డి
వంటి సంక్తుల్ల్ నాయికపట్ల నాయకుని కున్న వివశత్వం, (ప్రాణదఘ్న ప్రణయశీలం ద్యోతకమవుతున్నాయి. ఈ మరిగించడం ఉత్తమనాయికాలక్షణమా? అని కనుబొమ్మ లెక్కు పెట్టినవాళ్ళూ లేకపోలేదు. ఇది వాచ్యార్థంలో (గ్రహించవలసిన పట్టుకాదు. 'మందొమాకోయెట్టి' మరిగిస్తే కలిగే ఉన్మాదస్టితి నాయకునిలో కలిగిన తీవ్రాతితివమైన ప్రణయభావాతిరేకాన్ని సూచిస్తుంది. మనస్సంగావస్టకే మారు రూపమిది. ఈ ప్రథమ రాగదశలో నాయికానాయకులు నిరంతర పరస్పర వీక్షణం, నిత్యనాన్నిహిత్యం కోరుకుంటారు. ఎన్నెన్నో ముచ్చట్లు ఒలకబోసుకుంటారు. యెంకిపాటల్లో ఈ (ప్రథమరాగం పాతపాటల్లో బాగా వినిపిస్తుంది. “సరుకు లేమి కావాలో అని నాయుడు అడిగితే “మరమమిడిసి మనసియ్యి” అని యెంకి బదులిస్తుంది.
“కాండను కాఫషళమో యెల్తురుపిల్లా” అని అడిగితే
“నీ నీడలోనే మేడకడతా నాయుడుబావా!” అంటూ ముగ్గత్యాన్ని బలకరిస్తుంది.
అప్పటికి వారికి పెళ్ళికాలేదు. ఒకరినొకరు చూసుకోకుండా, కలుసు కోకుండా ఉండలేరు. అందుకే జామురాతిరి కలుసుకోవడం. నాయుడు ఎతామెత్తుతూ ఉంటే ఎదురుగా కూర్చొని కాలాన్ని మగిచిపోతుంది యెంకి. కాలాన్ని వీరు మరిచినా కాలం వీరిని మరుస్తుందా? మళ్ళీ ఎప్పటిలా తెల్లార్లబోతుంటే ..
“సెందురుళ్లీ తిట్టు నా యెంకీ
సూరియుణ్లీ తిట్టు నా యెంకీ”.
ఈ దూషణం (ప్రలాపం అనే మదనావస్టకిందికి వస్తుంది. కానీ, ఇది మన్మథతప్తలైన ప్రబంధనాయికల చం(ద్రాద్యుపాలంభనం వంటిది కాదు. ఇంతలోనే రేయి కరిగిపోతుందే అన్న నాయిక ఆందోళనను సూచిస్తున్న పంక్తులివి. యెంకి ఈ దశలో కన్యకగానే ఉంది. నలుగురుచూస్తూ ఉండగా నాయుడు బావను కలుసుకోలేదు. అందుకే రాత్రిని ఆశయించడం. 'కోడిగూసేసరికి కొంపకెల్లాలి' అని ప్రాధేయపడడంలో యెంకి కన్యాత్వం స్పుటంగా గోచరిస్తున్నది. ఈ పూర్వ రాగదశ ఏక్షణ భాషణలతోనే గడిచిపోయింది.. కన్ను గిలికించినా, బులిపించినా,
సమోక్షణం 40
అంగస్పర్శలేని అనంగరాగ మది. * దగ్గరస కూకుంటె అగ్గిసూన్తాది' అనడంలో అప్పటికి నాయికాశీలం అనలంలా అచుంబితమని తెలుస్తున్నది.
౭. దాంపత్వయోగం :
“ఆవుల్ని దూడర్ని
అతోరి కాడుంచి,
మూటా ముల్తీ గట్టి,
ముసిలోళ్ళతో సెప్పి,
యెంకీ, నాతోటీ రాయే...”
అనే చరణంలో యెంకీ నాయుడు బావలకు పెళ్ళెపోయినట్టు
స్పష్టమవుతున్నది. అప్పటికే యెంకి నాయుడుబావ గుండెను నమిలి మింగిన
పిల్ల, కళ్లెత్తితే కనకాభిషేకాలు చేసే గృహలక్ష్మి. పెళ్ళి తర్వాత యెంకీ నాయుడు బావల దాంపత్య జీవనం ధర్మసిబ్బతం అయిపోయింది.
స సతు! మనస్ మూట సాలు"
అన్న పరిపూర్ణతృప్తి యెంకిపట్ట నాయుడుబావ కేర్పడింది. ఇద్దరూ కలిసి ఏడుకొండ లెక్కారు. భద్రాద్రికి వెళ్ళారు. కాళిని దర్శించారు. సంకలో సం(బ్రాలుపడు” కుర్రవాణ్లి కన్నారు. క్రమంగా నాయుడు యెంకి “ఇయంగేహే లక్ష్మీ రియమ మృతవర్తిర్షయనయోః” అన్న భవభూతి అనుభూతిస్థాయిని అందుకున్నారు.
“యెంకొక్క దేవతై
యొలిసె నంటారు.
యింటింట పెడతారు యెంకి నీ పేరు”
అంటూ ధర్మపత్నిలో దివ్యత్వాన్ని దర్శించాడు నాయకుడు. ఆలంకారి కంగా పరిశీలిస్తే ఈ (ప్రణయం మాంజిష్టారాగం. పైకి బాగా కనిపించడం, కలకాలం
4+ డా| సి. నారాయణరెడ్డి
| నిలిచిపోవడం దీని లక్షణం. సీతారాముల అనురాగం నీలీరాగం. పైకి స్పుటంగా కనిపించకుండా ఉండడం, శాశ్వతంగా కొనసాగడం దాని లక్షణం. వీరి దాంపత్యయోగం 'గోవు మాలచ్చిమి' అన్న పాటలో అన్ని అంచులతో భాసిస్తున్నది. గోవు ధర్మానికి ప్రతీక. యెంకీనాయుడు బావల ధర్మశ్చంగారానికి గోవు ప్రకటించిన ఆమోదం ఈ పాటలోని నసునుః
ఆ. విప్రయోగం :
యెంకి కేవలముగ్గకాదు. ఆమె శీలానికి రెండు పదునైన అంచులున్నాయి. ఒకమాటు ఆమె ఎకసిస్తుంది ఏరిలా. ఒక్కొక్కమాటు గుపుమంటుంది ఆఎరిలా. ఇదే 'యెంకితనం”. 'సూపుతో మాటాడు”, 'ఊపిరితో తెనిగించు' అనే పంక్తుల్లోని కుశాగధిషణ ఈ యెంకితనానికి మూలధాతువు. అందుకే నాయుడుబావ అంటాడు యెంకితో కాపురం చెయ్యడం, “కత్తి మీదే సాము కొత్తి మీదే కూడు” అని. అంతటి తాదాత్యస్టితిలో వారి గార్హస జీవనం సాగిపోతూ వున్నా, 'మన యెంకెయని కాని, సనువులకు పోరాదు” అని గమనిస్తూనే వచ్చాడు నాయకుడు. ఎంతటి పరస్సరావగాహన ఉన్నా ఇద్దరూ (ప్రత్యేక వ్యక్తిత్వాలు ఉన్నవారు కాబట్టి అభిప్రాయభేదాలు తప్పలేదు. పర్యవసానం పొల అలుకలు, చిరుకలహాలు. అలుకతో యెంకి పుట్టింటికి వెళ్ళిపోయేది. కొన్నాళ దాకా ఎవరి పట్టింపులు వారివే. ఎవరిచోట నోర. ఇవ్ విధయాగదక. నాయకుడు పలినరించివాడు "తూడుఠిటి యెలికి యాడుంటివే” అని. ఆమె తళుకు జ్ఞాపకంవస్తి అతని తల తిరిగిపోయేది. మామిడిపండు తింటే విషమైపోయేది. విరహతీవ్రత భరించలేక నాయకునికి కినుక కలిగేది.
“రావోరై వా పక్కరాదొర్దై యేం
ఆ పొద్దె మన పొత్తులయిపోయె నెంకీ”
అంటూ ఆకాశభాషణంచేసేవాడు. తోటలోనికి వెళ్ళినా ఆక కలత.
“తోట వూసంటే సికాకూ,
యెంకి
తోటి యెల్ల దాని సోకూ””
సమోక్షణం 42
అంటూ నిట్టూర్సులెగజిమ్మేవాడు. ఒక్కొక్కమాటు యెంకిమద కోపంతో నాయుడుబావ ఎక్కడికో వెళ్ళిపోయేవాడు.
“నన్నిడిసిపెట్టెల్లినాడే,
నారాజు
మొన్న తిరిగొస్తనన్నాడే”
అంటూ ఆ|క్రందించేది యెంకి దురంతనిరీక్షణలో. “ఆనాటి నావోడు సెందురూడా
అలిగి రాలేదోయి సెందురూడా”
అని తమ సంయోగదశలో సాక్షభూతుడుగా ఉన్న చందురునితో మొరపెట్టుకునెది.
“ఈ రేయి నన్నాల్ల నేరవా? రాజా ఎన్నెలల సొగసంత యెొటిపాలేనటర”
అంటూ ఏటిగట్టన నిలిచి, నాటి స్మృతుల తలుపులు తెరచి, విప్రలబ్దగా విహ్యలించేది. చివరికి ఎంతకూ తన బావ తిరిగిరాకపోయేసరికి
“దూరాన నా రాజు కేరాయిడౌనో? ఈ రోజు నారాత లేరాలపాలో” అని కిడు శంకించేదికూడా.
4. పూర్ణయోాగం అ
ఉత్తముల కోపం క్షణకాలం. ఉదాత్తసంస్కారాన్ని పండించుకున్న దంపతుల పొరపొచ్చాలు కూడా స్వల్పకాలికాలే. తాత్కాలికమైన ఉద్రేకానికి లోనై యెంకి పుట్టింటికెళ్ళినా, నాయుడుబావ ఎక్కడికో వెళ్ళినా ఇద్దరిమధ్య కాలం మంచుతెరలు కప్పినా, వారి అంతరంగాలలో స్థిరంగా, చిరంగా ఉన్న అనురాగరశ్మి అమ్రానంగానే ఉండేది. మళ్ళీ కలుసుకున్నప్పుడు సెల్లుబికేది 'రవలవెలుగులగంగ' లా. ఆ అనురాగధారలో స్నాతులై, పునితులై యెంకీ నొయటెడుబావలు
43 డా| సి. నారాయణరెడ్డి |
నిర్వికారస్థాయి నందుకున్నారు. ఈ సమున్నతికి, ఈ పూర్ణ యోగస్లితికి “యెనకజన్మములోన యెవరిమోనంటి” అనే పాట పతాకసదృశం. ఈపాటలో త్రికాలాల్లోనూ యెంకీ నాయుడుబావల అఎభాజ్యయోగం ధ్వనిస్తున్నది. 'ఆరిపేయవె దీపమూ' అనే పాటలో నాయకుని ఇంద్రియాతీత సౌందర్యదృక్పథం తత్తని శ్రేణి నధిగమించింది.
“ఎంకెవ్వ' రని లోక మెపుడైన కదిపితే వెలుగునీడలవైపు
వేలు సూపింతు;”
వంటి పంక్తుల్లొ ప్రాకృతికధర్మం పారమార్థిక స్థాయినందుకున్నది. స G9 డు థి ॥
పగలు రే లెడబాటెరుగ రెవరోయీ??
“శంకరుడు సతియచట, యింకవ్యరిచట;”
ఈ పంక్తులు యెంకినాయుడుబావల దాంపత్యజీవనం సాధించిన అద్వైత సిద్దికి ప్రతిబింబాలుగా నిలిచిపోయాయి.
భావచిత్రాలు :
యెంకిపాటలనిండా ముఖ్యంగా పాతపాటల్లో అంతటా పరుచుకొని ఉన్నవి మాండలికపదాలు; తప్పితే భావచిత్రాలు. కనిపించే దృశ్యాలను మాటల్లో బొమ (గీసి చూపడం ఒక ప్రతిభ. కనిపించని రూపాలను పదాలతో పట్టివడం అసాధారణ ప్రతిభ. అలాంటి ప్రతిభతో దిద్దిన భావచిత్రాలు కొన్నిటిని పరిశీలిద్దాం.
1) “కస్పుమంటూ యేరు గాలి నెగబోసింది”. ఏటిలో జోరుగాసాగే పడవవిసురుతో గాలి హోరుమంటున్నది. ఏరే గాలిని తూర్సారబట్టనట్టుగా ఉన్నది. అగుపెంచని గాలికి కవికుంచె దించిన భావచిత్రమిది. a 2) . “గాలికైనా తాను కవుగిలీనన్నాడు”. నాయకుని ఉత్తమశీలాన్ని పరమవ్యంగ్యంగా రూపొందించిన (ప్రకటనమిది.
సమోక్షణం ప 44
3.) “పూలెరుగు నాకోత నిలెరుగు నామోత”. నాయిక హృదయం సుమసుకుమారమైంది, నీటివలె సుతిమెత్తనిది. ఆమె గుండెకోత ఆ పూలకే తెలసు. ఆమె ఎదలోని కల్లోలం ఆ నటికే తెలుసు.
శ “ఏటి కడుపున దాగి తోట నిదరోయింది”. ఒక నిశ్ళలఛాయాచి(త్రాన్ని (Still Photograph) అత్యంత సహజంగా తీసిన పదచిత్రమిది.
5) “ఆకాశ మావరస ఆవులించిన రేయి ఎలుతు రంతా మేసి ఏరు నెమరేసింది”. వంటి భావచిత్రాలు విశ్వకవితాభాండాగారంలో ఆ(గ్రపంక్తిలో నిలువదగిన నిధులు:
INES పళ్లలా న భావచి(త్రాలన్ని దోదోముగో నతతతారి..వాం మౌలికప్రతిభలోనుండి ఉద్భవించినవే. 'ఉయ్యాల' అనే గీతంలో మాత్రం ఒక చరణం పైన సంప్రదాయ సంస్కారముద్ర స్పష్టంగా భాసిస్తున్నది. ఏటి పక్కన ఉన్న చెట్టుకొమ్ముకు ఉయ్యాల కట్టుకొని యెంకి ఊగుతున్నది. ఏటినీటిలో (ప్రతిఫలించిన చం[ద్రవంక బొమ్మ ఉయ్యాలనూగుతున్నది. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాడు కవి.
“తీగల నడుమ నూగె
దీపమై తిలకమై
పీఠమై - ఎంకికి-కి
రీటమై నెలవంక”.
ఈ చలద్భావచిత్రంపైన భాగవతంలోని 'రవిబింబం బుపమింపి అనే పద్య (ప్రభావం ఉన్నట్టు తోస్తున్నది. వామనుని త్రివిక్రమత్వాన్న సూచించడానికి సూర్యబింబాన్ని కొలమానంగా తీసుకున్నాడు పోతన్న. మొదట ఛత్రంలా వామనుని. శిరస్సుపై నిలిచిన ఇనబింబం కతుంగో శిరోరత్నంగా, శ్రవణాలం(క్రియగా, కేయూరంగా, కంకణంగా పర్యవసించి, చివరికి పదపీరిగా నిలిచిపోతుంది. ఈ 'ఉయ్యాల' పాటలో కొమ్మ ఉయ్యాల ఊగుతున్న యెంకికి నెలవంక దీపంలా,
45 ar en నారాయణరెడ్డి
నుదుటి తిలకంలా, పిఠంలా, చివరికి తలపైని కిరీటంలా పరిఢవిల్లింది. ప్రాచీన కావ్యాభ్యాససంస్కారఫలితంగా నండూరివారి గొంతు నుండి పునరవతరించిన భావనారమ్య చిత్రమిది.
యెంకిపాటలు - మాండలికపదాలు : ముత్యాలసరాలద్యారా గురజాడ అప్పారావుగారు శిష్టవ్యావహారిక భాస కావ్యోపయోగిగా తీర్చిదిద్దడం ఆనాటి గొప్ప ప్రయోగం. ఆ తర్వాత బసవరాజు అప్పారావుగారు ఆ దారిలో నడిచినవారిలో పరిగణ్యులు. శిష్టవ్యావహారికంతో ఆగిపోక ఇంకొక్క అడుగు ముందేసి మాండలికభాషలో సముదాత్రభావాలను సమర్ధంగా అందించిన ప్రయోగశీలి నండూరి సుబ్బారావుగారు. పాటకజనం మాట్లాడుకునే మాటల్లో ఎంత పాటవం ఉందో రుజువు చేశారువారు. యెంకిపాటల్లో ఉన్న మాండలికపదాలు ప్రాయికంగా గోదావరి, విశాఖమండలాల కు సఠజఠరరి నినో, మచ్చుకుకొన్ని - 1. కూనంతసేవు : కాసంతసేపు, కాసేపు అనడానికి వాడుకలో ఉన్న తూర్పుయాస ఇది. 2. _ ఉనురోనుకుంది : ప్రాణం తీసేసింది అనే అర్హంలో వాడే మాట ఇది. తెలంగాణంలో ఉసురుపోసుకుంది అనే ప్రయోగం ఉంది.
3. _ అగ్గిసూస్తాది : కసిరిచూస్తుంది అనే అర్హంలో ఇది విశాఖ (ప్రాంత వాడుక. 4. _దగ్గరస: గోదావరి వాడుక. దగ్గరగా అనే అర్హంలో.
ర్, వల్ల కుందామంటె : ఊరు కుందామంటె అనే అర్హంలో బహుశః పలకకుందామంటే దినిమూలమై ఉంటుంది.
6. కొంగట్టుకు : కొంగుపట్టుకొని. గోదావరి విశాఖ మండలాల వాడుక. ఇందులోని పవర్షలోపం తెలంగాణలోనూ అక్కడక్కడా ఉంది. మూడొద్దులు “మురాడు రో జాలస్‌డానికి. పాద్దులులో న పవర్షం లోపించి ఏర్పడిన పదబంధ
Es
లి
7. _ పద్దాక: చాలాసేపు. తెలంగాణంలో ఇది పొద్దనుక అనే రూపంలో ఉంది.
_ సమోక్షణం 46
8. తలతిరిగిందోలి : ఇందులోని ఓలె అంటే ఓసి. “రావే ఓలె. ఇది తూర్పు ప్రయోగం.
ఇంకా బేగి (వేగంగా), బుటకలు (మునకలు), ఆపడితే (అగపడితే), కొత్తి (పొయ్యి) లాంటి మాండలికపదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. రతన ప్రయోగించడం విశేషం కాదు. ఆ ప్రయోగం రససిద్దికి దోహదం చేయడం, ఏ మాత్రం చతికిలబడకుండా కండగల శిష్టపదజాలంతో దీటుగా అంగలు నావినడవడం.
కొత్త పాటలు - గొంతు మార్చు:
1925లో పాతపాటల (ప్రచురణ జరిగింది. 1926లో నండూరి వారు ఏలూరులో న్యాయవాదవృత్తిలో చేరారు. “ప్లీడరీకి కవిత్వానికి సగమెరుక సుమి! అని హెచ్చరించారు మిత్రులు. పాటల నడక ఆగిపోలేదు కాని కాస్త మందగించింది. 1948లో నండూరివారికి (ప్రముఖవైణికగాయకులు మంచాళ జగన్నాథ రావుగారి స్నేహం లభించింది. మంచాళవారు వీణపై క్షేత్రయ్య పదాలను పొడి వినిపిస్తుంటి పరవశించి వినేవారు నండూరివారు. వారిలో సుప్తంగా ఉన్న సృజనశక్తి పొరలెత్తి వేలుకుంది. గళ్ళగంథి విడిపోయి మళ్ళీ పుంస్కోకిల కూజితాల జల్లులు కురిపించడం మొదలయింది. జగన్నాథరావుగారు ధన్వాసి రాగంలో “చల్లనాయెలేరా నామనసెంతో” అనే క్షేత్రయ్య పదం వినిపించగా ఆ రాగప్రభావంతో “దిపసుందరి' వెలువడింది. ఇలాగే కొత్త పాటల్లోని చాలా పాటలుజగన్నాథరావుగారి ఏణాగానంతో ఉద్భుద్దమైనవె. క్రమంగా నండూరి వారిపై విలంబకాలసంగీత ప్రభావం సాం(ద్రంగా పడింది. దానితో స్వరం మారింది. పదం మారింది. పాత పాటల్లోని “యెంకి” కొత్త పాటల్లో “ఎంకి” అయింది. “యెలుగు” “వెలుగు” అయింది. “సెట్టు” 'చెట్టు”గా, సేను” “చేను”గా, “సెందురుడు” “రేరేడుగా” రూపొందినాయి. పోను పోను
'సాగరుని సల్ల్హాపమా అల
చందురుని యుల్లాసమా సిక
47 డా॥ సి. నారాయణరెడ్డి
తాతలాల విలాసమా ఆ పగిది బంధించు నీ కనుపాపనెయ్యది తాపసీ?” వంటి భావకవితాప్రాఢథపదము(ద్రలున్న గీతం మి(శ్రగతిలో వెలువడింది.
యెంకిపాటల్లో ఉన్న మాత్రాచ్చందోగతులు నూటికి తొంభబైయెదు పాళ్లు ఖండగతిలో నడచినవే. అయితే జానపదం నుంచి జ్ఞానపథంలోకి జరిగిన ఈ పయనంలో ఇదే (క్రమమని ఖచ్చితంగా గీటుగీసి చెప్పలేము. కొత్త పాటల్లో సూలంగా శైలీ, బాణీ మారినా “ఈ రేయి నన్నొల్ల నేరవా”, “లేపకే నా యెంకి లేపకే నిదర”, “ఇంతేనటే సంద్ర మెంతేనొ అనుకొంటి” వంటి జానపదపరిమళమున్న పాటలూ లేకపోలేదు.
యెంకిపాటల ప్రశస్తి :
సుమారు నాలుగు దశాబ్దాలుగా నండూరి సుబ్బారావుగారు ఏది పలికినా యెంకిమాటగా, ఏది పాడినా యెంకిపాటగా జీవించారు. తమ రాగజీవనాన్నీ కవితా(ప్రవృత్తిని యెంకితో తాదాత్మ్యం చేసుకున్నారు. ఇంటింటా యెంకి పేరు పెట్టుకుంటారని తమ కృతిసాఫల్యాన్ని భావించుకున్నారు. “వుత్తమాటలు నివి పొమ్మ”ని యెంకి కొత్తపాటలు పాడుకొమ్మన్నా - ఆ కొత్తపాటల్లోనూ యెంకే సాక్షాత్కారించింది. కాశివిశ్వశ్చరుడు కూడా తల తడుముకొని తబ్బిబ్బుపడేట్టుగా రసాకృతియె తేజోమూర్తియై నిలబడింది యెంకి. అందుకే నండూరివారే అన్నారు
“యీ చిత్తముకు వెలుగు నీ యెంకితనమే” అని,
యెంకిపాటలు కాక నండూరివారు వ్రాసిన ఏకైక గీతం “తల్తీ మా కస్తూరిబా”, 1923 లో గాంధీగారు కాకినాడకు వచ్చినపుడు వ్రాసిన పాట ఇది. ఇది ఇప్పుడు లభించడంలేదని వారి కుమారులు బాలసూర్యారావుగారు నాతో అన్నారు. నండూరివారి అభిమానగీతాలు మూడని కూడా వారు చెప్పారు. ఒకటి “వుత్త మాటలు నీవి”, రెండవది “పంటసేలకే పయనం”, మూడవది “నన్నిడిసిపెట్టెల్లి
సమోక్షణం 48
తొలినాళ్లలో యెంకిపాటలపైన రేగిన గాలిదుమారం ఇంతా అంతా కాదు. ప్రతి ప్రయోగశీలికి పట్టిన అవస్టే ఈ పాటలకూ పట్టింది. చేవ ఉన్న (ప్రతినవ్య ఈ రా లు ప్రయోగం చివరికి జైత్రయాత్ర సాగించినట్ట యెంకిపాటలు కూడా తెలుగునాట శైశిరావస్టదాటి చైత్రయాత్రలు సాగించాయి. ఆ రోజుల్డ్‌నే ప్రముఖ విద్వాంసులు ఈ పాటలను ప్రశంసించారు. ... “యెంకినాయుడు బావలు కేవలం జీవేశ్వరులే” అని అన్నారు పురాణం సూరిశ్యాస్హగారు.
శృంగారరసాధివ్థానదెవతలగు రతీమన్మథులే తలి అన్నారు పంచాగ్నుల ఆదినారాయణశాన్ర్రగారు.
రంభానలకూబరులు అలంకారశాస్త్ర విర్ణుంగా శృంగారసల్లాపం హస్ దోషంవలన కలియుగంలో యెంకేనాయుడు బావలుగా జన్మించారని చమత్కరించారు వేదం వేంకటరాయశాగస్తిగారు.
“పండితు లెవరో కాదనుట విని గుణము లేనిదే వారు కాదనరే? యని యెంచి ఈ కవికుమారుని ఇచ్చటికి ఆహ్యానించితిని” అని రెడ్డి మహాసభలకు నండూరి వారిని ఆహ్వానించి సత్కరించారు కట్టమంచి రామలింగారెడ్డగారు.
'మెంకి' నాపి రితని
కేమిలేదట వని
నెవ రెరుగ రంటా!”
“నామకానామకుల నటనె నేడంట”
“ప్రకృతి సుందరిజంట పరులకెటులంట!” (నటీనటులు)
పాటను లక్ష్యంగా ఉదాహరించారు వేదాల తిరు వేంగళాచార్యులుగారు ఆంధ్ర ధ్యన్యాలోకంలో. (ఆంధ్రధ్య్వన్యాలో కము చతుర్జోద్దాతము - పుట 653. ఈ పాటను కమిప్రొఢోక్తికి ఉదాహరణంగా తీసుకుని దాదాపు నాలుగు పుటలు వ్యాఖ్యానించారు.)
ఇంకా గిడుగు, వేటూరి, మల్లంపల్లి, కోలవెన్ను, బూర్లులవంటివారు ఈ పాటలను వ్యాసరూపకంగా (ప్రశంసించారు.
49 చ్లా స్; నారాయణరెడ్డి
ఆకాశవాణిద్వారా, సాహిత్యసభలద్వారా, లలితసంగీతకార్య క్రమాల ధాలా ఈ పాటలు బహుళ 1ప్రచోారరి పొఠదినవి;
యెంకిపాటలరూపంలో ఒక సరికొత్తగేయసంప్రదాయాన్ని, యెంకి ద్యారా వినూతనశ్చంగారనాయికను తెలుగుకావ్య జగతికి అందించిన నండూరి సుబ్బారావుగారు తరువాతి తరాలకు అనుకరణీయులైనారు. అందరికీ అందుబాటులోనే ఉన్నా ఎవరికీ అందకుండానే ఉన్నారు.
*
మలెభాషా పదజాలం - కొన్ని విశేషాలు
మలేషియా దేశీయుల భాష 'మలే'. దీనినే 'బహాసామలేసియా” అంటారు అక్కడి “బూమిపుత్రులు”. 5005 01 the 501 అనే అర్ధంలో మలేజాతీయుల్ని “బూమిపుత్రు” లంటారు. “బహాసా” భాషాశబ్దానికి వికృతి.
మలేభాష ఆ(స్టిక్ భాషాకుటుంబానికి చెందినభాష. ఇది మలే - పొలినీషియన్ విభాగానికి చెందింది. దీనినే అ(స్టోనేషియన్ విభాగమనికూడా అంటారు. ఈ విభాగంలోని భాషలకూ, మన దేశంలో కొన్ని ఆటవికజాతుల్లోనూ ఇండో చైనాలోనూ కనిపించే మాన్‌ఖెమిర్ భాషలకూ దగ్గరిపోలికలున్నాయి. ఇది పసిఫిక్ ప్రాంతానికి చెందిన భాషా విభాగం. పళ్చిమతూర్చుప్రాక్ దిశలుగా మడగాస్కర్‌నుండి తూర్పుదీవి (Eas$tern 191206) వరకూ, ఉత్తరపశ్ళిమ (North West) దిశలుగా దక్షిణపశ్సిమదిశలుగా (South West) ఉత్తరపంజాబునుండి న్యూజిలాండ్ వరకూ ఈ భాషా(ప్రాంతం వ్యాపించి ఉన్నది.
భౌగోళిక, సాంస్కృతిక కారణాలవల్ల భారతదేశాంతర్గతమైన సంస్కృతం మలేభాషలో చోటు చేసుకొన్నది. మతవ్వాప్రికారణంగా ఈ భాషలో అరబ్బీ భాష సముచితస్తానం సంపాదించుకునంది. మలేలలో ఇంచుమించుగా అందరూ ఇస్టామును స్వీకరించినవారే. ఈ భాషలో (క్రీస్తుశకం పదమూడు వందలనుండి he జరిగింది. ఇది సంయోగాత్మకవిభాగానికి చెందిన భాష. మలేసియా జాతీయభాష “మలే”. అధికారభాషకూడా ఇదే: మలయా, సారవాక్, సబాహ్ రాష్ట్రాల్లోని ప్రజలందరికీ మలేభాష జాతీయభాషగా వాడుకలో ఉంది. (ప్రస్తుతం మలేభాషా సారస్వతాలను సుసంపన్నం చేయడానికి (ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ మాదిరిగా) మలేసియాలో “దివాన్ బహాసాడాన్
పుస్తక” (Language and Literature Society) పనిచేస్తున్నది.
1
53 ర . నారాయణరెడ్డి
ఈనాడు మలేలిపి రెండు రూపాళ్ళ వాడుకలో ఉంది. 1. జావీలిపి 2. రోమన్ లిపి. జావీలిపిలో అరబ్బీలిపినే వాడుతారు. అయితే దానికంటే ఈ జావీలిపిలొ అయిదు అక్షరాలు అధికంగా ఉన్నాయి. రోమన్‌లిపిని “రూమి” _ అంటారు. ప్రస్తుతం దీనిని విస్ఫతవ్యవహారంలోకి తీసుకుని వస్తున్నారు. ఈ లిపిలోని విశేషం ఏమిటంటే పరభాషాపదాలను కూడా అక్కడి వాడుకకు అనుగుణంగా, ఉచ్చారణవిధేయంగా (వాయడం. ఉదాహరణకు : 'పోలీస్” అనే ఆంగ్లభాషాపదాన్ని మలేజాతీయులు “పులి” అని ఉచ్చరిన్తారు. అందువల్ల "Police" అనే పదాన్ని 'మలేరోమన్' లిపిలో ౧4|| అని వ్రాస్తారు. “945% ను “బాన్” అని ఉచ్చరిస్తారు. అందువల్ల ఉచ్చారణకు అనుగుణంగా "528" అని వ్రాస్తారు.
1. పదస్వరూపం : మలభాషాపదజాలాన్ని స్థూలంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. 1. మలేపదాలు - చైనిస్ పదాలు - ఇంగ్లీషు పదాలు ఇత్యాదులు.
2. సంస్కృతాదిభారతీయభాషాపదాలు - అరల్సీపదాలు - ఫారసీ పదాలు ఎగరోః
ప్రస్తుతపరిశిలనకు తీసుకున్నవి ప్రధానంగా రెండో వర్గానికి చెందినవి. ఏటిలో కొన్ని తత్సమాలు, కొన్ని తద్భవాలు, కొన్ని వ్యస్తపదాలు, మరికొన్ని సమస్తపదాలు. కొన్నిటిలో ధ్వని పరిణామం గోచరిస్తే, మరికొన్నిటిలో అర్హ విపరిణామం అగుపడుతుంది. భారతీయభాషల్లో నుంచి ఈ భాషలో చేరినవి ముఖ్యంగా సంస్కృతసమాలు, తద్భవాలు. తెలుగు, తమిళపదాలు అరుదుగా అగుపిస్తాయి. పశ్చిమ ఆసియావాసుల సంపర్కంవల్ల వచ్చిచేరిన అరబ్బీ పదాలు సమధికంగా ఉన్నాయి. ఫారసీపదాలు సకృత్తుగా దొరుకుతాయి.
ఇక మలేభాషలో కనిపించే కొన్ని సంస్కృతపదాలను పరిశీలిద్దాం. వీటిలో కొన్ని మూలార్హంలోనో, కొన్ని విశేషారంలో నో కనిపిస్తాయి.
సబూక్షణం ఎ 52
మూలార్దంలో జ విశేషార్దంలో ఖే వనిత= స్తీ పుత్ర = రాజకుమారుడు గురు = గురువు పుత్రి = రాకుమారి జగత్ = (ప్రపంచం _ పరమశాస్త్ర = వ్యాకరణం పద్మ = తామరపువ్వు సెర్‌దిహోన. = సొమేత
(పరిభాషాశబ్ద వికృతి) ఈ భాషలో సంస్కృ తతద్భృవాలు కిందివిధంగా ధ్వనిపరివర్తనము బెందినాయి.
1) పదాదిస్తానంలో కనిపించే మార్పులు.
(య) అచ్చులు. ఆ — జ అర ఎరి జ్ మం(త్రి మెం!తి 2 అ ఘంటా గెంటా గుర గపుర ఇ న క
ఇం(దైయ ఎం(దియ
(2) అపదాదిస్టానంలో వచ్చే మార్పులు :
(బు)
అచులు జ్
అ
G | A
డో స; నారాయణరెడ్డి
వంశ
వాయు
వంశీ
జ్ర లూ ల్‌ట్టే
అనేకవర a)
బంగ్భ బాయు
బంగీ
ఐరెక్సా
అనికవర్శ్ష
55
స్వరభక్తి (Anoptyxis)
ఇం(ద
ఇందెర
బెరితా
ఆనునాసిక్య లోపం
మంజుల
మజుల
డా॥ సి. నారాయణరెడ్డి
(బవ్మోణ
ఆనునాసక్య ఆగమం
ఆకాశ
ఆం౦ంకౌ
సబూక్షణం 56
పరాగమనం : £3
బండారి = కెరడాహరి
11. సమాసస్వరూపం (ఎ సంసృతసమాసాలు 1) మౌలిక పదస్వరూపం కోల్పోనివి : రాజపరమేశ్యరి జయపురి ఏకమాత్ర మూల్యవాన్ Il) తత్సమతద్బ వాలు సముసతణనలి: అంకాసపురి బూమిపుత్ర సూ(త్రదార
(జు) అరబీ సంస్కృత మిశ్రసమాసాలు స్వరరఖియత్ = పొరవాణి 'స్వరి సంస్కృతపదం, రఖియత్ అరబ్బీ 'రయ్యత్ కు వికృతి. చరిత రథియత్ = జానపదకథ. “చరిత” సంస్కృతం, రఖియత్ అరబ్బీ వికృతి ఉమర్ పూజ = ఆయుఃపూజ
“ఉమర్ అరబ్బీ','పూజ' సంస్కృతం.
క్రో డా॥ సి. నారాయణరెడ్డి
మెంత్రిబెసార్ = ముఖ్యమంత్రి
'మెంత్రి' మన మంత్రి, 'బెసార్ “బషీర్ అనే అరబ్బీ పదవికృతి. “బషీర్ అంటే ఘనుడు అని అర్హం. (సి ఇంగ్లీషు విక్సతుల సమాసాలు
మచ్చుకు ఒకట
బాస్ సెకోలాహ్ = స్కూలుబస్సు
ఇంగ్లీషు అరబ్బీ మిశ్రసమాసాలు
మచ్చుకు ఒకటి
“రోమా రిహాడ్? (651 House)
'రిహాడ్ ' అరబ్బీ 'రహతోకు వికృతి. | - 'రోమా' ఇంగ్లీషు "Rం౦m"కు వికృతి.
ఈ సమాసనిర్మాణంలో అరబ్బీ సమాసప్రభావం కనిపిస్తుంది. “పబ్లిక్ గార్డెన్'ను అరబ్సిలో 'బాగె ఆమ్” అంటారు. విశేషణం పరపదంగా రావడం ఇందులోని విశేషం. ఈ (ప్రభావం వల్లనే మలేభాషలో 'స్యరీకత్ బర్‌హద్' (Limited Company) వంటి సమాసాలు రూపుదిద్దుకున్నాయి.
మలేషియాలో తమిళులూ, తెలుగువాళ్లూ, బొత్తరాహులూ చిరకాలంగా ఉంటూ ఉండటంవల్ల ఈ భాషల పదాలు కూడా మలేభాషలో స్వల్పంగా అగుపిస్తాయి. మలేబాషలో “బెండి” అనే పదల ఉంది, ఇది తెలుగులోని బండి అనే అర్హంలానే ఉంది. (ఈ పదమే బెండకాయ అనే అర్థంలోనూ ఉంది. ఇది భేండీ అనే హిందీ పదానికి వికృతి.) 'సిపుటో అనే మాట అలిచిప్ప అనే అర్థంలో ఉంది. ఇది హిందీలోని 'సీపీ' (శుక్తి శబ్ద వికృతి)కి వికృతి. 'కెడై' దుకాణం అనే అర్థంలో ఉంది. ఇది తమిళపదం, Mahaligal అనే మాట ఉంది మేడ అనే అర్థంలో, ఇది ద్రావిడభాషాపదమైన 'మాళిగె' తద్భవమో లేక మహార్మాష్ట్ర పదమో!
సమోక్షణం 58
111) వాక్య నిర్మాణం
ఎ.
ce
(త్రికం మన భాషలో నామానికి పూర్వం ఉంటే ఈ భాషలో పరంగా ఉంటుంది. “ఈ పుస్తకం నాది” అనడానికి :
బుకు-ఇని-సయపున్య (పుస్తకం-ఇది-నాది) అని ఉంటుంది. సర్వనామ విశేషణం :
మన భాషలో నామానికి ముందుంటే ఆ భాషలో పరంగా ఉంటుంది, “నా పేరు రాముడు” అనడానికి
నమ-సయ-రాము (సేరు-నా-రాము) అని ఉంటుంది.
ప్రతిసారి విశేషణాదిరూపాలు నామానికి పరంగా రావడం ఈ భాషలోని విశేషం. “రాము నా పేరు" అనడానికి,
(రాము-ఉన్నది-పరు-నా)
అని ఉంటుంది.
ద్రవిడ భాషల్లోనూ అరబ్బీ మొదలైన భాషల్ట్‌నూప్రచురంగా కనిపించే క్రియాపదరహిత వాక్యాలు ఈ భాషలో (ప్రముఖంగా కనిపిన్హాయి. This is my house అనడానికి
ఇని-రుమహి-సయ
(This-house-my)
ఇందులో (క్రియాపదం లేదనేది'స్యష్టం..
59 జొ స్; నారాయణరెడ్డి
కొన్ని వింత ప్రయోగాలు
Lady Ambassador ను 'దూతవతి' అంటారు. మనమైతే దౌత్యవతి
అనే వాళ్లమేమో |
“సుంగరాయి” అనే పదం National Flower అనే అర్థంలో ఉంది. రాయి
రాజశబ్దభవం. మరి 'బుంగి పుష్ప శబ్దభవమేమో!
'ధర్మసిస్యా' అనే మాట ఉంది విద్యార్దుల కిచ్చే ఉపకారవేతనం (Scholarship) అనె అర్ధంలో. ధర్మసత్రం, ధర్మఖర్చువంటి మున ప్రయోగాల్లొని ధర్మశబ్దానికి ఉన్న అర్థచ్చాయే చూ 'ధర్మసిస్వ'లో ఉంది. కళాశాల విద్యార్థికి “మహాసస్వ అని, విద్యార్థినికి “మహాసిస్వి” అనీ (ప్రయోగాలు ఉన్నాయి.
కేవలం నా సాంస్కృతిక పర్యటన సందర్భంల్ చెదురుమదురుగా (గ్రహించిన విశేషాలివి. భాషాజిజ్ఞాసువులు క్షుణ్ణంగా పరిశోధిస్తే ఆ భాషకూ సంస్కృత అరబ్బీభాషలకూ మధ్య ఉండే సంబంధం మరింత స్పష్టమౌతుంది. అంతే కాదు, మన దేశంలో ఉండే సవర, సంతాలీ, ముండారీ మొదలైన ఆటవికజాతులు మాట్లాడుకునే భాషలకూ మలేభాషనూ ఉండే సంబంధాన్ని కూడా (గ్రహించే వీలుంది. ఇలాంటి పరిశోధనలు భాషాపరంగా ఎంతో అవసరమైనవి.
ఖో
ఆశ్చర్యార్థకాల్లో ఆప్తస్మరణం
రోశ్చర్యం కలిగినప్పుడు మనం దేవుణ్లో, ఆస్తులనో తలచుకుంటాం. ఒక్కొక్కప్పుడు మంచిని స్మరించుకోవడమూ జరుగుతుంటుంది. బళి, భళీ, భళా
అనేవి భలా (మంచి) భలాయీ (మంచితనం) అనే మరారీ, హిందీపదాల పాదులో
పుట్టినవి. “భళానోయ్ భళీ తమ్ముడా, మేల్ భళానోయ్ దాదానా” అనే బుర్రకథ దరువులోని 'భళాభళీలు, మేల్ భళాలు సాధ్వర్థద్యోతక శబ్దాలే. చాంగు, చాంగురే వంటి ఆశ్చర్యార్థకాలు కూడ మంచిని సూచించేవే. *'చాంగు” మరారీశబ్దం. మంచి, అందమైన అనే అర్థాల్లో వాడుకలో ఉంది. 'చాంగురే”, భళారే” హాయిరే” వంటి పదాల్లోని 'రే'కి స్వత్హం(త్ర ప్రతిపత్తి లేదు. ఇది (ప్రశంసార్ణక శబ్దాలకు అను ప్రయుక్తంగా ఉండే పుచ్చం మాత్రమే. ఆశ్చర్యార్థకాలన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తే వీటిలో అధికాంశం ఆప్తస శరణ
సంబంధులే అగుపిస్తాయి. అంటే మనం విస్మయచకితులమై నప్పుడు అమ్మనో, నాన్ననో, అక్కనో, అన్ననో చివరికి చెల్లినో తలచుకుంటామన్న మాట. ఆశ్చర్యార్థకాలుగా ప్రచారంలో ఉన్న పదాల్లో ఆప్రసంబంధవాచకాలే (ప్రాయికంగా ఉన్నాయని నిరూపించడమే ఈ వ్యాసిక ఉద్దేశం.
స్థూలంగా ఆప్తసంబంధవాచకాలను మూడు వర్గాలుగా ఏభజింపవచ్చు. 1. మాతృవర్గం. 2. పితృవర్గం 3. సోదరసోదరీ వర్గం.
1. మాతృవర్గం అమ్మో : అమ్మను తలచుకోవడం. ఓయమ్మో : సంబుద్ది రూపంలో ఉన్న ఆశ్చర్యార్థక మిది.
1 చాంగు' సంన్మ్కృతంలోని బర శేబ్రఎక్సతి అయివుంటుంది.
2. ఈవరునలోనే మజ్జారోను కూడా పేర్కొనవచ్చు. ఇందులోని మజ్జ, మజా' అనే ఉర్జూపదం వుక్కిటవుట్టి ఉండవచ్చు).
61 | డా? స్ నారాయణరెడ్డి
ఓలమ్మో : పై అర్హంలోనే ఉన్న మాండలికమిది.
అమ్మమ్మో : ఈ ద్విరుక్తి ఆశ్చర్యాతశయద్యోతకం.
అమ్మమ్మమ్మమ్మ : వేలదాటిన విస్మయాన్ని సూచించేది ఇది. పైన పేర్కొన్న మొదటి నాలుగు అకారాంతాలుగా కూడా వాడుకలో ఉన్నవి.
అవ్వ : ఈ పదం అమ్మమ్మ, ముసలమ్మ అనే అర్జాల్లోనే కాక “అమ్మ అనే అర్హంలోనూ వ్యవహారంలో ఉంది ఆశ్చర్యంతో నోరు నొక్కు కుంటూ అనే మాట ఇది. ఈ వ్యక్తికరణం స్త్రీలకే ప్రత్యేకం. 'అవ్యో, ఓయవ్యో' అనే ఓకారాంతాలు కూడా వాడుకలో ఉన్నవి. మరి “నీయవ్వ” అనడం వేరు. అది నిందార్థకం.
మాయురె : దీన్ని దేశ్యమని శబ్దరత్నాకరకారుడు పేర్కొన్నాడు. కాని ఇది హిందీ, మరాఠీ భాషల్లోని మాత్రర్హకమైన “మాయి” అనే పదం నుంచి వచ్చిన భత కాయతో యాల. ఇదీ (క్రతు పరిణామం,
2. ఖతృవర్లం
అబ్బో : “అబ్బ” అంటే తండ్రి. అబ్బో అంటే తండ్రిని తలచుకోవడమే కదా!
అస్ఫా క “అబ్బకు” మూలం “అప్పు”. ఇది తమిళ భాషలో పిత్రర్థంలో వాడుకలో ఉంది. తెలుగులో “అప్పా” అనేది రాయలసీమ, నెల్లూరు (ప్రాంతాల్లో కేవల సంబుద్దిగానే ప్రయోగంలో ఉంది. కానీ, ప్రాచీనకావ్యాల్లో అప్ప, అప్పప్ప
శ డా G2
అనెవి “అబ్బ, అబ్బబ్బ" అనే అర్థంలో ప్రయోగింపబడినాయి. *
దా
3. తెలంగాణంలో కొని) కులాల అమ్మను “అవ్వు” అనడం నేటికీ ఉందిః భారతంలోని Weng నీవెవ్యరి దానవు” వంటి వ్రయోగాల్లాని “అవ్వ” గొరపబోధరకమున సీ (స్తే వాచకం మా(తమే.
4. మాయురె భృంగమా వికచమల్లికలన్ విడనాడి”
((శీనాథునిపేర చెలామణీలో ఉ ఉన్ఫు భృంగపంచకం) “గుణమయ్యారే ప్రసాదంబు, మాయురె దాక్లీణ్యము” (చంద్రాంగద చరి(త 3 ఆ.)
5, “అపా యెస్తురింజొప్పునొమ్రుదురు (రాజవావాన దిజయం)
“అపువ్లు భవ్మత్రభావవిభివాఢ్యత యేమని నన్ఫు తింపగన్” (నొరంగధర చరితం, 1 ఆ
సమోక్షణం 62
అయ్యో : అయ్య అంటే తండ్రి. ఇది 'ఆర్య' శబ్దభవం. ఇది తండ్రిని తలచుకోవడమే. దీనికి “అయ్యయ్యో” అనే ద్విరుక్తరూపంజంది. “అయ్యయ్య య్యయ్యో” తరచుగా వింటున్న మాటే మరి.
అయ్యాం థి జె 'ప్రాచీనకావ్యాల్లోనూ పాతతరహా నాటకాలలోనూ బహుళంగా కనిపిస్తుంది. అత్యంతగాంభిరంగా అభినందనాత్మకమైన ఆశ్చర్య రేఖను ప్రకటించడం దీని నైజం. ఎంత గాంభీర్య ప్రకటనం ఉన్నా ఈ పిలక ఆ 'తండ్రి' పాదులో పుట్టిందే కదా! దీనికి “అయ్యరే” అనే రూపాంతరం కూడా ఉంది.
"ఓరి నాయనో : ఇది పితృ్సస్మరణసంబంధిలైన ఆశ్ళర్యార్థక పదంగా
బహుళ (ప్రయుక్తం.
బాపు” : హిందీ, మరారీ, ఉర్జూభాషల్డొ “బాప్” అంటే తండ్రి. “బాప్‌రే” అని మరారీలోనూ “బాప్‌రె బాప్” అని హిందీ, ఉర్జూల్లోనూ ఈ మాట నితం౦ వినిపిస్తుంది. ఆ “బాప్” ఈ “బాపు”గా రూపుదిద్దుకుంది. దీనికి ప్రాచీన కావ్య ప్రయోగమూ ఉంది. ఈ పదానికి “ర” అను ప్రయుక్తంకాగా “బాపురే” ఏర్పడింది.
3. సోదర సోదరీవర్లం
అన్నా" : “అన్నా! ఎంతపని జేసిండు వాడు' వంటి వాక్యాలలోని “అన్న” ఆశ్చర్యాన్ని ప్రకటించేదే.
- అన్నన్న : ఈ ద్వోరుక్తి ఎస్మయాధిక్యసూచి. ఇది వాడుకలోనూ వుంది. ప్రాచీన కృతుల్లోనూ కనిపిస్తుంది.
అక్క *: ఇది సమకాలీనవ్యవహారంలో ఆశ్చర్యార్థకంగా ప్రయుక్తం కాకున్నా ప్రాచీనకావ్యాల్లో విరళంగా అగుపిస్తున్నది.
ఓ చెల్లి : ఇదీ (ప్రాచిన కావ్యప్రయోగమే. ఐతే ఇందులోని ఆశ్చర్య ప్రకటనలో కొంత సంతాపచ్చాయ గోచరింపకపోదు. విస్మయం ఆనంద
6. అయ్యారే! చెలువెక్కడ, అయ్యారే గెలువజాలు నంగజు నారిన్ (విజయ బిలానం. 1 ఆ.) 7. “లేమ నగవుచూపు, లేమననగు బాపు!” దిజయవిలానం. 1 ఆ.) i అనన వము ఎెన్ఫుని, యన్చున్దు జయించు” (దిజయ విలానం. 1 ఆ) 9. అక్క! యిదియేమిబోద్యమో” (వకనప్రతి; 1 ఆ) ఇందులోని అక్క 'జౌ” అనే అర్ధంలో వాడబడింది. 10. ఓ చెల్ల! విరహిణీవధ, మే చతురత నీకు యనుచరిత ౩ ఆ.
63 డా॥ సి. నారాయణరెడ్డి
సమయంలోనే కాదు ఆపద్వేళ కూడా కలగడం లోకసహజం. ఈ “చెల్ల” అనేపదం ఈనాటి “చెల్లె” “చెల్లి” “చెల్లెలు”. “ఓ చెల్ల”కు “ఓచెల” అనే ద్విత్వరహిత రూపాంతరం కూడా ఉంది. "'
ఇంతవరకు ఆప్తవర్గంలో పేర్కొన్నపదాలు (ప్రత్యేకంగానూ, ద్విరుక్తంగానూ, పునఃపునరుక్తంగానూ ఆశ్చర్యార్థకాలుగా రూపొందిన తీరును పరిశీలించడం జరిగింది. అమ్మా, నాన్నా, అక్కా, చెల్లి విడివిడిగా జ్ఞాపకం రావడం మాత్రమె కాదు. ఒకేసారిగా అమ్మ, అక్క గుర్తుకు వచ్చిన సన్నివేశాలు ఉంటాయి. అప్పుడుదయించన ఆశ్చర్యార్థకమే “అమ్మక్క'. ఆధునిక వ్యవహారంలో ఇది కనిపించకున్నా కావ్యప్రయోగంగా మాత్రమే మిగిలిపోయింది. "
అమ్మా అక్కా కలిసి మాత్రమే కాదు అమ్మా చెల్లీ కలిసి జ్ఞప్తికి వచ్చిన సందర్భమూ లేకపోలేదు. అలాంటి పట్టున పుట్టిన మాటే “అమ్మచెల్ల.”*
ఆప్తవర్గీయపదాలన్నిటిలో అత్యంతచమత్కారంగా సంఘటితమైన పదం “అమ ట్రచెల్ల. స్థూలంగా ఏన్నప్పుడు ఇదె వి ధ్యన్యవన్థావాచక శబ్ద శబమో అనిపిస్తుంది. కానీ ఇందులో ముగ్గురు మూర్తులు ముప్పిరిగొని సృతిరంగంలో సాక్షాత్కరి స్తున్నారు. అలా ఆహం దంటే ఈ “అమ్మకచెల్ల' పదం (అమ్మ+అక్క+చెల్లియ -అమ్మ+అక్క+చెల్లీాఅమ్మ+అక+చెల్ల.) ఇందులోని చితం “చెల్లియా” చెల్లి” గా మారడం కాదు - “అక్క”లుప్రద్యిత్వమై 'అకిగా రూపొందడం. ఈ 'అమ్మకచెల్ల కూడా నిత్యవ్యవహారంలో నేడు గోచరించదు. (ప్రబంధకాలంనాటికి ఇది వ్యవహారంలో ఉన్న సజీవ పదమే అయి ఉంటుంది. (ప్రస్తుతం మనుచరిత్ర, విజయవిలాసంవంటి ప్రబంధాల్లో ఇంతలేసి కళ్ళతో సహృదయపాఠకులను చూస్తూనే ఉంది. తనలో ఇమిడి ఉన్న ఆప్తత్రయాన్ని మీరైనా గమనించండి అంటూ మౌనభాషలో రహస్యాన్ని ప్రబోధిస్తూనే ఉన్నది.
నా.
11. ఓ చెల! హస్తాంబురుహాంగుళీమయ మహానిడ్డాషధిపల్ల వాంచలముల్ ( శం. నై. 5s) 12. అమ్మక్క! యని సతులక్కజంబంద (ద్యాపదరామాయణము - జలకాండ) 13. “అమ్మబెల్ల యిటులనకుము” (భార. శాంతి. 3౩ఆ). 14. 'అమ్మకబెల్ల! వాని నయానాంబకముల్ శతప(తజై(తముల్) మను. చు "అమ్మ కబెల్ల నొ హృదయ మమ్ముక బెల్లదు వీని కేయడర్' (విజయ. మి. 1 ౬)
64
అచ్చుతప్పల్లో మెచ్చుతునకలు
అచ్చుయంత్రంలేని రోజుల్లోనే “అచ్చు” అనే మాట ఉన్నది. ఇటీవల అది “అచ్చు గుద్దినట్టుగా” అనే ప్రయోగంలో ఉన్నా, తిక్కన్నలోనూ అది “అచ్చొత్తి నట్టు” కనిపిస్తూనే ఉన్నది. పూర్వం తాళప[త్రగ్రంథాలు ఎత్తి వ్రాసేటప్పుడు లేఖక ప్రమాదాలు అనివార్యంగా దొరలేవి. రాను రాను చివికిన తాటాకుపుటల్డొ శల్యావళిష్టంగా బీవిస్తున్న కొన్ని అక్షరాల ఆకారాలు మారిపోవడంలో ఆశ్రర్యంలేదు. అందుకే ఇటీవల పరిశోధకులకు పట్టాలకు కావలసిన సామ(గి పట్టినంత దొరుకుతూ వస్తున్నది - పాఠాంతరాల రూపంలో, సంశోధిత ముద్రణల స్వరూపంలో.
అచ్చు తప్పులు అనేక విధాలు. కొన్నిటి అశ్రీలావతారాలను గూర్చి, కొన్నిటి అనర్జాలు తెచ్చిపెట్టే అవస్థలను గూర్చి రకరకాలుగా చెప్పుకోవడం చాలా కాలంగా ఉన్నదే. అయితే అప్పుడప్పుడు ్రూపులు చూసే అవకాశం ఏర్పడినప్పుడు నా చూపులకు చిక్కుకుని, మతిపొరల్లో నక్కుకుని, ఏటి నీటి మడతల్లోని చేపల్లా తళుక్కున స్ఫురించే అచ్చుతప్పులు కొన్ని ఉన్నాయి. అవి అనర్జాలిచ్చేవి కావు, అతీతార్జాలిచ్చేవి. తలాతోకా లేనివి కావు. బు(ర్రకిర్రుమనిపించినా తోచనివి. కొన్ని అచ్చుతప్పులు అలాగే ఉంటేనే బాగుండేది అనేటంత అద్భుతభావాల కుప్పలు. అనవసరంగా దిద్దుతున్నామే అనే బెంగతో కుంగతిసే అనూహ్వ్యార్థ పేటికలు కొన్ని. అలాంటి అచ్చుతప్పుల్లో నుంచి మచ్చుకు కాదు మెచ్చుకు కొన్ని.
4 అ “శ్రీనాభుడు”
ఒక ప్రకరణంలో పదేపదే శ్రీనాథున్ని గూర్చిన (ప్రసక్తి. ముద్రాపకుని కళ్ళలో, మునివేళ్లలో విరక్తి. ఎన్నిసార్లని శ్రీనాథుడు, శ్రీనాథుడు. అనుకోకుండా ఆ ముద్రాపకుని వేళ్లలో ఒక రసరేఖ మెరిసింది. 'భు'కు బదులుగా 'భు” మీదికి వెళ్లింది వేళ్ల దృష్టి. “శ్రీనాభుడు” సిద్దమయ్యాడు. శ్రీనాథుడికి భిన్నార్ధం వచ్చిందని ఎందుకు కంగారుపడాలి? బంగారంలాంటి వినూత్న ప్రయోగాన్ని ఎందుకు దిద్దేయాలి? కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఆగర్భ శ్రీమంతుడు. కవిపితామహుడైన కమలనాభామాత్యుని మనుమడాయె. ఆ “కమలనాభుని” అవతారమే ఈ
65 డో॥ స. నారాయణరెడ్డి
శ్రీనాథుడు. ముమ్మూర్తులా తాతకు తగ్గ అనక అతడు “కమలానాభుడి”ని అనుకుంటే, కమలా అంటే “శ్రీ” అని తెలుసుకుంటే - కమలానాభుడే వ్రీనాభుడవుతాడు. ఇలా అనుకోకున్నా వచ్చే ముప్పేమీ లెదు. శ్రీనాథుడు “తిలల పెసల” జోలికి పోకముందు ముత్యాలశాలల మధ్య, దీనారటంకాల మధ్య ఈదులాడినవాడేకదా. మొలకమీసం రోజుల్లోనుంచి అమాత్యుల సాంగత్యంలోనో, అవచి తిప్పయ్యల సాహచర్యంలోనో వెలిగినవాడే కదా! సిరి అతణ్ని చిననాడే వరించింది. శ్రీనాథుడైనాడు. సిరి అతనికి పుట్టుకతోనే వచ్చింది. శ్రీ న్గీనాభుడై నాడు. శ్రీ తన నాభిలో ఉన్న వాణ్ని - ఊకదంపుడుగా శ్ర శీనాథుడు, శ్రీనాథుడు అనడానికి బదులుగా “శ్రినాభుడు” అని ఆ ముద్రాపకుని చేయి చెబితే దిద్దడానికి మనకు చయ ఎలా వస్తుంది మరి?
7A 'శ్రీస్తీ.
ది శ్రిశ్రిని గూర్చిన ప్రకరణం అనుకుందాం. అందులో యుగళశ్రీ గా ముద్రాపకుని వేళ్ళకు తగులుతున్నాడు. ఒక “శ్రీ” అలాగే ఉంది. రెండో “శ్రీ” ఉండవలసిన చోట “స్త్రీ” వచ్చి కూచుంది. విపరీతమా ఇది? కాదు : సామాన్యునికి ఊహాతితం. శ్రీశ్రీ తానే చెప్పుకున్నాడు. శ్రీ అంటే అమృతమనీ శ్రి అంటే విషమని. నిఘంటువుల్లో నిద్రించే ఈ ఉభయార్థాలు గాని, శ్రీరంగం శ్రీనివాసరావు అనే పదద్వయంలోని శిరోద్యయమే ఈ శతి అని గానీ తెలియని నర్మాయకుజైన ఆ మురాసకుడికి నెలటుకో శ్రీ పక్కన (స్తీ ఉంచాలనిపించింది. అది మగతలో జరిగిందో మనోవి క్రియతలో జరిగిందో మొతానికి "కొత్తగానే ' జరిగింది.
శీ అంటే అక్ష: శీ ఒక (స్త్రీ అంటే (స్తీ అంటే - శ్రీ అనడానికి వీలుంది. ఈ రకంగా చూస్తే శ్రీ (స్తీ అంటే శ్రీ శ్రీ అనేకదా.
మరోరకంగా చూస్తే శ్రీ అంటే బుద్ది - సరస్వతి. సరస్వతి ఒక Ee అంటే (స్తీ అంటే సరస్వతి అనడానికి పతతి | గదా. ఇలా చూస్తే “ శ్రీస్తీ” అంటే సరస్వతి+సరస్వతి-ఉభయ సరస్వతి. అటు సంప్రదాయానికీ ఇటు ప్రయోగానికీ. అహో! ముద్రాపకుడు మనల్ని ఎంతటి ఎత్తుల్లోకి ఎగరేస్తున్నాడు రెండు పొడి పొడి అక్షరాలతో. ఇది తెలిసి చేసిన తెలివి కాకపోవచ్చు. అవ్యక్తస్సురణ-జానపద గీతంలా, అమ్మమ్మ చెప్పే అధ్యాత్మ వేదాంతంలా,
౩, 'భావకపులు'
కవులకు “కపులు” అని తప్తుపడడం అచ్చు పుట్టినప్పటినుంచి ఉన్నదే. జోహార్తకు బదులుగా (శ్రద్దాంజలి సమర్పించడం, సందేశం బదులుగా సందేహం అందించడం, కృతజ్ఞతలను మీరగేని కృతఘ్నతలు పుక్కిలించడం తరచుగా వింటున్నవే. చూస్తున్నవే. ఈ “భావకపులు” అనేది ఆ కశత నిధి కాద “భావకవులు” అనడానికి బదులుగా “భావకపులు” అని పడిందిలెండి అని అంత సులభంగా తీసివేసే ప్రయోగం కాదది. భావకవితాయుగాన్ని రెండు మూడు దశాబ్దులు పరిపాలించినవారి తలనూ కవితలనూ, “లోనారసి” చేసిన అసదృశ ప్రయోగమిది. అసలు “కపి” అంటే ఏమిటి? కోతి. “కంపతే చలతితి కపిః”. ఎప్పుడూ కదిలేది కపి. చలనం హృదయధర్శ్మం. మనసు కదిలితేనే భావం పుడుతుంది. “వికారో మానసో భావః” భావకవులు హృదయవాదులు. హృదయం నిత్వ్యచలనశిలం. అందుకే భావకవులు ఆకులో ఆకుగా, పూవులో పూవుగా దాగిపోయారు. నేలనుంచి నింగివరకు సాగిపోయారు. ప్రకృతిలోని ప్రత్యణువులో పరవశించిపోయారు. ఇది చలనగుణం లేని (ప్రవృత్తికి సాధ్యమయ్యేది కాదు గదా! అందుకే ముద్రాపకుడిలోని అవ్యక్తసంస్కారధార తిరగబడింది. భావకవులను భావకపులుగా తిప్పసింది. “కవయతీతి కవిః” అని కదా వ్యుత్పత్తి. కవనం అంటే వర్ణనం. ఆ వర్ణనం ఎలా వస్తుంది-స్పందనం లేనిదే; హృదయంలో చలనం కలగనిదే ? వర్ణనకు మూలం స్పందనం. ఆ స్పందనం ఒళ్ళంతా ఉన్నదే కపి. చలనానికి ప్రతీకలాంటిది కపి. ఈ జీవగుణం అధికంగా ఉండడంవల్లనే “భావకవులు” “జావకపులు .గో పరిణమించారేమో ఆ ము(ద్రాపకుడి భావముద్రలో.
4. 'ఖుందపతి'
- మాత్రాచ్చందస్సులో అయిదురకాల నడకలున్నాయి. ఖండగతి, (త్రి శ్రగతి, చతురశ్రగతి, మిశ్రగతి, సంకీర్ణగతి. వీటిల్లో 'ఖండగతి'ని గూర్చిన చర్చ జరుగుతూ ఉంది. “గతిలేదు” “ ప్రగతిపథం” వంటి మాటలు రోజూవింటున్న వే వీథుల్లోనో, అశరీరవాణి బోధల్లోనో. ముద్రాపకుడికి ఈ “ఖండగతి” ఏమిటో విడ్డూరంగా తోచి ఉండవచ్చు. “ఖగపతి అమృతము తేగా”- ఎప్పుడో విన్న పద్యం ఒకటుంది.
67 డా॥ సి. నారాయణరెడ్డి
తరుచుగా చూసున్న 'జగపతి' ఉంది. ఆ- అది ఖండగతి కాదు “ఖండపతి” అయి ఉంటుంది. హఠాత్ స్ఫురణ. రుటితిముద్రణ.
5. “సతితార్మికభౌతికవాదం”
మార్కు (ప్రవచించిన సిద్దాంతం గతితార్కిక భౌతికవాదం. డైలెక్టికల్ మెటీరియలిజం అనే దానికి అనువాదమిది. (ప్రపంచచరిత్రను వర్గసంఘర్షణ దృక్పథంతో సమిక్షించే గుణం ఈ సిద్దాంతం వెనక ఉంది. 'ఖండగతి' లోని “గతి” చోట “పతి” ప్రవేశించినట్టే “గతి తార్కిక”లో 'సతి' ప్రవేశించింది. ఆ సమాసంలోని “తర్కం”, “వాదం ” అన్న పదాలుఅప్పుడప్పుడు వింటున్నవే. భార్యాభర్తల మధ్య అడపాదడపా తర్కాలు, వాదాలు, తర్ణనభర్ణనలుతప్పని సరి. పతుల పెత్తనాలను మెత్తగా నిరసిస్తూ చతురసతులు వేళ చూసుకుని, వీలుచేసుకుని తర్కం పెట్టుకోవడం, వాదంలోకి దిగడం సత్యదూరం కాదు. -ఈ నిత్య నైమిత్తికపతి సతీప్రవృత్తిక వాతావరణం ఆ క్షణంలో ముద్రాపకుడి ముందు నిలబడి ఉంటుంది. 'గతి” వెంటనే 'సతిగా' మారి ఉంటుంది. ఆ 'భౌతికి పదంలోనూ పదార్దం ఉందికదా. పదార్హమంటే పాల సీసాలు మొదలుకొని అంబాసిడర్ కార్ వరకు విస్తరించి ఉన్న పదమె. భౌతిక వాదంలో వీటికి సంబంధించిన వాదం లేకపోలేదు. “తార్కికభౌతికవాదం” కొప్తున “సతిని ముడిచిన ఆ అచ్చుతప్పు మెచ్చుతప్తు కాదంటామా?
6. "విశ్వనాథవారి నామాయణము”
విశ్వనాథవారి శ్రమద్రామాయణకల్పవృక్షాన్ని గూర్చిన సందర్భం. విశ్యనాథవారనగానే వేయిపడగలు గుర్తుకొస్తుంది. ఈ మధ్య రామాయణం కూడా ముందుకొస్తున్నది జ్ఞానపీఠబహూకృతి వల్ల, హేతువాదుల నిరాకృతి వల్ల. విశ్వనాథవారి రామాయణము” అంటే ఏముంది విశేషం? విశ్వనాధ వారిది అన్ని'ప్రక్రియల్లోనూ ఒక విలక్షణశైలి. ఆయన పలుకేవేరు. ఆముద్ర రామాయణం పైనా ఉంది. దాన్ని “వైశ్సనాధీయం” అనే వాక్సిత్రులూ లేకపోలేదు. విశ్వనాథ వారి వ్యక్తిత్వాన్ని అనుపదమూ నిలుపుకున్న ఆ రామాయణం అతని 'నామాయణంి
సమోాక్షణం 68
కాక వేరేమవుతుంది. ఈ వ్యాసం ్రూపులు చూస్తుంటే పదే పదే పక్కదొరలించిన అచ్చుతప్పుల్లో చెప్పుకోదగ్గవి 'కపి' బదులు కసి. 'భావ' కు బదులు బావ. “పీభ్రి కు బదులు పీత. ఎంతదిద్దినా అలాంటివి ఇప్పటికీ అలాగే వుంటే ఈ రచయిత క్షంతవ్యుడు.
ఇంతవరకు వివరించిన అచ్చుతప్పులన్నీ అక్షరచమత్కృతిని, సమాస వైచిత్రినీ, అతీతార్థస్ఫూర్తినీ అందించే మెచ్చు తప్పులే. అయితే “అమర కోశము" 'అమరశోకము'గా పరివర్తించిన పట్టులూ లేకపోలేదు. ఇందు లోనూ సత్యం లేదనగలమా? “ అమరకోశము ” అనే ఈ నిఘంటువు చిన్నప్పుడేభట్టి పెట్టే యోగం పడితే ఆ పసినాల్కలకు అది “'అమరశోకంిగా మారడంలో ఆశ్చర్యమే ముంటుంది,
ఖ్
మాత్రాబ్బందస్సులు
'ఛందాంసి ఛాదనాత్' అని నిరుక్తంలో యాస్కుడన్నాడు. అంటే ఛందస్సుభావాలకు తొడుగువంటిదని తాత్పర్యం. 'యదేతేన ఆత్మాన మాచ్చాదయన్ ఇతిచ బ్రాహ్మణం”. దేవతలు తమ ఆత్మలను ఛందస్సుల వెనుక దాచుకున్నారని యాస్కుడు (బ్రాహ్మణం నుంచి ఉదాహరించాడు. వేదంలోని ఆరు అంగాలలో ఛందస్త్వాకటి. అంతేకాదు. “ఛందః పాదౌతు వేదస్య”. వేదపురుషునికి ఛందస్పే పాదాలని మన ప్రాచీనుల అభిప్రాయం.
పింగళనాగుడు మొట్ట మొదటి ఛందశ్శాస్త నిర్మాత. ఇతడు ప్రధానంగా వైదికచ్చందస్సును గూర్చి వ్రాశాడు. అర్యాచినులైన కేదారభట్టు మున్నగు వారు వైదిక లౌకిక - ఉభయచ్చందస్సులను చర్చించారు.
ఛందస్సు అనే సంస్కృతపదానికి "502060" “స్కంటదో” అనే లాటిన్ పదానికి సంబంధముందని కీ.శే. చిలుకూరి నారాయణరావు గారభిప్రాయపడ్డారు. “స్కందో” అంటే విభజించడం, భేదించడం. కవులు తమ పద్యాలను, గేయాలను = ఒక లయలో రచిస్తారు. లాక్షణికులు వాటిని పరిశీలించి అవి ఎలా ఎలా నడుస్తాయో విడదీసి చూపుతారు. అలా విడతీసి చూపబడిన సూత్రసముచ్చయమే ఛందశ్శాస్త్రం.
ఆత్యాధునికయుగంలో ఛందోబంధాలు సడలిపోతున్నాయి. అలాగే అతి (ప్రాచీనకాలంలో ఛందోనియమాలు అంత బలంగా లేవు. బుగ్వేదంలో (ప్రాచీన బుక్కులను పరిశీలిస్తే ఆనాటి వైదికకవులు ఛందస్సు విషయంలో ఎంత స్వచ్చందంగా ఉండేవారో తెలుస్తుంది. కొన్ని బుక్కులు ఒకే కాలుమీద నడుస్తాయి. కొన్నింటిలో పాదసంఖ్య అటుండనీయండి - గురులఘునియమం కూడా పాటింపబడలేదు. (క్రమంగా బుగ్వేదం పదోమండలంలోకి వచ్చేసరికి ఛందోనియమాలు బిగుసుకున్నాయి. ఐతరేయబ్రాహ్మణంలో నియమబద్ధంగా నిల్ఫిన ఒక అనుష్టుపు చూడండి.
సబూక్షణం 70
“చరన్ వై మధు విందతి
చరన్ స్వాదు ముదుంజరం
సూర్యస్య పశ్వస్థిమానం
యో నతం(ద్రయతే నిశం”.
అనుష్టుప్పు వైదికచ్చందస్సు. ఉక్త, అత్యుక్త గాయత్రి, ఉప్ణిక్కు, జగతి మొదలైనవి 26 వైదికచ్చందస్సులు. ఇవన్ని అక్షరగణాత్మకాలే. లాక్షణికులు లెక్కకు 26 పేర్కొన్నా వేదాలలో త్రిష్టుప్పు, అనుష్టుప్తు, గాయత్రి, జగతి మొదలైనవి పదిహేనుమా(త వేం బహూళంగా కనీవీస్తోతు. నేఠిన్మృుత కావ్యాలలో ప్రయోగింపబడిన ఛందస్సుల్లో చాలవరకు అక్షరగణాత్మకాలే. ఆర్య, వైతాభియ అనే రెండు ఛందస్సులు మాత్రమే మాత్రాబద్దంగా అగుపిస్తాయి. ప్రాకృతంలో సంస్కృతంకంటె ఎక్కువ మాత్రాచ్చందస్సులున్నాయి. గాథ, దోహా, రసికా, చౌపదిఆ, దోఆఇ, లీలావఇ మున్నగు 33 మాత్రాచ్చందస్సులు ప్రాకృత పైంగళంలో వివరింపడ్డాయి. ఈ మా(త్రాచ్చందస్సులు అధికంగా (ప్రచారంలోకి వచ్చింది 'ద్రావిడభాషల్లోనే.
మాత్ర అంటే ఒక లఘువు. “ఏక మాత్రో భవేద్ స్వః.” లఘువుకు ఒక మాత్ర, గురువుకు రెండు మాత్రలు. మాత్రాచ్చందస్సులో గురులఘునియమం లేదు. అక్షరనియమం అంతకంటే లేదు. కేవలం మాత్రల సంఖ్యే ప్రధానం. ఈ మాత్రాగణాలను బట్టి కొన్నిలయ లేర్వడుతాయి. లయ అంటే స్పష్టమైన నడక. నడక కొన్ని కాలఖండాల గుంపు. ఈ లయ మనకు (ప్రధానంగా నాలుగు రకాలుగా అనుభావ్య మవుతుంది. వాటినే లాక్షణికులు చతుర(శం, త్రిశ్రం, మిశ్రం, ఖండం అన్నారు. “తకతక” అని నాలుగు మాత్రలతో నడిచేది చతురశ్రం. “తకిట” అని మూడు మాత్రలతో నడిచేది త్రిశ్రం. “తకిట తకతక” అని యేడు మాత్రలతో నడిచేది మిశ్రం. “తకతక తకతకిట' అనే తొమ్మిది మాత్రల నడకగూడా గాయకులు (గహంచారు గానీ అది 4,5 అన్న రెండు గుంపులుగానే నడవడం వల్ల దానిని 'సంకీర్షం' అనే పేరుతో (త్రోసివేశారు.
మాత్రాచ్చందస్సు కేవలం లయ(ప్రధానమూ, తాళప్రధానమూ కాబట్టి దీనికి అక్షరవృత్తాలకున్న సం కెళ్లు లేవు. శార్ట్జూలం, మత్తేభం మొదలయిన అక్షర
74 hy S; నారాయణరెడ్డి
వృత్తాలలో తాళప్రసక్తి లేదు సరికదా స్పష్టమైన లయకూడా దొరకదు. మానిని, కవిరాజవిరాజితం మొదలైన కొన్ని వృత్తాలు తాళబద్దమైనవి ఉన్నాయి. తెలుగులో నన్నయ వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టాడు.
'ఏచి తనర్భి తలిర్భిన (కోవుల ఇమ్మగుఠావుల జొంపములన్
పూచిన మంచి అశోకములన్ సురసొన్నల పొన్నల గేదగులన్
కాచి బెడంగుగ పండిన ఆ సహకారములన్ కదళీతతులన్
చూచుచు వీనుల కింపెసగన్ వినుచున్ శుకకోకిలసుస్వరముల్.
ఇది మానినీ వృత్తం. మాత్రాచ్చందస్సు దృష్ట్యా చూస్తే ఇది చతుర శ్రగతిలో నడుస్తుంది. కానీ, దీనిలో ఉన్నవి మాత్రాగణాలు కావు, అక్షరగణాలు. ప్రతి పాదంలో వరుసగా 7 భగణాలు, ఒక గురువు ఉన్నాయి. దీని ప్రారంభంలో 'ఏచి'కి బదులుగా 'ఎగిచి” అని మారుస్తామనుకొండి. లయ చెడదు. తాళం అంతకూ భేదించదు. అది వెంటనే “కవిరాజవిరాబితం” అనే వృత్తంగా రూపు దిద్దుకుంటుంది. మొదట
పాదం (ప్రారంభంలో చేసిన మార్చే లన్ని పాదాల మొదట చేయవలసివస్తుంది. నన్నయ ప్రయోగించిన కవిరాజవిరాజితం చూడండి.
“చని చని ముందట ఆజ్యహవిర్హతసౌరభధూమలతాతతులన్ పెనగిన (మ్రాకుల కొమ్మలమిద నపేతలతాంతములైనను ...'
ఇదీ దాని నడక. మాత్రలనుబట్టి చూస్తే ఈ రెంటికీ తేడా ఏమీ లేదు. కానీ వీటిని మాత్రాచ్చందస్సులనలేం. ఎందుచేతనంటే వీటిలో ఉన్నవి అక్షరగణాలు. గురువులు, లఘువులు తమ తమ నియతస్థలాల్లో ఉండక తప్పదు. చతుర శ్రగతిలో శడ్‌నె వృత్తాలలో మానిని, కవిరాజవిరాబితములతోపాటు (కౌంచపదము, తన్వి, భాస్కరవిలసితము మొదలయినఎ ఉన్నాయి. అయితే వీటి గణనియమం పరస్సరం భిన్నం. ఇలాంటి తాళబద్దాలయిన అక్షరవృత్తాలను చూస్తే ఒకటనిపిస్తుంది. మొదట ఇవన్నీ సిసలయిన మాత్రాచ్చందస్సులేనేమో! ప్రాచీనకాలంలో మాత్రాచ్చందస్సులపై అంతగా ఆదరణలేదు. అధికారమంతా అక్షరవృత్తాలదే. మలయపవనంలా వీచే అక్షరవృత్తాలముందు పైరగాలివంటి
సమోక్షణం ఖై
మా(త్రాచ్చందస్సులకు (ప్రసక్తి లేకుండా పోయింది. (ప్రతి శ్లోకాన్నీ, పద్యాన్ని అక్షరగణాలుగా విడగొట్టి అలవాటుపడిన లాక్షణికులు మాత్రోవృత్తాలపై కూడా ఆము ద్రేవేశారు. తత్సలితంగా మానిని, కవిరాజవిరాజితం, మత్తకోకిలవంటి గేయాలు కూడా అక్షరగణాత్మకములైన వృత్తాల జాబితాలో చేరాయేమో?
అప్పకవి సంస్కృతంనుంచి తెలుగులో దిగుమతియైన వృత్తాలనే కాక జాతులను కూడా పేర్కొన్నాడు. ఉపగణమా(త్రలతో జాతులేర్పడుతాయి. జాతులలో మళ్ళీ జాతులు, ఉపజాతులని రెండు రకాలు. కందం, ద్విపద, రగడలు, కళికలు, ఉత్కళికలు - ఇవి జాతులు. గీతం, సీసం' - ఇవి ఉపజాతులు, ఇవి కేవలం దేశీయచ్చందోరీతులనే చెప్పాలి. ఇవి చాలావరకు తెలుగులో, కన్నడంలో (పచలీతంగా ఉన్నాయి. సపద్యంలోని గురులఘునయమం వృత్తాలలో ఉన్నట్టుగా ఉండదు. దీని నడకనుబట్టి చూస్తే ఇది 5, 5 మాత్రలకు విరిగే ఖండగతిలో చేరుతుంది. శ్రీనాథుని సీసాలు ఇలాగే విరుగుతాయి. ఒక్క చరణం చూడండి.
'కలసాపు, రప్రాంత, కదళీవ, నాంతర (దాక్షాల, తాఫల, స్తబకముల, కు.
ఇందులో స్పష్టమైన 5 మాత్రల ఖండగతి ఉంది. ఇది ఇలా ఉండగా మన తెలుగు లాక్షణికులు దీనిని 6 ఇంద్రగణాలు, 2. సూర్యగణాలుగా విభజించారు. 'స్తబకములకు* అని విరిచి వాటిని రెండు సూర్యగణాల (క్రింద తేల్సివేశారు. ఇది లయనూ, తాళాన్ని విస గరించి చేసిన విభజన. మరి న్యాయంగా పాదాంతమందలి *కు' అనే లఘువు ఊపిరి తీసుకోవడానికి ఉపస్కారకమైన 5 మాత్రల కాలమే నడుస్తుంది. కాని వెంటనే ఆరో మాత్రకు రెండోపాదాన్ని అందుకుంటేనే తాళం నిలుస్తుంది. కాని మనం ఆ పని చేయం. 'కు' అనే వర్గాన్ని యథాసంభవంగా 3,4,5,6 ఇలా మాత్రాకాలం మార్చి యీడ్సి వేస్తాము. అందాకా వచ్చిన లయ చాలునని, తాళాన్ని వదిలివేస్తాము. 'లఘువును గురువుగా ఈజ్బ పద్దతిని గమనించక తాక్రఈ కులు. ఇం ర్క "చం, సూర్యగణాలని ఒక ఆభాననం(వప్రదాయం నౌలకొల్సినా'రని శ్రీ రాళ్ళవల్లి అనంత కృష్ణశర్మ గారభి ప్రాయపడ్డారు. ఇంద్రగణాల్లో 5,4 మాత్రల గణాలు, చం[ద్రగణాల్ల్
Ca
73్ర డా సి. నారాయణరెడ్డి
5,6,7 మా(తల గణాలు కూడా ఉన్నాయి. అన్నిటికీ ఒకటే మాత్రల విలువ. 'వైకుంఠు బొగడని వరక్తంబు" అనే సిసపాదంలో 'పొగడని' అనే రెండో గణం ఎంత లయహీనంగా ఉందో మన లాక్షణికులు గమనించలేదు. చదివేవాడు లయకోసం “పొగడని” అనే గణంలోని నాలుగు లఘువుల్లో కనీసం చివరి దాన్నైనా ఈడ్వక తప్పుదు.
ఇక సీసభేదాల్లో సర్వలఘుసీసం అచ్చంగా గేయం. ఇంచుమించుగా ఇది ద్విరదగతిరగడ మోస్తరుగా నడుస్తుంది.
'కరివరద పరమకృప ధరణిధర సురవినుతి ఈ రకంగా నడుస్తుంది. కొన్ని ద్విపదలచివర రెండు మాత్రలు చేరిస్తే ఖండగతిలోకి వస్తాయి.
అప్పకవి మాలికావృత్తములపెర లయ(గ్రాహి, లయవిభాతి, లయహారి మున్నగువాటిని ఎర్కొన్నాడు. ఇవి మాత్రావృత్తాలు కావు. అయినా తాళబద్దంగా నడుస్తాయి. ఇవి ఖండగతిలో ఉన్నాయి. వీటిని నన్నయ, నన్నెచోడుడు తొలుత ప్రయోగించారు. ఈ వృత్తాలు ఒకనాడు గేయాలేనేమో!
అప్పకవి నవవిధరగడలను పేర్కొన్నాడు. విటిని వైతాళీయభేదములన్నాడు. ఇవి కల్తీలేని మా(త్రాచ్చందస్సులు! అంటే గేయాలు. పాలకురికి సోమనాథుడు పండితరాధ్యచరిత్రలొ పేర్కొన్న చంద్రికలు, అర్హచరద్రికలు, ఏలలు, జోలలు, తుమ్మెదపదాలు, వన్నెలపదాలు - ఈ రగడ భేదాలే. నన్నయ రగడలను ప్రయోగించలేదు. తొలిసారిగా తెలుగులో రగడను (ప్రవేశపెట్టిన వాడు పాలకురికి సోమనాధుడు. ఆ తర్యాత పెద్దన, సూరన, రామరాజభూషణుడు మున్నగు ప్రబంధకవులు పుష్రాపచయాదిఘట్టాలలో రగ లు కూర్చారు. పింగళిసూరన
రాఘవపాండవీయంలో రచించిన ద్విరదగతిరగడ చూడండి. అచ్చంగా ఆధునిక గెయంవలె ఉంది.
“పాలిచె మధులక్ష్మ సురపాన్నలను పొన్నలను తెలివిపడి పుప్పాడుల తిన్నెలను చిన్నెలను రంగుగ దనరు నారరగములఅ సంగముల
పెంగళత జెంది ముదభృంగముల అంగముల.” 0
సమీక్షణం 74
అప్పకవి పేర్కొన్న తొమ్మిదిరకాల రగడల్టనే సమస్త మాత్రాచ్చందస్సులు మందహాసం చేశాయి. జానపదగేయాలనూ, ఆధునికగేయాలనూ పరిశీలిస్తే అవన్ని ఈ రగడల్లో ఏదో ఒకదానికింద ఒదిగిపోతాయి. అప్పకవి వివరించిన తొమ్మిది రగడలను ఆధునికగేయాలతో దిజ్మాత్రంగా సమన్వయం చేసి చూపుతాను.
1. హయ'ప్రచార రగడ : ఇది (త్రిశ్రగతిలో నడుస్తుంది. “జను నిజం జను సిజం నివన్నది నిజం నిజం", 2 తురగవల్లనము : ఇది హయ(ప్రచార రగడను రెట్టింపు చేస్తే ఏర్పడుతుంది. 3 విజయమంగళము : ఇది తురగవల్లనానికి రెట్టింపు. 4. ద్విరదగతి : ఇది ఖండగతిలో నడుస్తుంది. 'ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!” స విజయ భ(ద్రము : ద్విరదగతికి రెట్టంపు. 6. మధురగతి : ఇది చతుర[శ్రగతిలో నడుస్తుంది. "మరి ప్రపంచం మరో ప్రపంచం మరో (ప్రపంచం పిలిచింది”. ల హరిగతి : ఇది మధురగతికి రెట్టింపు. 8. హరిణగతి : ఇది మిశ్రగతిలో నడుస్తుంది. 'దేశమును గ్రైమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా!” ర్స వృషభగతి : ఇది 28 మాత్రల ఛందస్సు
పాదానికి 14 మాత్రలుంటాయి.
75 డా సి. నారాయణరెడ్డి
“ఆనందం అర్లవమైతే అనురాగం అంబరమైతే ఆనందపుటంచులు చూస్తాం అనురాగపు లోతులు తీస్తాం.”
మాత్రాచ్చందస్సులు రగడరూపాల్లా చిరకాలంనుండి తెలుగు కావ్యాల్లో తళుక్కుమంటున్నా వాటికి 20వ శతాబ్దిదాకా తగిన ప్రాపకం దొరకలేదు. ఆధునిక కవులు వృత్తాలతోపాటు మాత్రాచ్చందస్సుల్లో కూడా ప్రత్యేక కావ్యాలు వ్రాయడం మెచ్చుకోదగింది. అయితే పలువురు యతిగాని, ప్రాసంగాని, అంత్యనియమం గానీ పాటించక యథేచ్చగా (వ్రాస్తున్నారు. ఇది వాంఛనీయంకాదు. అష్టదిగ్బంధనం ఉండాలని నేననను కాని ఏదో ఒక నియమం ఉండడం మంచిది. అది యతైనా కావచ్చు. (ప్రాసమైనా కావచ్చు. గేయంలో చమత్కారం తప్ప రససిద్ది కలిగించే గుణం లేదని కొందరు సందేహిస్తున్నారు. ఇది విచార్యం. ఆధునికయుగంలో కన్నడంలోని మహాకావ్యాలన్నీ మాత్రాచ్చందస్సులొనే ఉన్నాయి. అంతమాత్రాన అవి రసవంతమైనవి కావా? జీవమున్న కవిత్యానికి ఛందస్సు ఆటంకం కాదు. క్రియాసిద్ది స్పత్తే భవతి మహతాం నోపకరణే'.
శ్
గణారణారభఖభ0ం
'అంత కడివెడు పాలపై ఒ క్కింత మీగడ సేరినట్లుగ మనకు మిగులును గతము లోపలి మలల అదియ వళతప్రతాయనము”
సంప్రదాయానికి నా నిర్వచనమిది. గతమంతా సంప్రదాయంకాదు. గతంలోని మంచిమా(త్రమే సంప్రదాయం. “సమ్యక్ (ప్రదానం సంప్రదాయః? అని కదా వ్యుత్పత్తి.
ఆం(ధ్రసాహిత్యం వెయ్యెళ్ళపంట. ఆ వెయ్యేళ్ళలో వేనవేల కావ్యాలు పుట్టాయి. నేటికీ, రకరకాల రాజకీయ సాంఘిక పరిస్టితులధాటికి మిగిలినవి ఒక కొన్నిమాత్రమె. కాలం విధించిన అగ్ని పరీక్షలకు ఆగి, సలసల కాగి ఈనాటికీ శేషించిన పాలు బహుళ (ప్రచారంలో ఉన్న ఉత్తమ శ్రేణికి చెందిన కొన్ని ప్రాచీన కావ్యాలు. వాటిలో మీగడతరకల వంటివి కొన్న కొన్నీ ఘట్టాలు. ఆ ఘట్టాల తెలుగుజాతి బాగా జీర్ణించుకున్నఎ రక్తవృద్దికి తోడ్పడుతున్నవీ కొన్నే కొన్ని పద్యాలు.
ఆ కొన్ని ఘట్టాలకోసమైనా, ఆ ఎన్నికైన కొన్ని పద్యాల కోసమైనా మనం ప్రాబినకృతులను పఠించవలసివుంది. ఆ సంప్రదాయాల పునాదుల మీదనే సరికొత్త (ప్రయోగాల వ(జసౌధాలు నిర్మించుకోవలసి భుతు వర్తమానంలో కీర్రిశిఖరం అందుకున్న వ అభినవకావ్యమూ సం(ద్రాయాన్ని సంపూర్ణంగా చేదించింది కాదు. నేలవిడిచి సాముచేసిందీ కాదు. అయితే అలా చేయాలని దుస్సాహసం చెసిన చిల్లర కృతులు కొన్ని లేకపోలేదు. ఏమి లాభం? ఎగిరిన మరుక్షణలోనే చతికిల బడ్డాయి వసన!
1. మనుచరిత్రలో వరూథినీప్రవరుల మట్టం, పారిజాతాపహరణంలో సత్యభామ అలుక, పాండురంగ మాహాత్మంలో నిగమళర్మ కథ ప్రబంధారణ్వాల్లో పూసిన
77 డా॥ సి. నారాయణరెడ్డి
యుగయుగాల సాహిత్య చరిత్రను హేతుదృష్టితా, పక్షపాతరహిత వాతి దృష్టితో పరిశీలిస్తే తెలుస్తుంది, ఈ నాటికీ ఉత్తమకృతులుగా కోటి కెక్కినవాటి వెనక ఎంతటి సంప్రదాయబలం అండగా వుందో.
వేదబుక్కులలో ని ప్రకృతి రామణీయకాన్ని పుడిసిలించనిదే ఆదికవి వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని రచించగలిగేవాడు కాడు. వాల్మీకి ఆత్మను ఆకళించుకోనిదే కాళిదాసు కమనియకవితాస్పష్టి చేయగలిగేవాడు కాడు. సంస్కృతంలో వ్యాసుడులేక తెలుగులో నన్నయ్య లేడు. కాళిదాసాదులు లేకపోతే శ్రీనాథాదులు లేరు. వాశ్ళాత్య సాహిత్యం పట్లకూడా బు వరరురది, మిల్టన్ పై వర్ణిల్ ప్రభావం, ఆ వర్జిల్‌పై హోమర్ (ప్రభావం, షేక్స్పియర్‌పై మార్గో ప్రభావం, ఆ మార్గోపై చాసర్ ప్రభావం కోటిగొంతుకలతో ఘోషిస్తున్నాయి-అన్ని యుగాల్లో నూ సాహితీస్రష్టలందరిపైననూ సం(ప్రదాయము[ద్ర కంఠదఘ్నంగా ఉంటుందని. శ్రీశ్రీవంటి ప్రయోగశీలి గేయరచనపై మనుచరిత్ర వసుచరిత్రల ఆశ్వాసాంత పద్యాల ప్రభావం ఎంత పటిష్టంగా పృతరో అభిజ్ఞాలకు తెలిసిందే. ఒక వాణివెనుక ఎందరి అనుభవమో నిబిడీకృతంగా ఉంటుందన్న వర్టీనియావుల్స్ అభిప్రాయం ఈ సందర్భంలో గమనించదగింది. *
అయితే రాకెట్ వేగంతో పురోగమిస్తున్న వర్తమానచరిత దృష్ట్యా అనుక్షణం పరివర్తనంచెందుతున్న విలువలదృష్ట్యా 'ప్రాచినకావ్యాలను పఠించవలసిన అవసరం ఎంతవరకుంది? ఎంతవరకా? గుండెలోనుంచి చిమ్ముకొని వచ్చే నన్నభావాలకు సముచిత సశక్తికశబ్దాలను తొడగడంలో సహకరించే టంతవరకు. విజ్ఞానసీమలనూ, ఆలోచనావలయాలనూ మరింతగా విసృత పరిచేటంతవరకు. చిక్కని ఊహలకు రెక్కలిచ్చి అనంత వియత్సథాలలో ఎగరగలిగే మొక్కవోని ఓజస్సు అందించేటంత వరకు. చెప్పదలచుకున్నది సూటిగానే కాకుండా సుందరంగా చెప్ప సవ్యసాచిత్వం సంతరింపజేసేటంతవరకు. అంతవరకే.
అంతేకానీ (ప్రాచీనులు చెప్పిన ప్రతి అభిప్రాయం నేడు శిరోధార్యమని కాదు. (ప్రబంధాల్లో మన మహాకవులు మేడలనూ, ఎత్తైన గోడలనూ వర్షించడానికి చేసిన సాముగరిడీలతో ఆధునికునికి నిమిత్తం లేదు. శృంగారభుట్టాల్డ్
Pan
2. “The experience of the mass is behind a single voice.
సమోూక్షణం 78
అడుగడుగునా కథకూ, కొంతవరకు సభ్యతకూ అడ్డుతగిలే కచకుచవర్లనలతో, నాభీత్రివళులచిత్రణలతో వర్తమానభావుకునికి ప్రమేయం లేదు. అలాగే ప్రాచీనులు కరుడుగట్టిన వర్లవ్యవస్థపై కట్టుకున్న అభిప్రాయ. కట్టడాలతో, గతకాలమే భావికాలంకంటె గొప్పదని ప్రకరణవశాన చేసిన ప్రసంగాలతో ఆధునికుడు ఏకీభవించడు. 'జరాతురిను “మూడు కాళ్లముసలిది' అన్నప్పుడు ఆంబ్రధ్ర నైషధకారుని తెలుగు నుడికారపు నిగారానికి తలవూపుతాడు. “చెప్పకు మిట్టి తుచ్చసుఖముల్ మీసాలపై తేనియల్” అన్నప్పుడు మనుచరిత్రకారుని ధర్మ పాక్షికతకు జోతలర్పిస్తాడు. 'మనమెరియదె ప్రాణమైన మగడిట్లయినన్' అన్నప్పుడు పారిజాతాపహరణకర్త మానినీమనస్తత్వ విశ్లేషణ శక్తికి పరవశిస్తాడు. కొన్ని సందర్భాల్డ్ వర్ల్యవస్తువుతో ఏకీభావం పొందలేకున్నా, ఆ మహాకవుల ఊహల ఉడ్డనానికీ, కుశ్చాగధిషణకూ, బహువిషయపరిజ్ఞానానికీ జోతలర్సిస్తాడు. వైజ్ఞానికంగా ఎంతగా పురోగమిస్తున్నా మన ఆలోచనాపరిధిపై పురాణ సంప్రదాయాల (ప్రభావం ఏదో ఒకరకంగా భాసిస్తూనే వున్నది. పురాణాల్లోని కొన్ని ఘట్టాలు, కొందరివ్యక్తిత్యాలు ఆధునిక జీవితంలో ప్రతీకలుగా మారిపోయాయి. నేటికీ విలువల వలువలను ఊడ్చివేసేవాడు దుళ్ళాసనుడు. కుతం(త్రాల పద్మవ్యూహాలను చీల్చే కుమారవీరుడు అభిమన్యుడు. బుజు వాక్కు రామబాణం. . సహనపరీక్ష అగ్ని పరీక్ష. ఇంకా ఆ కబంధహస్తాలు, ఆ విలయతాండవాలు, ఆ బలిపీఠాలు, ఆ గొంతెమ్మ (కుంతి) కోరికలు, ఆ 'సుప్పనాతి' చేష్టలూ ఇప్పటికీ | దైనందినజీవితంలో ఆధునిక భావప్రకటనకు అలంబనాలుగా ఉన్నాయి. నవకవులు కూడా (త్రేతాగ్నులనూ, హోమజ్యాలలనూ, రుద్రవీణలనూ, (ధ్రువతారలనూ, ఆధునికయుగచైతన్యాన్ని ప్రతిబింబించడానికి కవితాప్రతీకలుగా స్వీకరిస్తూనే వున్నారు. గతాన్ని గతం దృష్టితో కాకుండా వర్తమాన స్ఫూర్తికి అనుగుణంగా మలచుకునే ధోరణి ఇది. *
(యువభారతివారి 'కావ్యలహరి' కీద్రిక్ర = చిన్న మార్పులతో)
ఒంటిపారల వెనక ఉద్వేగంతో కొట్టుకునే గుండెలచప్తుళ్లనూ భావసంఘ్యుర్థణల నెగళ్లనూ, . 4. 'Notonly the pasiness of the past, but of its presence' టి.యన్. ఇలియట్
| 3. ఆధునికుల పకికోధనశాల అంగంకాదు అంతరంగం నేటికవి బి(తం చేది
ఆముఖం'”
“మితోజనాన్ చేతయతే” (సూర్యుడు జనాన్ని మెల్కొలుపుతున్నాడు.) ఇది వేదబుక్కు. యుగయుగలుగా ప్రకృతీ, ప్రజలూ నిత్యం అనుభవిస్తున్న సత్య వాక్కు. నిద్ర సగం మృత్యువు. జీవులకు ఇది ఏనాడూ తప్పుదు. అంతమాత్రాన నిద్ర కాదు గెలిచేది-జాగృతి. తమస్సు కాదు నిలిచేది-ఉషస్సు. కాంతి చైతన్యస్వరూపం. అందుకే ప్రతిదినం ఉదయదిశలో అరుణారుణ భానుదీపం.
సూర్యుడు సృష్టికి మిత్రుడు, కఎ అంతే. చికటిదుప్పటి కప్పుకుని గురకపెట్టేల్‌కం కనులు విప్పేవాడు కవి.
మతాలు కొందరినే మేల్కొలుపుతాయి. రాజకీయాలు కొందరినే రగుల్కొలుపుతాయి. పదునున్న కఎత-సమాజాభ్యుదయం అదనెరిగిన కవిత అందరిని మేల్కొలుపుతుంది. అన్ని కాలాల్లోనూ చైతన్య విస్సులింగాలను రగుల్కొలుపుతుంది. అందుకే అసలైన కవిత విశ్వజనీనం, సార్వకాలికం.
ఈ సంపుటిపేరు ' 'దైతన్యలహరి”. తెలుగుకఎతను మలుపులు తిప్పన - తెలుగుజాతికి మెలకువలు నెర్పిన-అయిదుగురు ఆంధ్రకవుల చైతన్యస్సూర్తిని గూర్చి అయిదుగురు ఆలోచనాలోచనులు అందించిన ఉపన్యాసాల సంకలనమిది. ఆ అయిదుగురు విరు - తిక్కన, పాలకురికి, కృష్ణదేవరాయలు, వేమన, గురజాడ.
ఇంతకూ చైతన్యమంటే యేమిటి? “చిత” కుదుట పుట్టిన మాట యిది.
“చితి సంజ్ఞాన” అని వ్యుత్పత్తి, చిత, చిత్తం, చేతన-అన్నీ ఒకటే. చేతనా శబ్దభావార్థకమే చైతన్యం. చైతన్యమంటే స్టూలంగా జ్ఞానం. వేదాంత(గ్రంథాల్లో యలు కై ర్‌ు రం ర ఠా జ లా చఛ్చాతన్యవుంటే “అవపం౦ంచికృతజ్ఞానం*' (0౧౫౩|౧౦| undifferentiated consciousness). వేదాంతులదృవిలో ఇద్ నిరంపొరికం. శరీరాదీంద్రియసంపుటిచేత అనవచ్చిన్నం. అంటే ఇంద్రియాలచేత కప్పుబడనిది.
* యువభారతివారి 'బైతన్యలహరి” వీఠిక-కొద్దిమార్తులతో
సమోాక్షణం 80
ఆత్మ అవచ్చిన్నం. పరమాత్మ అనవచ్చిన్నం. ఈ దృష్ట్యా చైతన్యమంటే పరబ్రహ్మస్వరూపం. “సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం దవీంచ ధీమహి” అని దేవీభాగవతంలో వుంది. దేవి చైతన్యస్వరూపిణి. అఖిలశక్తిస్వ రూపిణి. ఇక్కడ చైతన్యమంటే Cosmic universal consciousness. (ప్రాచీనుల దృష్టిలో చైతన్యమంటే దివ్యశక్తి. ఆధ్యాత్మికస్ఫూర్తి, పరమజ్ఞానం, (బ్రహ్మజ్ఞానం. ఎజ్జన నృసింహపురాణాన్ని “విజ్ఞానాత్మక వాజ శయం” అంటాడు. ఇక్కడ విజ్ఞానం అంటే ఈనాడు మనం అనుకునే “సైన్సు” కాదు. అది సెంజీకటి కవ్వలివెలుగు'. చదువులలో మర్మం. పరమాత్మ పరిజ్ఞానం. ఈ రకంగా (ప్రాయికంగా ఆధ్యాత్మికపరిధిలో వాడబడే 'వైతన్య' శబ్దం ఈనాడు భౌతిక దృక్పథంలో వాడుకలో వుంది. 'జాతిలోచైతన్యం' అని వాడుక. ఇందులో స్వాతం(త్రకాంక్ష, సమసమాజ నిర్మాణధ్యేయం ద్యోతకమవుతున్నాయి. “వెనుకబడిన వర్గాల్లో చైతన్యం” తరతరాలుగా పాలకవర్గాలు, అగ్రవర్ణాలు తమ నోళ్ళకూ నొసళ్ళకూ బిగించిన సంకెళ్ళను తెంచుకునే ప్రతిఘటన దృక్పథం ఇందులో ధ్యనిస్తున్నది. 'విద్యార్జుల్లొ చైతన్యం” పాఠాలు చదవడమే కాదు. అవసరమైతే తమ హక్కుల కోసం పారాటాలు చేసే ఉద్యమస్ఫూర్తిని ఈ మాట సూచిస్తున్నది.
ఈ సంపుటిలోని చైతన్యమూర్తులైన కవులను ఈ రెండు దృక్కోణాల తోనూ చూస్తున్నాను. తిక్కన, పాలకురికి సోమనాథుడు, కృష్ణదేవరాయలు, వేమన, గురజాడ-ఈ అయిదుగురూ చైతన్యస్వరూపం అవగాహన చేసుకున్న వారే. తాము కాలూనివున్న కాలాన్ని తమ కృతులతో, చేతలతో చైతన్య దీప్తం చేసినవారే.
తిక్కన ఉన్నాడు. ఏమిటి ఈయన కలిగించిన చైతన్యం? “మామా” అని పిలిచిన మనుమసిద్దిక ర్ కృతికన్యను ధారపోయడం కాదు. లుకలుకలాడు తున్న ఆ ప్రభువు గద్దెను తన విజ్ఞతతో, రాజనీతిజ్ఞతతో నిలబెట్టడమూ కాదు. హరి మేలని, హరుడు మేలని కీచులాడుకుంటున్న ధార్మికరంగంలో సరికొత్త సమనయధృక్పథాన్న (ప్రతిపాదించడం, హరిహరాద్ద్వతాన్ని స్థాపించడం. అలా శివకేశవవిభేదాలతో కుమ్ములాడుకుంటున్న వారు అజ్ఞులుకారు. “ఏకం సతవి(ప్రా బహుధా వదంతి” అన్న ఆర్హోక్తిని వల్లించేవారే. పేర్లువేరైనా దెనుడొకడేనని, పూలు వేరైనా పూజ ఒకటేనని [గ్రహించినవారే. అయినా ఆనాడు తప్పు లేదు భిన్నమతాల
81 డా! సి. నారాయణరెడ్డి
(ప్రాగల్బ్యం; ఈనాటి రకరకాల పార్టీల రాజకీయాలలాగా. సమాజంలో ఇప్పుడు రాజకీయాలకున్న బ్రాబల్యం = రోజుల్లో మతాల కుండేదని తాత్సర్యం.
తిక్కన్న వ్యాసభారతాన్ని “ధర్మాద్వైత” దృష్టితో సమీక్షించాడు. వేదాలకు, అఖిలస్మృతివాదాలకు, బహుపురాణవర్గాలకు వాదైనచోట భారతమే నాలుగు పురుషార్దాలకూ న్యాయపీఠమని చెప్పాడు. నన్నయ కూడా అన్నాడు “ధర్మతత్త్యజ్ఞులు ధర్మశాస్త్రంబని” భారతాన్ని కొనియాడుతారని. అంతటితో ఆగలేదతడు. అధ్యాత్మవిదులకు, ఐతిహాసికులకు, నితివిచక్షణులకు, కవివృషభులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా తమ తమ దృక్కోణాలనుబట్టి భారతం గోచరిస్తుందని వివరించాడు. తిక్కన ఒక ధర్మాంశం మీదే తన దృష్టిని కేంద్రీకరించాడు. ఆ ధర్మాన్ని తానూ అద్ద్వైతదృష్టితోనే ఆకళించుకున్నాడు. ధర్మాచరణలో మత(ప్రమే యం లేని అద్దైతపథాన్ని అనుసరించాడు. అదే హరిహరాద్దైతం. తిక్కన్న ప్రతిపాదించిన ఈనూతనతత్త్యం ధార్మికజగత్తులో అపూర్వచైతన్యాన్ని కలిగించింది. తదనంతర కవులైన మారన, నాచన సోమన వంటి వారు ఈ దృక్పథాన్ని పాధేయంగా స్వీకరించి పయనించారు. పోతన్న కూడా భాగవతంలో పూర్వకవిస్తుతిలో తిక్కన్న మనీషిని “హరిహరచరణారవింద వందనాభిలాషి” గానే సంభాఎంచాడు.
తిక్కన్న చేసిన మరొగొప్పపని “జాత్యము గామి ఒప్పయిన సంస్కృత మెన్నడు జొన్స”నని ప్రతిజ్ఞ చేయడం. అంటే తెలుగును తెలుగువాడిలా తెలుగులా ('వ్రాయడమన్నమాట. తిక్కన్న అనగానే తెలుగు గుర్తుకొచ్చేది అందుకే. వేదవేదాంత విషయాలనైనా అలతిఅలతి తెలుగు పలుకులతో అందించవచ్చునని, ఆ భాష కంతటి జీవముందని అలనాడే నిరూపించిన మహాకవి తిక్కన్న. నన్నయ భారతాన్ని “జగద్దితంబుగ” అనువదిస్తే, తిక్కన్న “ఆం(ధ్రావళి మోదముంబొరయునటుగ” రచించాడు. అదీ తేడా.
' తిక్కన్న అభిమానించిన తెలుగునే మరింతగా అతిశయింపచేసినవాడు పాలకురికి సోమన్న. పాలకురికి కాలానికి వృత్తరచనదే పెత్తనం. చంపూకావ్యాలదే సామ్రాజ్యం. సంస్కృత పదభూయిష్టరచనదే సార్యభామత్యం. అప్పుడు పట్టుకున్నాడు సోమన్న జానపదుల నోళ్ళలో, రోళ్ళలో, రోకళ్ళలో, తిరుగళ్ళలో
సమోక్షణం 82
తిరుగుళ్చుపడుతున్న ద్విపద గీతులను. ఎటిని తెలుగుమాటలనొద్దు వేదాలు సుమా- అని ఎలుగెత్తాడు. సూటిగా తేటగా కవిత చెప్పాలంటే జాను తెనుగుకు దీటు లేదని చాటాడు. ఏధిమానిసి మాట్లాడుకునే తెలుగును అపౌరుషేయాలైన వేదాల సరిబంతిలో నిలపడం పాలకురికి కలేజాకు నిదర్శనం. ఇతడు ఇతివృత్తంకోసం 9 వ్యాసుణ్ణ ఆ(శయించలేదు. ఏ పురాణాలనో తవ్వలేదు. తనకు కొంచెం ముందుగా ధర్మఎరుడుగా వీరవిహారం చేసిన బసవని చరితను ఎన్నుకున్నాడు. ఆ బసవనికాలంలోనే మట్టిలో పుట్టి మాణిక్యాలుగా విలసిల్లిన మడవాలు మాచయ్యవంటి సామాన్యజనుల జీవితగాథలను స్వీకరించాడు. చదువురాని జానపదుల గుండెచప్పుళ్ళకు వాహికలైన రెండు కాళ్ళ ద్విపదలలో దండికావ్యాలు సృష్టించాడు. శబ్దాన్ని వ్యాకరించగలిగే అపారవ్యుత్పత్తి ఉన్నా జనసామాన్యంలో వాడుకలో ఉన్న వైరిసమాసాలకు, వ్యావహారికపదరూపాలకు కావ్యగౌరవం కలిగించాడు.ఆవేశం కావ్యానికి ప్రాణభూతమని అక్షరాలా నిరూపించాడు. భాషలో, భావనలో, వస్తువులో, ఛందస్సులో ఆధునికులకు తలబంతి కాగలిగిన (ప్రతిఘటనదృక్సథాన్ని ప్రదర్శించిన దైతన్యమూర్తి పాలకురికి సోమనాథుడు. అయితే, ఇంతటి వైతాళికుడు ఆ రోజుల్లో రాశికి రాకపోవడానికి కారణం మతంపట్ల అతని కున్న పాక్షికదృకృథం. తాను భవితో (శైవేతరునితో) భాషింపనన్నాడు. ఫరవాలేదు. ఆ భవిని తాకినా, కనీసం చూసినా పంచమహాపాతకాలు చుట్టూకుంటాయన్నంతగా గిరిగీసుకున్నాడు. భాష విషయంలో, కవిత్వ విషయంలో అంతటి స్వచ్చందతను చూపిన ఈ దేశికవీంద్రుడు మత విషయంలో అంతగా ఎందుకు కుంచించుకు పోయాడో ? ఆశ్చర్యం వేస్తుంది.
కృష్ణదేవరాయాలు ఆంధ్రకర్ణాటాధీ శ్యరుడు. సాహితీసమరాంగణ సార్వభౌముడు. రాజకఏి. కవిరాజు. అయినా అతబ్జ్లీ దొడ్డకవిగా నిలబెట్టినవి ఈ సనదులూ, బిరుదులూ కావు. చేవగల తెలుగు “అముక్తమాల్యద” వంటి ప్రాఢకావ్యం (వాయడం. అంతకుముందు అతడు వ్రాసినవన్నీ సంస్కృత కావ్యాలే. అప్పటికి తెలుగు ఈ రాయల దృష్టికి ఆనినట్టు లేదు. కలలో శ్రీకాకుళంలో వెలసిన తెలుగురాయడు అనతిచ్చాడు గోదాదేవిగాథ తెలుగులోనే వ్రాయవలసిందని. ఇరకమ్? ఆ కన్నడరాయడు గంటమందుకున్నాడు. ఎక్కడెక్కడి తెలుగు
83 డా! సి. నారాయణరెడ్డి
పలుకుబళ్ళనో ఏరి రాశిపోశాడు. “దేశభాషలందు తెలుగు లెస్స” అంటూ ఏనాడో శ్రీనాథుడు అలవోకగా అన్నమాటను కృత్యాదిలో తిరగవేశాడు. తెలుగు కలకండ అని ఆనాటి అన్యభాషీయులకు కన్నుగుట్టేట్టు చాటి చెప్పాడు. సమకాలిక ప్రబంధకవులు చేయని మరో మంచిపని కూడా చేశాడు. వారికెవ్వరికీ అగుపడని సామాన్య గృహస్థుల ఇళ్ళనూ, వాకిళ్ళనూ, చూరులనూ, (బ్రతుకు తీరులనూ హృదయంగమంగా చిత్రించాడు. “విలసద్భావరసాద్యలంకృతులచే నొప్పారు” ఆం(ధ మహాకృతులెన్ని వున్నా “తెలుగంచు” చెవి పట్టని పండితుల తుప్పుడుల్పాడు. అయితే తెలుగుతనానికి కలికితురాయి కూర్చిన ఈ కవిరాజే “ఉషుస్నాత ప్రయాతద్విజావళిపిందీకృతశాటు” లంటూ మధ్య మధ్య తెలుగువారి గూబ లదరగొట్టాడు. అందుకు కొంతవ్యధ కలిగినా ఒకటి మాత్రం చెప్పుకోవాలి. తన ఆస్థానంలో కవిదిగజాలను పోషించడంలోనేమి, మనుచరిత, పారిజాతాపహరణం వంటి రసవత్‌ప్రబంధాలకు కృతిపతిత్వం వహించడంలో నేమి, “ఎదురైనచో తన మదకరీం[ద్రము డిగ్గి” వీధిలో వెళ్ళే తెలుగుకవికి కేలూతనొసగి ఎక్కించుకోవడంలో నేమి, పరదురా[క్రమణలో మగ్గిపోతున్న తెలుగునేల నాలుగు చెరగులను ఒక్కటిగా ముడిచి, తెలుగు సంస్కృతిని వెల్లగొడుగు(క్రింద నిలిపి, తెలుగువారి యశోరశ్మిని ఖండాంతరాల దాకా వ్యాపింపచేయడంలో నేమి ' కృష్ణరాయడు నాన్యతోదర్శనీయడు, ప్రాతఃస్మరణీయుడు.
పాలకురికి సోమన్న ద్విషదల్ల్ కావ్యం వ్రాయడర్థి గొప్ప (ప్రయోగమే. కానీ అప్పుడప్పుడు, ఆవేశం అంచులు ముట్టినప్పుడు, కావ్యకళా(ప్రౌఢి కాకలు తీరినప్పుడు అతడు పదేసి పంక్తులదాకా సంస్కృత సమాసాలతో సాముగరిడీలు చేశాడు. మరి వేమన్న అలా కాదు. ఇతడు దేశికవి. ఇతడు వరించిన ఛందస్సు తెలుగునాట గజ్జెలు కట్టుకున్న ఆటవెలది. ఆ ఆటవెలది పద్యంలో చివరి పంక్తి “విశ్వదాభిరామ వినురవేమ”కే సరిపోతుందాయె. ఒక మిగిలినవి మూడు పంక్తులు. ఆ మూడు పంక్తుల్లో ముల్లోకాల జీవరహస్యాలను ఇమిడించాడు. తిక్కన్న తరువాత ' తెలుగునుడికి ఎంతటివాడి వుందో రుజువు చేశాడు. “కొండ అద్దమందు కొంచెమై యుండదా” అన్నట్టు బ్రహ్మాండమంతటి విషయాన్ని చిన్న చిన్న పద్యాలలో కుదించి చెప్పాడు. “అల్ఫాక్షరముల అనల్వార్దరచన అన్న పొలకురికి నినాదాన్ని
సమోక్షణం 84
గుట్టుచప్పుడు గాకుండా ఆచరించి చూపాడు. వేమన్న తెలుగు జాతికిచ్చిన కానుకలు ఇంకా ఉన్నాయి. సమకాలీన సమాజంలోని మేడిపళ్ళ వొట్టలు విప్పిచూపడం, పురుషులెవరో పుణ్యపురుషులెవరో విడమరిచి చెప్పడం, అవసరమైతే కవి తన కలాన్ని కత్తివాదరలా (ప్రయోగించగలడని నిరూపించడం. ఈ ఒక్క పద్యం చాలు ఈనాటి సంఘాన్ని ఎడాపెడా వాయించడానికి.
“కులముగల్లువారు గోత్రముగలవారు విదైచేత వి[ర్రవగువారు
(ఈ) పసిడిగల్లువాని బానిసకొడుకులు విశ్వదాభిరామ వనుకు మో
కాదంటామా? పెదవులు కాదన్నా హృదయం ఎదురుతిరుగుతుంది. మతమౌఢ్యాలనూ, పైపై మెరుగులనూ, దగాలనూ, దౌవ్య్యాలనూ అడుగడుగునా ఎత్తి చూపి, ఈనాటికీ తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకునివున్న ప్రజాకవి వేమన్న. బతికి వున్నప్పుడు అతని పద్యాలు సామాన్యజనంలో ఎంతటిసంచలనం కలిగించాయో నేటికీ అఖిలాంధ్రకోటికీ అంతటి చైతన్యాన్నే కలిగిస్తున్నాయి. తెలుగు కవితకు ఖండాంతరకీర్తిని తెచ్చిపెట్టింది వేమన్నే. “నీ భాషకు మూలధనం ఏ”దని ఎవరైనా అడిగితే దోసిళ్ళకొద్ది ఎత్తి చూపగలిగేవి వేమన్న పద్యాలే.
.గురజాడను వాల్మీకి అన్నారు. వాల్మీకి రామకథను కావ్యంగా మలిచాడు. రాముడు ఆదర్శపురుషుడు. ఆ రామకథను యుగయుగాలకూ స్మరణీయంగా చేసింది వాల్మీకే. మరి గురజాడను వాల్మీకితో ఎందుకు పోల్చారు? ముత్యాల సరాలు సృష్టించినందుకా? కాదు. అంతవరకు మిశ్రగతిలో, వృషభగతి రగడలో, మేలుకొలుపు పాటల్లో తలదాచుకున్న ఛందస్సే అది. వ్యావహారిక భాషను కవిత్వంలో ప్రవేశపెట్టినందుకా? కాదు. జానపదగేయాల్లో చిరకాలంగా ఉన్నదే అది. నా దృష్టిలో ఒక్క “దేశభక్తి” గీతం చాలు గురజాడను వాల్మీకి అనడానికి. రామాయణం వల్ల ఆదర్శమానవులెవరో తెలిసింది. దేశభక్తిగీతం వల్ల దేశమంటే రాళ్ళకూ, రప్పలకూ, చెట్టకూ, చేమలకూ అతీతమైన 'మనిషనని తెలిసింది.
85 డా॥ సి. నారాయణరెడ్డి
“దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్”
మనిషిని ఇంత నిర్దిష్టంగా దివ్విటిపట్టి చూపిన కవిత తెలుగులో మరొకటి లేదు. మనిపిని ఈనిషిగా చూపడంకన్న మహత్తరకవిత మరేదీలేదు. అందుకే అంటున్నాను 'దెశభక్తి గీతం ఒక్కటే చాలు గురజాడను (ప్రవక్తగా నిలబెట్టడానికని. కాలం గడుస్తున్నకొద్దీ గురజాడ (ప్రభావం తెలుగునాట మరింతగా కుదురు కుంటున్నది. ఇరవయ్యో శతాబ్ది తొలిజాములో అతడందించిన చైతన్యం (క్రమంగా మధ్యాహ్న మార్తాండబింబంలా (ప్రకాళిస్తున్నది. ఆధునికుల భావచైతన్నానికి అడుగుజాడ గురజాడదే.
ఈ ఐదుగురు కవులూ భిన్న భిన్నకాలాల్లో వున్నవారు. ఐదుగురి తీరు తెన్నులూ వేరువేరు. కానీ వీరందరూ సమకాలినసమాజాన్ని, ఆ తరువాతి తరాలనూ ప్రభావితం చేసినవారే. అయితే ఒక విశిష్టలక్షణం ఈ అయిదుగురినీ ఏకసూత్రంలో ముడివెస్తున్నది. అదే దేశీయత. ఈ అయిదుగురు తెలుగు పలుకుబడికి పట్టం కట్టినవారె. తెలుగుతనాన్ని తమ రచనలద్యారా దీపింపచేసిన వారే. తెలుగువాడు తరతరాలకూ చెప్పుకోగలిగిన ఉత్తమకృతులు రచించినవారే. మొక్కవోని వ్యక్తిత్వము([ద్రగలవారే.
య
ఆనాడు అన్నది - ఈనాడు ఉన్నది
అనగనగా ఒక ధర్మరాజుగారు. ఆయన తమ్ముడు అర్జునుడు. అతడు మయుడనే ఒక విశ్వకర్మ ప్రాణం రక్షిస్తాడు. “అందుకు ప్రత్యుపకారం న చేయమంటారు?” అని అడుగుతాడు మయుడు ఆ ధర్మరాజుగారి దగ్గర వాసుదేవసహితుడిగా ఉన్న అర్జ్హునుణ్ని. కృష్ణుడు పెద్ద బుర్రకదా! ప్లేట్లు మార్చ నేటి సగటు రాజకీయులకు అప్పుడప్పుడుపకరించే కిటుకుల్లొ ఘటికుడు కదా! చాలా సేపాలోచించి ఈ సృష్టిలో ఇంతవరకు లేనంతటి ఒక గొప్పు సభను నిర్మించి, వెంటనే తీసుకురా అని అంటాడు. అన్నట్టుగానే అపూర్వసభను మయుడు నిర్మించి ఎనిమిదివేల రాక్షసకింకరులచేత మోయించుకుని తెచ్చి ధర్మరాజుకు ఇచ్చిపోతాడు. ప్రభుత్వంలో ఉన్న ఒక ఉన్నతోన్నతాధికారి ఒకానొక కాంటట్రాక్టర్కి ఘనంగా సహాయపడితే పాపం ఆ కాంట్రాక్టర్ ఏం చేయాలి? ఏ బంజారాహిల్సుల్ నో ఏదో ఒక చిన్నసైజు బిల్లింగైనా కట్టి ఇవ్వాలి కదా! ఇది “ఉపకారికి ఉపకారం చెసె పురాణధర్మమే కదా! అదే ఆ మయుడు చెసింది.
ధర్మరాజుగారు సభా(ప్రవేశం చెశారు. మన గ హ(ప్రవేశాల ధోరణిలోనే. అయితే మనకు మిత్రులూ, బంధువులూ వస్తే, ఏవో చిన్నపాటి కానుకలందిస్తే, ధర్మరాజుగారికి ఛోటా మోటా సామంతులు, ఆశ్రితులు గుర్రాలు, ఏనుగులు, డబ్బూ దస్కం మాత్రమేకాదు “గణిక”లను (పరిచారికలు) కూడా సమర్పించు కుంటారు. ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఎత్తు గద్దెలమిద ఉన్నవాళ్ళకు అవసరాలవారు, అవకాశాలకోసం అంగలార్చే వారు సమర్పించుకునే రకరకాల “మొత్తాలు” గుర్తుకొస్తాయి.
ఇదిలా వుండగా ఆ సభకి వచ్చినవాళ్ళలో శునక, మౌంజాయన, మందపాల, బక, దాల్భ్య, రైభ్యక, కుత్స, తిత్తిరిలాంటివారు (ఇవి రుషులపర్లు సుమా) చెప్తుకోదగినవారు. మరి మన పెద్దలు కొందరు ఇలాంటి ఉత్సవాలు చేసుకున్నప్పుడు ఆశీర్వదించడానికి వచ్చినవాళ్ళలో మఠాధిపతులూ, పీఠాధిపతులూ, జ్యోతిష్కులూ, జూతాతకా, ముల్లాలూ ఉండరూ? అప్పుడూ అలాగే ఉండేది.
87 డా| సి. నారాయణరెడ్డి
మరి, ఇందరు మహానీయులొచ్చినప్పుడు నారదుడు రాకుండా ఎలా ఉంటాడు? అయితే ఎప్పుడూ వచ్చినట్టుగా ఈ సారి కలహం విత్తనాలు చల్లడానికి రాలేదు. ధర్మరాజు గారిని “ఏమండి మీ ప్రభుత్వం ఎలా నడుస్తున్నది? మీరు లోగడ (ప్రకటించిన 5 సూత్రాలూ, 6 సూత్రాలూ, 20 సూత్రాలూ స(క్రమంగా ఆచరణలో పెడుతున్నారా?” అని అడిగాడు. (ఈ వాక్యంలోని అభిపాయం మా(త్రమే నారదుడిది. మాటలు నావి.) ఆ తర్వాత గుక్క తిప్పుకోకుండా నారదుడు రాజనీతిని గూర్చి ఒక గంటసేపు ఉపన్యసించాడు - మా యూనివర్సిటీల రాజనీతి శాస్తాచార్యులు విస్తుపోయేటట్టు, రాజకీయాల ఎత్తుగడలో కాకలు తీరిన శుక్రాచార్యులు ఖంగుతినేట్లు.
ఆ గంట ఉపన్యాసాన్ని నన ఏకరువు పెట్టడం స్థలాభావం అనే ఇబ్బందికి దారి తీస్తుంది. కొన్నే చెబుతాను (ప్రస్తుతానికి.
1. ధర్మరాజుగారూ! మీరు దొంగల బెడదలేకుండా ప్రభుత్వాన్ని నడుపు తున్నారు కదా! కొతిరతస్ మ “భృత్యవరులు” అధికధనలోభంతో ఆ దొంగల దగ్గరనుంచే డబ్బు పుచ్చుకొని వాళ్ళ దొంగతనాల్ని కప్పిపుచ్చరు కదా!
దొంగలంటే మనం తీసుకొనే అరాలు ఎన్నా ఉన్నాయి. స్మగ్లర్లు, నల్లబజారు థి 69 9
నడిపే వర్తకులు, దొంగసారా తయారుచేసేవాళ్లు, లంచగొండ్లు, లాలూచీపరులు అందరూ వస్తారు ఈ పరిధిలోకి. వాళ్ళదగ్గరనుంచి డబ్బు తీసుకోవడం అనే అంశంకింద బహురూపాలు కనిపిస్తాయి. పార్టీఫండ్లు, చందాలు, ఉత్సవాలపేరిట విరాళాలు - ఇవన్ని ఇమిడిపోతాయి. నారదుడు ఎంత దూరదృష్టిగలవాడు? ' ద్యాపరయుగంలోనేపందొమ్మిదివందలడెభ్సె తర్వాత తతంగాన్ని ఊహించ గలిగాడు.
2. నారదుని మరో ప్రశ్న, ధర్మరాజుగారూ! “హీనులగు కర్షకులకు ధాన్యంబు బీజములు సరఫరా చేస్తున్నారా”? ra
ఈ (ప్రశ్నకు సమాధానం పల్లెలనడిగితే చెబుతాయి బిక్కపోయిన చూపులతో. నారదుడి (ప్రశ్చలో ఉన్న “హినులగు కర్షకు” లంటే గుణహీనులు కాదు - ధనహినులని అర్థం. నేటి ప్రభుత్వాల మేటి ఆశయం కిసాన్‌లకు, మజ్ఞార్లకు, హరిజనులకు, గిరిజనులకు, అపారంగా సహాయం చేయడమే కదా! రుణాల
సమోాక్షణం 88
రూపంలో, సబ్సిడీల రూపంలో, విత్తనాలూ ఎరువుల రూపంలో. ఆశయం బాగానే ఉంది. అది ఉపన్యాసాల కొళాయిల్లో నుంచి ప్రతిరోజూ పత్రికల పాత్రల్లో తెగనిండుతూనే ఉన్నది. అయితే మంజూరయిన నిధులన్నీ బలహీనవర్లాలకందు తున్నాయా? పేద రైతులకు పుచ్చిపోని విత్తనాలు, కల్తీలేని యూరియాలాంటి మందులు అందుతున్నాయా? దీనికి సమాధానం మళ్లీ ఆ పల్లెలే చెబుతాయి.
3. నారదుడడిగిన ప్రశ్నలలో మరొకటి. గురులను, వృద్దశిల్పులను సాధుజనుల, “పేదరికము పొరయకుండగ।బోతే” అని.
నేటి కళ్ళతో చూస్తే గురువుల్లో ప్రాథమికోపాధ్యాయులు మొదలుకొని ప్రధానాచార్యులవరకూ వస్తారు. వృద్దశిల్పుల్లొ వృత్తి నుంచి రిటైరయిన వృద్దకళాకారులందరూ వస్తారు. ఒక రకంగా బలహీన వర్గాలూ, దళితవర్గాలూ ఈ పరిధిలోకి చేరుతాయి. వీళ్లందరిని పేదరికం లేకుండా కాపాడుతున్నావా ధర్మరాజా-అని నారదుని (ప్రశ్నసారాంశం. టీచర్లగతి పాలకులకు తెలుసు. వృద్దకళాకారులగతి సంవత్సరానికోసారి ఆ కళాకారుల సంఘాలు సభలు పెట్టి వినిపించే ఘోషలకు తెలుసు. ఇక సాధుజనుల సంగతి అధికారంలో వున్న గోముఖవ్యాఘాలకు విపరీతంగా తెలుసు. అంతవరకెందుకు? అందరిని అన్నిటిని మించి 'గరీబీ హటావో” నినాదానికి ఖరాఖండిగా తెలుసు.
4. ఆ మధ్య మనదేశానికి 'అత్యవసరపరిస్టితి' ఏర్పడింది. ఎటూ చూసినా సమ్మెలు, రోసి గలు, బందులు, ఘెరావలు, ఊరేగింపులు, హుంకరింపులు. తఖ్లు (గద్ద) తల కిందులయ్యే సూచనలు కనిపించాయి. “ప్రమాదం, ప్రమాదం. కేంద్రానికి ప్రమాదమంటే దేశానికే ప్రమాదం కదా! పైగా రేగుతున్న ప్రతిఘటనోద్యమాలకు పత్రికలు శంఖాలూదుతున్నవాయె. ఆర్డినెన్సు జాదీ అయ్యింది. పత్రికల మూతులకు కుట్టుపడ్డాయి. ప్రజాస్వామ్యవాదుల నాల్కలకు సంకెళ్లు పడ్డాయి. పత్రికల్ణ్ వచ్చేవార్తలు ప్రభుత్వం శంఖంలో పోసిన తీర్జాలైనవి. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. ఏ జైళ్ళలో ఎందరు నలుగుతున్నారో, ఏ నిర్బంధాలకు ఎవరుమూలుగు తున్నారో ఎరుగలేని పరిస్టితి ఏర్పడింది. ఒకరకంగా. అసలు వార్తలు పత్రికల్లో రాకపోవడంవల్ల సత్యం మసకపాలై పోయింది. నారదుడు సామాన్యుడా మరి! త్రికాలజ్ఞుడు. లోకంలో వార్తలకున్న (ప్రాముఖ్యాన్ని బాగుగా తెలిసినవాడు. ఆ కాలంలోనే ఈ కాలాన్ని అంతర్వీక్షించి ధర్మరాజు గారికి ఉపదేశించాడు. ఇలాగా-
89 డౌ॥ సి. నారాయణరెడ్డి
“వార్హయందు జగము వర్తిలుచున్నది
అదియలేనినాడు అభిలజనులు
అంధకారమగ్నులగుదురు కావున
వార్త నిర్వహంపవలయు పతికి
ఇక్కడ “పతి” అంటే రాజు. రాజంటే రాజ్యాధికారాన్ని వహించిన శక్తి. ఆ శక్తే పత్రికలను అడకత్తెరల్లో బిగించి వుంచితే అసలు వార్త బయటికి రాదు. దేశానికి వెలుగులేదు.
“వారి శబ్దానికున్న అనేకారాలో ఒకటి “సమాచారం” నం. ల) (అ ౫౧
భూగోళమంత మనిషి బొమ్మ పాటలో ఏముంది నా మాటలో ఏముంది మట్టీ మనిషీ ఆకాశం
వ్యక్తిత్వం
గదిలో సముద్రం
డా॥ సి. నారాయణరెడ్డి
199! 1994 1995 1995 1996 1996 1997 1999 1999